Prabhas: టాలీవుడ్‌లో ఇప్పుడు ఫ్యాన్స్ మధ్య ఒక పెద్ద వార్ నడుస్తోంది. మార్చిలో రిలీజ్ అయ్యే రామ్ చరణ్ ‘పెద్ది’ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ ఇప్పటికే వచ్చేయగా, సంక్రాంతికి రిలీజ్ అంటున్న ప్రభాస్ ‘ది రాజాసాబ్’ ఫస్ట్ సింగిల్ మాత్రం ఇంకా రాలేదు! దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ ఫుల్ ఫ్రస్టేషన్‌లో ఉన్నారు.
‘ఉప్పెన’ లాంటి సూపర్ హిట్ సినిమా తీసిన డైరెక్టర్ బుచ్చిబాబు సానా ఇప్పుడు రామ్ చరణ్‌తో ‘పెద్ది’ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా మార్చి నెలలో విడుదల కావాల్సి ఉంది. సినిమా రిలీజ్‌కు ఇంకా నాలుగు నెలల సమయం ఉన్నా, డైరెక్టర్ బుచ్చిబాబు టీమ్ ‘పెద్ది’ ఫస్ట్ సింగిల్ ‘చికిరి చికిరి’ ని రిలీజ్ చేసింది. AR రెహమాన్ మ్యూజిక్, చరణ్ మాస్ స్టెప్పులతో ఈ పాట యూట్యూబ్‌లో పెద్ద సెన్సేషన్ అయ్యింది. రిలీజ్ డేట్ ఇంకా దూరంగా ఉన్నా, ఇంత ముందుగా పాట ఇచ్చేయడం, ‘ది రాజాసాబ్’ టీమ్‌కు ఒక స్వీట్ షాక్ ఇచ్చినట్టే!
ALSO READ: SS Rajamouli: శంకర్, హిరానీ తర్వాత ఇప్పుడు రాజమౌళి టర్న్!
ఇక్కడే ప్రభాస్ ఫ్యాన్స్‌కి ఆవేశం కట్టలు తెంచుకుంటోంది. డైరెక్టర్ మారుతి తెరకెక్కిస్తున్న ‘ది రాజాసాబ్’ సినిమా సంక్రాంతికి విడుదల కావాలి. జనవరికి రిలీజ్ అనౌన్స్ చేసి కూడా, నవంబర్ వచ్చినా పాట గురించి చిన్న హింట్ కూడా మారుతి టీమ్ నుంచి రాకపోవడం అభిమానుల సహనాన్ని పరీక్షిస్తోంది. ఆల్రెడీ ఈ సినిమా టైటిల్ లాంచ్ విషయంలోనూ చాలా లేట్ అయింది. ప్రభాస్ లాంటి గ్లోబల్ స్టార్ సినిమాకు ఇలా ప్రతి విషయంలో ఆలస్యం జరుగుతుండడం ఫ్యాన్స్‌కు కోపం తెప్పిస్తోంది. బుచ్చిబాబు తీసిన ‘పెద్ది’ పాట వచ్చేసింది. మరి మారుతి తీస్తున్న మా ‘ది రాజాసాబ్’ పాట విషయంలో ఈ లేట్ ఎందుకని ప్రభాస్ అభిమానులు సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేస్తున్నారు. ఫ్యాన్స్ ఫుల్ ఫైర్ లో ఉన్నారు. ‘రాజాసాబ్’ టీమ్‌పై వెంటనే ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేయాలని లేదా కనీసం రిలీజ్ డేట్ అయినా ప్రకటించాలని ఒత్తిడి బాగా పెరుగుతోంది. ఫ్యాన్స్ ఇంతలా వెయిట్ చేస్తున్న ఈ సినిమా పాట త్వరలోనే ఒక సర్ప్రైజ్‌తో రావాలని, ఈ వెయిటింగ్‌ను మర్చిపోయేలా చేయాలని అంతా కోరుకుంటున్నారు. థమన్ అందించే ఆ మాస్ బీట్ కోసం అందరూ ఆత్రుతగా ఉన్నారు.


