Thursday, December 19, 2024
Homeచిత్ర ప్రభTheatre competition: పద్య నాటక పోటీలు

Theatre competition: పద్య నాటక పోటీలు

రక్తి కట్టించే పద్య నాటకాలు

పౌరాణిక పద్య నాటకాలను కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని పలువురు వక్తలు అన్నారు. తెలంగాణ భాష సంస్కృతి శాఖ, సంగీత నాటక అకాడమీ సహకారంతో తెలంగాణ నాటక సమాజాల సమైక్య సౌజన్యంతో శివాని ఆర్ట్స్ అసోసియేషన్ 15 వ వార్షికోత్సవ సందర్భంగా తెలంగాణ స్థాయి ఆహ్వాన పద్య నాటక పోటీల నవరాత్రులను పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో నిర్వహించారు.

- Advertisement -

కార్యక్రమానికి అతిథులుగా తెలంగాణ నాటక సమాజాల సమైక్య అధ్యక్షుడు తడకమళ్ల రామచంద్ర రావు, అధ్యక్షుడు ఆకుల సదానందం, కార్యదర్శి సాదు శ్యాం ప్రసాద్ పాల్గొని నాటక పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. అంతరించిపోతున్న నాటకాలను భవిష్యత్ తరాలకు అందించాలనే ఉద్దేశంతో వ్యాస కళాక్షేత్రం అధ్యక్షుడు వేద వ్యాస్ వెంకటేష్ రాష్ట్రస్థాయి పద్య నాటకాలను నిర్వహించడం అభినందనీయమన్నారు.

అధ్యక్షుడు వేదవ్యాస్ వెంకటేష్ మాట్లాడుతూ.. సంస్థ 15వ వార్షికోత్సవ సందర్భంగా తెలంగాణ స్థాయి పద్య నాటక పోటీలను డిసెంబర్ 12 నుంచి 20వ తేదీ వరకు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. తమ సంస్థ ద్వారా అనేక కార్యక్రమాల నిర్వహించి కళాకారులను ప్రోత్సహిస్తున్నామని తెలిపారు.

కార్యక్రమంలో హిందు ప్రసాద్ ఎడ్యుకేషనల్ సొసైటీ అధ్యక్షుడు పాండవుల హరిప్రసాద్, ప్రముఖ రంగస్థల కళాకారుడు కర్నె కోట మహేశ్వర్ పాల్గొన్నారు. సభకు ముందు మిర్యాలగూడ సంస్కృతిక కళాకేంద్రం ఆధ్వర్యంలో ప్రదర్శించిన ‘రావణ’ నాటక ప్రదర్శన ఆకట్టుకుంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News