Sunday, July 7, 2024
Homeచిత్ర ప్రభAvatar 2: తొలి రోజు వసూళ్లలో సత్తా చాటిన ‘అవతార్–2’.. ‘అవెంజర్స్: ఎండ్‌గేమ్’ను దాటిందా?

Avatar 2: తొలి రోజు వసూళ్లలో సత్తా చాటిన ‘అవతార్–2’.. ‘అవెంజర్స్: ఎండ్‌గేమ్’ను దాటిందా?

Avatar 2: జేమ్స్ కామెరూన్ రూపొందించిన విజువల్ వండర్ ‘అవతార్–ద వే ఆఫ్ వాటర్’ దేశంలో భారీ వసూళ్లు సాధించింది. అంచనాలకు తగ్గట్లే మొదటిరోజు భారీ వసూళ్లు సాధించింది. ఇండియాలో ఈ చిత్రం రూ.38.40 కోట్ల వసూళ్లు సాధించింది. ఒక హాలీవుడ్ చిత్రం ఈ స్థాయి వసూళ్లు సాధించడం చాలా అరుదు.

- Advertisement -

అనేక భారతీయ చిత్రాలకు ధీటుగా ఈ సినిమా మొదటి రోజు వసూళ్లు సాధించింది. గతంలో వచ్చిన హాలీవుడ్ చిత్రాలు ‘అవెంజర్స్: ఇన్ఫినిటీ వార్’ (రూ.31 కోట్ల వసూళ్లు), ‘స్పైడర్‌‌మ్యాన్:నోవే హోమ్’ (రూ.32 కోట్ల వసూళ్లు) చిత్రాలను దాటింది. అయితే, హాలీవుడ్ చిత్రాల్లో ఇండియాలో అత్యధిక వసూళ్లు సాధించిన ’అవెంజర్స్:ఎండ్‌గేమ్’ చిత్రాన్ని మాత్రం దాటలేకపోయింది. ఈ చిత్రం ఇండియాలో రూ.51 కోట్ల వసూళ్లు సాధించింది. తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ చిత్రం భారీ వసూళ్లు సాధించింది. మొదటి రోజు ఈ చిత్రం రూ.14 కోట్ల వసూళ్లు సాధించింది.

ఇండియాలోని ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలుగు రాష్ట్రాల్లోనే ఈ చిత్రానికి ఆదరణ ఎక్కువగా లభించింది. ‘అవతార్-2’ ప్రపంచవ్యాప్తంగా అత్యధిక థియేటర్లలో విడుదలైంది. గతంలో ‘అవెంజర్స్:ఎండ్‌గేమ్’ చిత్ర పేరిట ఉన్న రికార్డును ఈ సినిమా తిరగరాసింది. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 50,000 థియేటర్లలో ఈ సినిమా విడుదలైనట్లు అంచనా. అమెరికా, కెనడాల్లోనే దాదాపు 12,000 స్క్రీన్లలో ఈ సినిమా విడుదలైంది. థియేటర్లు ఉన్న ప్రతి దేశంలోనూ ఈ చిత్రం విడుదలైందని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి. భారీ స్తాయిలో రిలీజ్ కావడంతో ప్రపంచవ్యాప్తంగా మొదటి రోజు కలెక్షన్లు కూడా అదేస్థాయిలో ఉండే అవకాశం ఉంది. అయితే, మొదటి రోజు కలెక్షన్ల వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News