Saturday, November 15, 2025
Homeచిత్ర ప్రభTollywood Heroines: డేంజర్ జోన్‌లో ఈ నలుగురు హీరోయిన్లు!

Tollywood Heroines: డేంజర్ జోన్‌లో ఈ నలుగురు హీరోయిన్లు!

Tollywood Heroines: స‌క్సెస్‌తో వచ్చే క్రేజ్.. అందులో ఉండే కిక్ వేరే లెవల్. వాటితో వ‌చ్చే ఉల్లాసం.. ఉత్సాహంతో ఎడాపెడా సినిమాలు ఒప్పేసుకుంటారు. కానీ, ఎన్ని సినిమాలు చేసినా? స‌క్సెస్ లేకపోతే అందరిలో చులకన అవుతారు. ప్రస్తుతం మన సౌత్ సినిమా ఇండస్ట్రీలో ఓ నలుగురు హాట్ బ్యూటీలు ఇలాంటి స‌క్సెస్ కోసమే ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. వాళ్ళే పూజాహెగ్డే, కీర్తి సురేష్, శ్రుతి హాస‌న్, అనుష్క‌. ఈ నలుగురు గత కొంతకాలంగా సరైన స‌క్సెస్ లేక రేసులో బాగా వెనకబడి ఉన్నారు.

- Advertisement -

ముంబై నుంచి డైరెక్ట్ గా చెన్నైలో ల్యాండ్ అయింది పూజాహెగ్డే. ఈ బ్యూటీ సాలీడ్ గా కంబ్యాక్ ఇచ్చి కూడా ఇంత వ‌ర‌కూ స‌క్సెస్ చూడలేకపోయింది. రీ ఎంట్రీ ఇస్తూ, కోలీవుడ్ హీరో సూర్యతో చేసిన ‘రెట్రో’ మూవీ తీవ్రంగా నిరాశ‌ ప‌రిచింది. ఇక రీసెంట్ గా వచ్చిన సూపర్ స్టార్ రజినీకాంత్ ‘కూలీ’ మూవీ కూడా, పూజాని బాగా డిజప్పాయింట్ చేసింది. ఈ మూవీలో చేసింది ఐటం సాంగ్ అయినా కూడా, కలిసి వచ్చిందేమీ లేదు. కూలీలో ఉన్న స్పెషల్ నంబర్ ‘మోనికా’ పాట హిట్ అయినా, ఆ క్రెడిట్ పూజాకి దక్కలేదు.

Also Read- Bhagyashri Borse: మూడో సినిమాతోనైనా భాగ్య‌శ్రీకి హిట్టు ద‌క్కేనా – ఆశ‌ల‌న్నీ ఆ సినిమాపైనే!

ప్ర‌స్తుతం పూజాహెగ్డే హీరోయిన్ గా కేవలం త‌మిళ్ లో రెండు సినిమాలు మాత్రమే చేస్తోంది. వాటిలో ఒకటి విజయ్ స‌ర‌స‌న చేస్తోన్న జ‌న‌నాయ‌గ‌న్. మ‌రో సినిమా రాఘవ లారెన్స్ తో చేస్తోన్న ‘కాంచ‌న 4’. తెలుగులో మాత్రం ఒక్క సినిమా కూడా లేదు. ఈ రెండు సినిమాల‌పైనే పూజా ఆశ‌ల‌న్నీ పెట్టుకుంది. హిందీలో చేసిన సినిమాలు కూడా ఫ్లాపవడంతో అక్కడ ఎన్నో ఆశలు పెట్టుకున్న ఈ బుట్టబొమ్మకి, బాలీవుడ్ మేకర్స్ గట్టి షాకిచ్చారు.

ఇక మరో సౌత్ బ్యూటీ కీర్తి సురేష్ కెరీర్ కూడా ఇలాగే సాగుతోంది. నాని తో చేసిన ‘ద‌స‌రా’ త‌ర్వాత మళ్ళీ ఇప్పటి వరకూ కీర్తికి స‌రైన హిట్ దక్కలేదు. ‘ద‌స‌రా’ సినిమా తర్వాత ఏడు సినిమాలు చేసింది. వాటిలో ఒక్క‌టి కూడా హిట్ గా చెప్పుకోలేకపోయింది. ప్రస్తుతం, కీర్తి సురేష్ ‘రివాల్వ‌ర్ రీటా’ సినిమాతో రాబోతోంది. ఇది కూడా ఎప్పుడో రిలీజ్ కావాల్సిన సినిమా. ఇక బాలీవుడ్ లో వెబ్ సిరీస్ చేస్తున్న కీర్తి.. ఇందులో బోల్డ్ పాత్రలో కనిపించబోతుంది.

అనుష్క శెట్టి కూడా ఈ మధ్య కాలంలో హిట్ చూడలేదు. గత చిత్రం మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి కూడా కంటెంట్ బాగా వీక్ ఉండటంతో డిజాస్టర్ గా నిలిచింది. ప్రస్తుతం ఘాటి సినిమా ప్రమోషన్స్ తో బిజీగా ఉంది స్వీటీ. క్రిష్ దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ ప్రమోషనల్ కంటెంట్ తో బాగానే హైప్ క్రియేట్ అయింది. ఈ సినిమాతోనైనా సూపర్ హిట్ అందుకొని మళ్ళీ ఫామ్ లోకి రావాలని చూస్తోంది.

Also Read- Viral Video: ఓ పక్క గణేశుడి మెడలో నాగుపాము.. మరో పక్క వినాయకుడి ఒడిలో హాయిగా నిద్రపోతున్న పిల్లి..

ఈ లిస్ట్ లో హిట్ కోసం తహ తహాలాడుతున్న మరో గ్లామర్ బ్యూటీ శ్రుతి హాసన్. తెలుగులో ఈ బ్యూటీకి మంచి క్రేజ్ ఉంది. కానీ, డెకాయిట్ నుంచి తప్పుకొని తప్పు చేసిందని చెప్పాలి. వాల్తేరు వీరయ్య..వీర సింహా రెడ్డి సినిమాలతో హిట్ అందుకున్న శ్రుతి, మళ్ళీ మరో తెలుగు సినిమాలో కనిపించలేదు. తమిళంలో ఇటీవల వచ్చిన కూలీ సినిమా చేసినా కూడా, దీనివల్ల శ్రుతికి ఒరిగిందేమీ లేదు. ఈ హీరోయిన్స్ మళ్ళీ ఫామ్ లోకి రావాలంటే గ్యారెంటీగా చేతిలో ఉన్న సినిమాతో హిట్ కొట్టాల్సిందే. లేదంటే ప్రేక్షకులే కాదు, మేకర్స్ కూడా పక్కన పెట్టేస్తారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad