NTR30: జూనియర్ ఎన్టీఆర్ సినిమా కోసం ఆయన అభిమానులు కళ్ళు కాయలు కాసేలా ఎదురుచూస్తున్నారు. ఆర్ఆర్ఆర్ పుణ్యమా అని సంవత్సరాలుగా అభిమానులకు పండగ లాంటి సినిమాను అందించడంలో వెనకబడ్డాడు. ప్రస్తుతం టాలీవుడ్ లో అటు యాక్టింగ్ పరంగా.. ఫ్యాన్ ఫాలోయింగ్ పరంగా తిరుగులేని మాస్ హీరోగా సత్తా చూపెడుతున్న ఎన్టీఆర్.. ఆర్ఆర్ఆర్ తర్వాత పాన్ ఇండియా స్టార్ గా అవతరించాడు. ఈ సినిమా తర్వాత కొరటాల శివ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.
కొరటాల శివ సినిమా అనగానే.. ముందుగా వీళ్ల కాంబినేషన్లో వచ్చిన ‘జనతా గ్యారేజ్’ సినిమా గుర్తుకు వస్తోంది. అందుకే వీళ్ల కాంబోలో రెండో సినిమా అనగానే ప్రేక్షకుల్లో ఒక రకమైన క్రేజ్ ఉంది. ఈ సినిమా కోసం తారక్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇదిగో అదిగో అంటూ చాలాకాలంగా ఈ సినిమా ప్రారంభం అవుతుందని తెగ ప్రచారం జరుగుతుండగా.. హీరోయిన్ ఎంపిక నుండి, స్టోరీపై కూడా రకరకాల ఊహాగానాలు ఉన్నాయి. ఈ మధ్యనే ఎన్టీఆర్ ఓ కొత్త లుక్ పోస్ట్ చేయగా అది కూడా ఆ సినిమా కోసమే అనే టాక్ నడించింది. అయితే, అవేమీ అధికారికంగా ప్రకటించినవి కావు.
కాగా, ఇప్పుడు ఎన్టీఆర్-కొరటాల సినిమాపై క్రేజీ అప్డేట్ ఇదే అని సోషల్ మీడియాలో కొన్ని కథనాలు వినిపిస్తున్నాయి. ఈ సినిమా కోసం ఎన్టీఆర్ కొత్త లుక్ ట్రై చేయబోతుండగా.. ఈ సినిమాలో ఎన్టీఆర్ మ్యానరిజమ్ గురించి ఓ ఇంట్రెస్టింగ్ టాక్ నడుస్తుంది. ఈ సినిమాలో ఎన్టీఆర్ పాత్రకి చేతికి ఆరు వేళ్ళు అనగా.. కోపం వచ్చిన ప్రతిసారి ఆరో వేలు బిగుసుకు పోతుందని.. ఎన్టీఆర్ పాత్ర సీరియస్ నెస్ ను ఈ వేలుతో పలు సందర్భాల్లో సింబాలిక్ గా ఎస్టాబ్లిష్ చేస్తారని తెలుస్తోంది. మరి ఇది ఎంతవరకు నిజమన్నది చూడాలి.