Wednesday, October 30, 2024
Homeచిత్ర ప్రభఆ హీరోలు సాయం చేయలేదు.. అవన్నీ పుకార్లే : పావలా శ్యామల

ఆ హీరోలు సాయం చేయలేదు.. అవన్నీ పుకార్లే : పావలా శ్యామల

ఈ రోజుల్లో ఇండస్ట్రీకి వస్తున్న నటీనటులు.. మోడలింగ్ చేసి వస్తున్నారు. డాక్టర్లు కావాల్సినోళ్లు అదృష్టం కొద్దీ యాక్టర్లవుతున్నారు. కొందరు ప్రొడ్యూసర్లు, దర్శకుల వారసులుగా ఇండస్ట్రీలోకి అడుగుపెడుతున్నారు. కానీ.. ఒకప్పుడు ఇండస్ట్రీకి వచ్చిన నటీనటుల్లో చాలా మంది నాటకరంగం నుండి వచ్చినవారే. అలా తెలుగు తెరకి వచ్చినవారిలో ‘పావలా’ శ్యామల ఒకరు. ‘పావలా’ అనే ఓ నాటకం వల్ల ఆమెకి పేరు రావడంతో.. ‘పావలా’ ఆమె ఇంటిపేరుగా మారింది. సినిమాలతో పాటు.. పలు టీవీ సీరియళ్లలోనూ నటించిన శ్యామల.. ఏ పాత్రలోనైనా జీవిస్తారు.

- Advertisement -

పాత్రకు తగిన హావభావాలతో కామెడీ చేయడం ఆమె ప్రత్యేకత. తనదైన వెటకారాలు, విరుపులతో నవ్విస్తారామె. ఈ మధ్యకాలంలో సీనియర్ ఆర్టిస్టులకు సినిమాల్లో పాత్రలు రావడం లేదు. ఫలితంగా వారంతా ఇబ్బంది పడుతున్నారు. అలాంటి వారిలో శ్యామల కూడా ఒకరు. వయసు పైబడటం ఒక కారణమైతే.. ఆమె కూతురు అనారోగ్యం బారిన పడటం మరో కారణం. ఇటీవల కాలంలో శ్యామలకు కొందరు సినీ ప్రముఖులు లక్షల్లో సహాయం చేశారంటూ వార్తలొచ్చాయి.

తాజాగా ఆ వార్తలపై ‘పావలా’ శ్యామల స్పందించారు. “నేను కష్టాల్లో ఉన్నప్పుడు చిరంజీవి గారు నన్ను ఆదుకున్నారు. తనే నాకు ‘మా’లో సభ్యత్వాన్ని ఇప్పించి, ప్రతినెలా నాకు కొంత మొత్తం వచ్చేలా చేశారు. ఆయన చేసిన సాయాన్ని నేను ఎప్పటికీ మరిచిపోలేను. కానీ..మహేశ్ బాబు, ఎన్టీఆర్, ప్రభాస్ .. చరణ్ వీరంతా కూడా తలా పది లక్షలు నాకు సహాయం చేసినట్లు ఎవరో ప్రచారం చేస్తున్నారు. ఆ ప్రచారంలో నిజంలేదు. అలాంటి పుకార్ల వల్ల నాకు చిన్న చిన్న సాయాలు చేసేవారు కూడా వెనక్కి తగ్గారు. నాకు ఎలాంటి సాయం దక్కకూడదనే ఉద్దేశంతో ఒక మహాతల్లి ఇలా చేసింది” అంటూ ఆవేదనను వ్యక్తం చేశారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News