September 2025: సెప్టెంబర్ నెల టాలీవుడ్‌కు బాగా కలిసివచ్చింది. ఎనిమిది నెలల టైమ్‌లో నెలకో సక్సెస్ చొప్పున ఆగస్ట్ వరకు టాలీవుడ్‌కు మొత్తం ఎనిమిది హిట్లు దక్కాయి. కానీ సెప్టెంబర్‌లో మాత్రం మూడు సినిమాలు సూపర్ హిట్స్‌గా నిలిచాయి. ఈ నెలలో ప్రేక్షకుల ముందుకొచ్చిన లిటిల్ హార్ట్స్‌తో పాటు మిరాయ్, కిష్కిందపురి బ్లాక్‌బస్టర్స్‌గా నిలవడంతో నిర్మాతలతో పాటు డిస్ట్రిబ్యూటర్లలో లాంగ్ గ్యాప్ తర్వాత సంతోషం కనిపిస్తోంది. బ్యాక్ టూ బ్యాక్ హిట్స్‌తో టాలీవుడ్ కళకళలాడుతోంది. ఓజీతో ఈ సక్సెస్ జోష్ కంటిన్యూ కావడం ఖాయమని సినీ వర్గాలు చెబుతున్నాయి.
లిటిల్ హార్ట్స్‌తో స్టార్ట్…
సెప్టెంబర్ ఫస్ట్ వీక్‌లో రిలీజైన చిన్న సినిమా లిటిల్ హార్ట్స్ బాక్సాఫీస్ వద్ద కుమ్మేసింది. స్టార్ ఎవరూ లేకపోవడం, యాక్టర్లు, డైరెక్టర్ కొత్తవాళ్లే కావడంతో ఓటీటీ మెటీరియల్ అంటూ లిటిల్ హార్ట్స్‌పై తొలుత విమర్శలు వచ్చాయి. కానీ అనుష్క ఘాటీ, శివకార్తీకేయన్ మదరాసి వంటి సినిమాలకు పోటీగా రిలీజైన ఈ మూవీ సంచనల విజయాన్ని సాధించింది. మొదటిరోజు బ్రేక్ ఈవెన్ అయిన ఈ సినిమా నిర్మాతలతో పాటు డిస్ట్రిబ్యూటర్లకు లాభాల పంటను పండించింది. కేవలం రెండు కోట్ల నలభై లక్షల బడ్జెట్‌తో రూపొందిన ఈ మూవీ ఇప్పటివరకు 34 కోట్ల వరకు వసూళ్లను దక్కించుకున్నది. ఈ ఏడాది మోస్ట్ ప్రాఫిటబుల్ సినిమాగా నిలిచింది.
ఆడియెన్స్ తో పాటు టాలీవుడ్ హీరోలు సైతం ఈ చిన్న సినిమాపై ప్రశంసలను కురిపిస్తున్నారు. లిటిల్ హార్ట్స్ అద్బుతంగా ఉందంటూ మహేష్‌బాబు, రవితేజ, నానితో పాటు పలువురు స్టార్ హీరోలు ట్వీట్లు చేశారు. లిటిల్ హార్ట్స్ మూవీలో మౌళి తనూజ్, శివానీ నాగారం హీరోహీరోయిన్లుగా నటించారు. సాయి మార్తాండ్ దర్శకత్వం వహించాడు.
Also Read – Bigg Boss Voting: ఓటింగ్ లో దూసకుపోతున్న కమెడియన్.. ఈ వారం ఎలిమినేట్ అయ్యేదెవరంటే?
ఒకే రోజు రెండు సినిమాలు రిలీజ్…
సెప్టెంబర్ 12న రిలీజైన తేజా సజ్జా మిరాయ్‌తో పాటు బెల్లంకొండ శ్రీనివాస్ కిష్కిందపురి బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తున్నాయి. ఒకే రోజు రిలీజైన ఈ రెండు సినిమాలు బ్లాక్‌బస్టర్ దిశగా సాగుతోన్నాయి. మిరాయ్ ఐదు రోజుల్లోనే వంద కోట్ల కలెక్షన్స్ రాబట్టి రికార్డ్ క్రియేట్ చేసింది. తేజా సజ్జా హీరోగా నటించిన మూవీ కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహించాడు. మైథలాజికల్ యాక్షన్ అడ్వెంచర్‌గా రూపొందిన ఈ మూవీలో మంచు మనోజ్ విలన్‌గా నటించాడు. ఫుల్ థియేట్రికల్ రన్‌లో మిరాయ్ 200 కోట్లకుపైనే వసూళ్లను రాబట్టేలా కనిపిస్తోంది. మిరాక్ మూవీని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ నిర్మించారు.
కిష్కిందపురి కూడా డీసెంట్ హిట్‌గా నిలిచింది. ఐదు రోజుల్లోనే లాభాల్లోకి అడుగుపెట్టింది. నైజాంతో పాటు చాలా ఏరియాల్లో ఈ మూవీ రికవరీ సాధించింది. హారర్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ సినిమాలో బెల్లంకొండ శ్రీనివాస్‌కు జోడీగా అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్‌గా నటించింది. కౌశిక్ పెగళ్లపాటి ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ఈ సినిమాలే కాకుండా మలయాళం డబ్బింగ్ మూవీ కొత్త లోక కూడా నిర్మాతకు మంచి లాభాలను తెచ్చిపెట్టింది. కళ్యాణి ప్రియదర్శన్ హీరోయిన్‌గా నటించిన ఈ మూవీని తెలుగులో సూర్యదేవర నాగవంశీ రిలీజ్ చేశారు.
నెక్స్ట్ ఓజీఏ…
సెప్టెంబర్ 25న పవన్ కళ్యాణ్ ఓజీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ గ్యాంగ్‌స్టర్ యాక్షన్ మూవీ కూడా సక్సెస్ జోష్‌ను కంటిన్యూ చేయడం ఖాయంగానే కనిపిస్తోంది. ఫస్ట్ డే ఓజీ మూవీ కలెక్షన్స్ పరంగా రికార్డులు బద్దలు కొట్టేలా కనిపిస్తోంది. ఓజీ మూవీకి సుజీత్ దర్శకత్వం వహిస్తున్నాడు.
Also Read – PM Modi 75th birthday: మోదీకి శుభాకాంక్షల వెల్లువ.. పోప్ లియో ప్రత్యేక ఆశీస్సులు


