Anupama Parameswaran: మన తెలుగు ఇండస్ట్రీలో ఫ్యామిలీ ఓరియెంటెడ్ మూవీస్ కి పర్ఫెక్ట్ గా సరిపోయే హీరోయిన్స్ ని వేళ్ళ మీద లెక్కపెట్టొచ్చు. ఈ రంగుల ప్రపంచంలో గ్లామర్‌గా కనిపించే హీరోయిన్స్ కోసమే మేకర్స్ ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తుంటారు. సినిమాకి ఉన్న కమర్షియల్ ఎలిమెంట్స్‌లో హీరోయిన్ గ్లామర్ అనేది కూడా ఎంతో కీలకమైనది. అయితే, చాలామంది దర్శకులు సినిమాలో హీరోయిన్ కి ఇవ్వాల్సినంత ప్రాముఖ్యతను ఇవ్వడం లేదు. కొలమానం పెట్టుకొని ఈ సీన్ తర్వాత హీరోయిన్ వచ్చి ఓ సాంగ్ లో కనిపిస్తే సరిపోతుంది.. అనేలా ట్రీట్ చేస్తున్నారు.
పూరి జగన్నాధ్, సుకుమార్, సందీప్ రెడ్డి వంగ లాంటి కొద్ది మంది దర్శకులు మాత్రమే కథలో హీరోకి ఎంత ప్రాధాన్యత ఉంటుందో, హీరోయిన్ కి అంతే ప్రాధాన్యత ఉండేలా స్క్రిప్ట్ రాస్తున్నారు. కాబట్టే, వీళ్ళ సినిమాలలో హీరోయిన్‌గా నటించిన వాళ్ళకి స్టార్ డం వస్తోంది. పూరి పరిచయం చేసిన అనుష్క శెట్టి ఇప్పుడు లేడీ సూపర్ స్టార్ గా వెలుగుతోంది. ఆమె నటించిన ఘాటి త్వరలో రాబోతుండగా, థియేట్రికల్ ట్రైలర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఇందులో గంజాయి సప్లై చేసే పాత్రలో అనుష్క కనిపించబోతుంది.
Also Read- Ustaad Bhagat Singh: సంక్రాంతి బరిలో ఉస్తాద్ భగత్‌సింగ్ – నిర్మాత ఏమన్నారంటే?
ఇక కెరీర్ ప్రారంభంలో చాలా డీసెంట్ రోల్స్ చేసి ఆకట్టుకుంది మలయాళ భామ అనుపమ పరమేశ్వరన్. ‘అ.ఆ’ సినిమాతో తెలుగు తెరకి పరిచయమైన ఈ బ్యూటీ, శతమానంభవతి సినిమాతో బాగా పాపులర్ అయింది. ఆ తర్వాత ‘ఉన్నది ఒకటే జిందగీ’, ‘హలో గురు ప్రేమకోసమే’ లాంటి చిత్రాలు చేసింది. కానీ, ఇవి ఫ్లాపవడంతో అనుపమకి బాగా గ్యాప్ వచ్చింది. ముద్దుగా బొద్దుగా ఉండే ఈ మలయాళ బ్యూటీ, గ్యాప్ లో సన్నగా.. చువ్వలా తయారై, రీ ఎంట్రీ ఇచ్చింది. అనుపమకి రీ ఎంట్రీ బాగా కలిసొచ్చింది. అంతేకాదు, ఇండస్ట్రీ లాజిక్ కూడా తెలుసుకొని అందాల ఆరబోతకి, లిప్ లాక్స్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది.
ఎప్పుడైతే అనుపమ గ్లామర్ షోకి రెడీ అనిందో, వరుసగా ఆఫర్స్ రావడం మొదలైంది. టిల్లూ స్క్వేర్ లాంటి సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకొని హాట్ టాపిక్ అయింది. ఇదే సమయంలో ‘పరదా’ అనే ఓ స్పెషల్ మూవీని చేస్తోంది. ఇప్పటికే, ఫస్ట్ లుక్..రెండు పాటలు వచ్చి అంచనాలు పెంచగా, తాజాగా ఈ మూవీ నుంచి మరో సాంగ్ రిలీజై యూట్యూబ్ లో ట్రెండ్ అవుతోంది. అందాల ఆరబోతకే కాదు, ‘పరదా’ లాంటి డిఫరెంట్ కాన్సెప్ట్ ఉన్న కథలకి ఓకే చెప్పి నేటి గ్లామర్ హీరోయిన్స్ కి ఇన్స్పిరేషన్‌గా మారింది అనుపమ. మరి ఈ సినిమా ఎలాంటి సక్సెస్ ఇస్తుందో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.


