ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సినీ ఇండస్ట్రీకి అండగా నిలుస్తుంది. ఇండస్ట్రీకి చెందిన పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా ఉండటంతో సినీ రంగానికి అన్ని విధాలా మద్దతు లభిస్తుంది. పెద్ద హీరోల సినిమాల నుంచి చిన్న హీరోల సినిమాల వరకు టికెట్ రేట్లను(Ticket Prices) పెంచుతూ నిర్ణయం తీసుకుంటుంది. తాజాగా నితిన్ హీరోగా నటించిన రాబిన్ హుడ్(RobinHood ).. నాగవంశీ నిర్మించిన మ్యాడ్ స్క్వేర్ చిత్రాల టికెట్ రేట్లు పెంపునకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈమేరకు జీవో జారీ అయింది. జీవో ప్రకారం మొదటి ఏడు రోజుల పాటు ధరలను పెంచుకునేందుకు అనుమతి లభించింది. సింగిల్ స్క్రీన్లలో ఒక్కో టికెట్‌పై రూ.50, మల్టీప్లెక్స్‌లో టికెట్‌పై రూ.75ను పెంచుకునే వెసులుబాటు కల్పించింది. కాగా ఈనెల 28న ఈ రెండు చిత్రాలు ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్నాయి.

కాగా నితిన్ హీరోగా నటిస్తున్న ‘రాబిన్ హుడ్’ మూవీకి వెంకీ కుడుముల దర్శకత్వం వహించారు. శ్రీలీల కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ డేవిడ్ వార్నర్ అతిథి పాత్రను పోషించారు. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్ చిత్రంపై అంచనాలను పెంచేశాయి. జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతాన్ని అందిస్తుండగా.. రాజేంద్రప్రసాద్, వెన్నెల కిశోర్, షైన్ టామ్ చాకో కీలక పాత్రలను పోషిస్తున్నారు.
ఇక 2023లో విడుదలైన మ్యాడ్ చిత్రానికి సీక్వెల్‌గా ‘మ్యాడ్ స్క్వేర్’ మూవీ తెరకెక్కించారు. ఎన్టీఆర్ బావమరిది నార్నే నితిన్, సంతోష్ శోభన్, రామ్ నితిన్ హీరోలుగా ఈ మూవీ రూపొందించారు. కల్యాణ్ కృష్ణ దర్శకత్వం వహించిన ఈ సినిమాను నాగవంశీ నిర్మించగా.. భీమ్స్ సంగీతం అందించారు. .