Rajasekhar: సీనియర్ నటుడు రాజశేఖర్ గురించి ఇప్పటి జనరేషన్ వాళ్లకు తెలియకపోవచ్చు. కానీ వందకు పైగా వైవిధ్యమైన సినిమాలు, పాత్రలతో హీరోగా మెప్పించిన స్టార్ ఆయన. సూపర్బ్ యాక్టర్‌గా, యాక్షన్ హీరోగా తనదైన గుర్తింపు సంపాదించుకున్నారు. ఇప్పుడు శర్వానంద్ హీరోగా అభిలాష్ రెడ్డి దర్శకత్వంలో రూపొందుతోన్న బైకర్ సినిమాలో విలన్‌గా కనిపించబోతున్నాడని టాక్ వినిపిస్తోంది. ఏ పాత్రలో కనిపించబోతున్నారనేది పక్కన పెడితే శర్వా మూవీలో రాజశేఖర్ నటిస్తున్నాడు. ఈ మూవీ టీజర్ రిలీజ్ కార్యక్రమంలో పాల్గొన్న రాజశేఖర్ చెప్పిన ఓ విషయం అందరినీ ఆలోచింప చేసింది.
అదేంటంటే రాజశేఖర్ చాలా రోజులుగా ఇరిటబుల్ బౌట్ సిండ్రోమ్‌తో బాధపడుతున్నారు. ఎవరైనా స్టేజ్ పైకి ఆయన్ని మాట్లాడాలని పిలిస్తే ఆయనలో కంగారు పెరిగిపోతుంది. కడుపు పాడైపోతుంది. కడుపు నొప్పి, ఉబ్బరం, విరోచనాలు, మలబద్దకం వంటి లక్షణాలతో బాధపడుతుంటారు. దీనివల్ల చాలా కోపం వస్తుంది. బయట వాళ్లకు అది సమస్యగా అనిపిస్తుంది. సమస్య తెలిసిన వాళ్లు పెద్దగా పట్టించుకోరు. ఇలాంటి సిండ్రోమ్‌తో రాజశేఖర్ బాధపడుతున్నాడని తెలిసి అయ్యో అనుకుంటున్నారు.
నటుడిగా రాజశేఖర్‌కి ఎప్పుడైతే వరుస పరాజయాలు ఎదురయ్యాయో.. అప్పుడు ఆయన కెరీర్ డౌన్ ఫాల్‌లో పడింది. కెరీర్ పూర్తిగా పడిపోయిందనుకుంటోన్న సమయంలో ఆపరేషన్ గరుడవేగ సినిమాతో బ్లాక్ బస్టర్ కొట్టి అందరి దృష్టిని ఆకర్షించారు. కానీ మళ్లీ షరా మామూలే. మళ్లీ ఫ్లాప్స్ బాట పట్టారు. అదే క్రమంలో ఎక్స్‌ట్రార్డినరీ మ్యాన్ మూవీలో ఓ స్పెషల్ రోల్‌లో కనిపించారు. కానీ ఆ సినిమా డిజాస్టర్ కావటం రాజశేఖర్‌కు ఊహించని పరిణామమే.
Also Read – KING: బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ ‘కింగ్’ మూవీ గ్లింప్స్ వచ్చేసింది!
చాలా కాలంగా ఆయన సినిమాలకు దూరంగా ఉంటున్నారు. నెగటివ్ రోల్ అయినా సరే! మంచి స్క్రిప్ట్ కుదిరితే చేయటానికి ఆయన రెడీ అయ్యారు. ఈ క్రమంలో ఆయన త్వరలోనే బైకర్ సినిమాతో మన ముందుకు రాబోతున్నారు. తాజాగా విడుదలైన టీజర్ కార్యక్రమంలో ఆయన పాల్గొనటంతో మీడియాలో వచ్చిన వార్తలకు సమాధానం దొరికేసింది.
శర్వానంద్ బైకర్ ప్రెస్ మీట్లో రాజశేఖర్ స్క్రిప్ట్ వినగానే వెంటనే ఓకే చేశాడట. సాధారణంగా నవ్వుతూ జాలీగా ఉండే తను.. సీరియస్ పాత్రలో నటించటానికి డైరెక్టర్ అభిలాష్ చెప్పిన విషయాలను ఫాలో అయ్యానని అన్నాడు. ఫస్టాఫ్ డబ్బింగ్ పూర్తి చేసిన శర్వానంద్.. రాజశేఖర్ అద్భుతమైన పాత్రలో నటించారని అప్రిషియేట్ చేశారు. ఈ మూవీ తర్వాత ఈ సీనియర్ యాక్టర్ కు మళ్లీ అవకాశాలు వస్తాయా? తను ఎలాంటి సినిమాలు చేస్తాడనేది ఆసక్తికరమైన విషయమే. మరో వైపు రాజశేఖర్ లీడ్ రోల్లో కొన్ని సినిమాలు కూడా లైనప్ చేస్తున్నారు.
Also Read – Janhvi Kapoor: పల్లెటూరి గెటప్స్‌లో జాన్వీ కపూర్ లుక్స్‌పై కామెంట్లు!


