Tollywood Actors: టాలీవుడ్, బాలీవుడ్‌తో పాటు అన్ని ఇండస్ట్రీలలో మైథలాజికల్ సినిమాల ట్రెండ్ కనిపిస్తోంది. స్టార్ హీరోలు సైతం భక్తి కథలపై ఇంట్రెస్ట్ చూపుతున్నారు. భక్తి అనే ఎమోషన్‌కు భాషాభేదాలతో సంబంధం ఉండదు. అన్ని ఇండస్ట్రీలకు చెందిన ఆడియెన్స్‌ను ఈ కథలతో మెప్పించే వెసులుబాటు ఉంటుంది. అందుకే మైథలాజికల్ సినిమాలపై హీరోలు మోజు పడుతున్నారు. ప్రస్తుతం తెలుగులో భక్తి ప్రధాన కథాంశాలతో పలు సినిమాలు రూపొందుతోన్నాయి.
జై హనుమాన్…
తేజా సజ్జా హీరోగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో రూపొందిన హనుమాన్ 300 కోట్లకుపైగా వసూళ్లను రాబట్టింది. అగ్ర హీరోలతో పోటీపడి సంక్రాంతికి రిలీజైన ఈ మూవీ పెద్ద హిట్‌గా నిలిచింది. ప్రస్తుతం హనుమాన్ మూవీకి సీక్వెల్‌ను తెరకెక్కిస్తోన్నారు డైరెక్టర్ ప్రశాంత్ వర్మ. జై హనుమాన్ పేరుతో రూపొందుతోన్న ఈ మూవీలో కాంతార ఫేమ్ రిషబ్ శెట్టి హీరోగా నటిస్తున్నారు. హిందూ పురాణాల ప్రకారం లోకంలో ఏడుగురు చిరంజీవులు ఉన్నారు. వారంతా ఏకమై దుష్టశక్తులను ఎలా అంతమొందించారు అనే కాన్సెప్ట్‌తో జై హనుమాన్ రూపొందుతోన్నట్లు సమాచారం. ప్రశాంత్ వర్మ కథను అందిస్తున్న మరో సూపర్ హిరో మూవీ మహాకాళిలో పురాణాలకు సంబంధించిన ప్రస్తావన ఉంటుందని సమాచారం.
Also Read- Vijay Deverakonda: విజయ్‌దేవరకొండతో రాజాసాబ్ హీరోయిన్ మూవీ.. ఓపెనింగ్‌తోనే ఆగిపోయిన సినిమా?
ఎన్టీఆర్…త్రివిక్రమ్…
అరవింద సమేత వీరరాఘవ బ్లాక్‌బస్టర్ తర్వాత ఎన్టీఆర్, డైరెక్టర్ త్రివిక్రమ్ కాంబోలో మరో మూవీ రాబోతుంది. గత సినిమాలకు పూర్తి భిన్నంగా ఈ సారి మైథాలజీ కథతో త్రివిక్రమ్ తెలుగు ఆడియెన్స్‌ను సర్‌ప్రైజ్ చేయబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ మూవీలో ఎన్టీఆర్ లార్డ్ కుమారస్వామి పాత్రలో కనిపించబోతున్నట్లు సమాచారం. ఎన్టీఆర్ పౌరాణిక సినిమా గురించి నిర్మాత నాగవంశీ ఇన్‌డైరెక్ట్‌గా ఇటీవల హింట్ ఇచ్చాడు. రిషబ్ శెట్టితో నాగవంశీ చేయబోతున్న మరో మూవీ కూడా పౌరాణిక కథే అని తెలిసింది. ఈసినిమాకు రాజమౌళి అసిస్టెంట్ అశ్విన్ గంగరాజు దర్శకత్వం వహించబోతున్నట్లు సమాచారం.
అఖండ 2…
బాలకృష్ణ అఖండ 2, చిరంజీవి విశ్వంభర సినిమాలు కూడా పురాణాలతో ముడిపడి సాగుతాయని అంటున్నారు. అఖండ 2 సెప్టెంబర్ 25న రిలీజ్ కాబోతుంది. విశ్వంభర కూడా ఈ ఏడాదిలోనే అభిమానులను పలకరించనుంది. ఇవే కాకుండా బెల్లంకొండ శ్రీనివాస్ కిష్కిందపురి, సుమంత్ మహేంద్రగిరి వారాహితో పాటు నాగబంధం ఈ ఏడాది పలు మైథలాజికల్ సినిమాలు టాలీవుడ్ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి.
Also Read- Yellamma: ఫెయిల్యూర్ ఎఫెక్ట్.. ఎల్లమ్మ కోసం ప్లాన్ మార్చిన దిల్ రాజు
కన్నప్ప…
మంచు విష్ణు హీరోగా ఇటీవల రిలీజైన కన్నప్ప బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లనే రాబట్టింది. నాస్తికుడైన ఓ వేటగాడు శివభక్తుడిగా ఎలా మారాడు అనే కాన్సెప్ట్‌తో రూపొందిన ఈ మూవీలో ప్రభాస్ గెస్ట్ రోల్ చేశాడు. ఈ సినిమాలో శివుడిగా బాలీవుడ్ నటుడు అక్షయ్‌కుమార్ కనిపించాడు.
నాలుగు వేల కోట్ల బడ్జెట్…
బాలీవుడ్ మూవీ రామాయణ ప్రస్తుతం టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది. దాదాపు నాలుగు వేల కోట్ల బడ్జెట్‌లో రెండు పార్ట్‌లుగా రూపొందుతోన్న ఈ మూవీలో రణభీర్‌కపూర్ రాముడిగా నటిస్తోండగా జానకి పాత్రను సాయిపల్లవి చేస్తోంది. ఈ సినిమాలో యశ్ రావణుడిగా కనిపించబోతున్నాడు. తెలుగులో ఈ మూవీ రిలీజ్ కానుంది.


