Sreeleela Marriage Planning: ప్రస్తుతం ఇటు తెలుగు, అటు హిందీ చిత్రాల్లో నటిస్తూ ఫుల్ బిజీగా ఉన్న హీరోయిన్స్‌లో శ్రీలీల ఒకరు. ఆమె నటించిన సినిమాలేవీ బాక్సాఫీస్ దగ్గర సక్సెస్ కాకపోయినప్పటికీ, డిమాండ్ మాత్రం తగ్గటం లేదు. వరుస అవకాశాలను అందుకుంటోందీ బ్యూటీ డాల్. మరో వైపు కమర్షియల్ యాడ్స్‌తోనూ బిజీగా ఉంటోంది. రీసెంట్‌గా శ్రీలీల నటించిన జూనియర్ సినిమాలో వైరల్ బ్యూటీ సాంగ్ తెగ వైరల్ అయ్యింది. కానీ సక్సెస్ టాక్ మాత్రం తెచ్చుకోలేదు. ఈ క్రమంలో శ్రీలీల త్వరలోనే పెళ్లి చేసుకోనుందంటూ వార్తలు నెట్టింట వైరల్ అయ్యాయి.
తన పెళ్లిపై వస్తున్న వార్తలపై శ్రీలీల రీసెంట్ ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చింది. తిథి ప్రకారం తన ఇంట్లో పుట్టినరోజు వేడుకలు జరిగి చాలా కాలం అవ్వడంతో, తన బ్రదర్స్ మరియు కుటుంబ సభ్యులు ఈ విధంగా పుట్టినరోజు వేడుకలు జరిపారని శ్రీలీల చెప్పింది. తాను ప్రస్తుతం 23 ఏళ్ల వయసులో ఉన్నానని, కనీసం 30 ఏళ్లు వచ్చే వరకు అసలు పెళ్లి చేసుకోనని శ్రీలీల వెల్లడించింది. అంతేకాకుండా, తాను కొందరితో రిలేషన్‌లో ఉన్నానని, ప్రేమిస్తున్నానని అంతా అనుకుంటున్నారని.. దీనిపై మీడియాలోనూ గాసిప్స్ వస్తున్నాయని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. అయితే, తాను ఎక్కడికి వెళ్లినా అమ్మ ఎప్పుడూ తన పక్కనే ఉంటుందని, చివరికి మియామీ వెళ్ళినప్పుడు కూడా ఆమె తన పక్కనే ఉందని శ్రీలీల చెప్పారు. అలాంటప్పుడు తాను ఎలా ప్రేమించగలను, ఎలా ప్రేమలో పడతాను? అని ఆమె ప్రశ్నించారు. ప్రస్తుతం శ్రీలీల చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి
మరో వైపు కన్నడ బ్యూటీ శ్రీలీల టాలీవుడ్‌లో అందుకున్న గుర్తింపు, క్రేజ్‌ను క్యాష్ చేసుకుంటూ బాలీవుడ్‌లో సెటిల్ అయ్యేందుకు ఫుల్ స్కెచ్ వేసుకుంటోంది. ఇప్పటికే కార్తిక్ ఆర్యన్‌తో ఆషికి 3 ద్వారా హిందీలోకి గ్రాండ్ ఎంట్రీ ఇవ్వబోతోన్న సంగతి తెలిసిందే. ఈ మూవీ రిలీజ్ కాకముందే బాలీవుడ్ నుంచి ఇంకో సాలిడ్ ఆఫర్ శ్రీలీలను వెతుక్కుంటూ వచ్చింది. సినీ సర్కిల్స్ బజ్ ప్రకారం రణవీర్ సింగ్, బాబీ డియోల్‌లతో బాలీవుడ్ టాప్ ప్రొడక్షన్ హౌస్ ఓ మాస్ యాక్షన్ మూవీని రూపొందిస్తోంది. ఇందులో హీరోయిన్‌గా శ్రీలీల ఫిక్స్ అయినట్టు ఇండస్ట్రీ టాక్!. ఈ క్రేజీ కాంబో కోసం రణవీర్, శ్రీలీలలతో ఓ స్పెషల్ ఫోటోషూట్ కూడా చేసినట్టుగా తెలుస్తోంది. శ్రీలీల లుక్‌కి సంబంధించిన లుక్ టెస్టులు కూడా జరిగాయట… మేకర్స్ ఫుల్ శాటిస్ఫై అయినట్లు సమాచారం.
ఈ సినిమాలో రణవీర్, శ్రీలీల పాత్రలు చాలా రా అండ్ రస్టిక్‌గా ఉండబోతున్నాయట. ఇప్పటివరకు వీరిద్దరూ చేసిన సినిమాలకు టోటల్ డిఫరెంట్ షేడ్స్‌లో కనిపించబోతున్నారట. తన క్యారెక్టర్ కోసం శ్రీలీల మేకోవర్‌లో బిజీగా ఉన్నట్టు సమాచారం.


