Theater And Ott Movies: ఈ వారం కాన్సెప్ట్ ఓరియెంటెడ్ కథాంశాలతో కూడిన తెలుగు సినిమాలు థియేటర్ల ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. రవితేజ మాస్ జాతర బాక్సాఫీస్ బరిలో నుంచి తప్పుకోవడం ఈ చిన్న సినిమాలకు అడ్వాంటేజ్‌గా మారింది. ఈ ఫ్రైడే కొత్త సినిమాతో జాన్వీకపూర్ తన లక్‌ను పరీక్షించుకోబోతుంది. జాన్వీ హీరోయిన్‌గా నటించిన బాలీవుడ్ మూవీ పరమ్ సుందరి కూడా ఈ శుక్రవారమే థియేటర్లలో రిలీజ్ అవుతోంది.
సుందరకాండ..
భైరవంతో లాంగ్ గ్యాప్ తర్వాత టాలీవుడ్‌లోకీ రీఎంట్రీ ఇచ్చాడు నారా రోహిత్. ఈ సారి సోలో హీరోగా సుందరకాండతో ఆగస్ట్ 27న తెలుగు ఆడియెన్స్ ముందుకు రాబోతున్నాడు. డిఫరెంట్ రొమాంటిక్ కామెడీ మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు వెంకటేష్ నిమ్మలపూడి దర్శకత్వం వహించారు. శ్రీదేవి విజయ్‌కుమార్, వృతి వాఘాని హీరోయిన్లుగా నటిస్తున్నారు. థియేటర్లలో రిలీజ్‌కు ముందే ఈ సినిమా ఓటీటీ, శాటిలైట్ హక్కులు అమ్ముడుపోయాయి. టేబుల్ ప్రాఫిట్‌తో బుధవారం సుందరకాండ రిలీజ్ అవుతోంది.
త్రిబాణధారి బార్బరిక్…
బాహుబలి ఫేమ్ సత్యరాజ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న తెలుగు మూవీ త్రిబాణధారి బార్బరిక్ ఈ వారమే రిలీజ్ అవుతోంది. క్రైమ్ థ్రిల్లర్ కథకు మైథలాజికల్ ఎలిమెంట్స్ జోడించి రూపొందిస్తున్న ఈ మూవీలో యాంకర్ ఉదయభాను విలన్‌గా నటిస్తోంది. త్రిబాణబాధి బార్బరిక్‌కు మోహన్ శ్రీవత్స దర్శకత్వం వహించారు. ట్రైలర్, టీజర్స్‌తో ఈ చిన్న సినిమా తెలుగు ఆడియెన్స్‌లో ఆసక్తిని రేకెత్తిస్తోంది.
ఈ రెండింటితో పాటు మరో చిన్న సినిమా కన్యాకుమారి ఈ వారం బాక్సాఫీస్ బరిలో నిలిచింది. శ్రీచరణ్ రాచకొండ, గీత్ షైని హీరోహీరోయిన్లుగా నటించిన ఈ మూవీ ఆగస్ట్ 29న రిలీజ్ అవుతోంది. సృజన్ దర్శకత్వం వహించిన ఈ మూవీకి హీరోయిన్ మధుశాలిని ప్రజెంటర్‌గా వ్యవహరిస్తోంది.
Also Read – Pawan Wishes Balakrishna : బాలకృష్ణ అరుదైన గుర్తింపుపై పవన్ కళ్యాణ్ రియాక్షన్
జాన్వీకపూర్ పరమ్ సుందరి…
గత కొన్నాళ్లుగా వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తున్న జాన్వీకపూర్ బాలీవుడ్ మూవీ పరమ్ సుందరి ఈ వారమే థియేటర్లలో సందడి చేయబోతుంది. దక్షిణాది అమ్మాయికి, ఉత్తరాది అబ్బాయికి మధ్య ప్రేమకథతో ఈ మూవీ తుషార్ జలోగా ఈ సినిమాను రూపొందించారు. ఈ మూవీలో మలయాళీ యువతిగా జాన్వీ కపూర్ కనిపించబోతుండగా… ఢిల్లీ అబ్బాయిగా సిద్ధార్థ్ కపూర్ నటిస్తున్నాడు.
ఈ వారం ఓటీటీలో పలు భాషలకు చెందిన సినిమాలు, వెబ్ సిరీస్‌లు రిలీజ్ కాబోతున్నాయి. ఆ వివరాలు ఇవే…
ఆగస్ట్ 27…
గెవి (తమిళ్) – సన్ నెక్స్ట్ ఓటీటీ
మాయకూతు (తమిళ్) – సన్ నెక్స్ట్ ఓటీటీ
థండర్ బోల్స్ట్ న్యూ అవెంజర్స్ – జియో హాట్‌స్టార్
ది టెర్మినల్ లిస్ట్ (ఇంగ్లీష్) – అమెజాన్ ప్రైమ్ వీడియో
ఆగస్ట్ 28..
భాగ్ సాలే (తెలుగు ) – ఈటీవీ విన్ ఓటీటీ
వసంతి (మలయాళం) – మనోరమా మ్యాక్స్
డే ఆఫ్ రికోనింగ్ (ఇంగ్లీష్) – జియో హాట్‌స్టార్
ది థర్స్‌డే మర్డర్ క్లబ్ ( ఇంగ్లీష్) – నెట్‌ఫ్లిక్స్
లవ్ అన్‌టాంగ్లెడ్ (కొరియన్ ) – నెట్‌ఫ్లిక్స్
టూ గ్రేవ్స్ (స్పానిష్ ) – నెట్‌ఫ్లిక్స్
ఆగస్ట్ 29..
ఫోర్ అండ్ హాఫ్ గ్యాంగ్ (మలయాళం) – సోనీలివ్
కధా పరంజకధా (మలయాళం) – మనోరమా మ్యాక్స్
శోధా (కన్నడ) – జీ5ఓటీటీ
ది కరాటే కిడ్ (ఇంగ్లీష్) – నెట్‌ప్లిక్స్
అటమిక్ (ఇంగ్లీష్) – జియో హాట్ స్టార్
మై మదర్స్ వెడ్డింగ్ (ఇంగ్లీష్) – అమెజాన్ ప్రైమ్ వీడియో
Also Read – New Law Strikes: చట్టం దెబ్బ.. డ్రీమ్ 11తో బీసీసీఐ కటీఫ్.. టీమిండియాకు కొత్త స్పాన్సర్ వేట!


