Saturday, November 15, 2025
HomeTop StoriesTollywood: డిసెంబర్‌లో బాక్సాఫీస్ వార్‌కి రెడీ అవుతున్న సినిమాలివే..

Tollywood: డిసెంబర్‌లో బాక్సాఫీస్ వార్‌కి రెడీ అవుతున్న సినిమాలివే..

Tollywood: టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీకి మాత్రమే కాకుండా సౌత్ మొత్తానికి డిసెంబర్ నెల అనేది కొత్త సినిమాల రిలీజ్‌కి చాలా ప్రాధాన్యత ఉన్న మంత్‌గా పేరుంది. ఏడాది చివరిలో క్రిస్మస్ పండుగ సందర్భంగా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు చిన్న నుంచి పెద్ద బడ్జెట్ సినిమాలతో పాటుగా కొన్ని డబ్బింగ్ మూవీస్ కూడా బాక్సాఫీస్ వద్ద పోటీ పడుతుంటాయి. ఈ ఏడాది కూడా కొన్ని సినిమాలు బాక్సాఫీస్ వద్ద పోటీకి రెడీ అవుతున్నాయి. ఆ వివరాలను ఇప్పుడు చూద్దాం..

- Advertisement -

ఈ డిసెంబర్ నెలలో తెలుగుతో పాటుగా తమిళ, కన్నడ, హిందీ, ఇంగ్లీష్ భాషల నుండి సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. ముఖ్యంగా మన తెలుగులో, ఈ సంవత్సరం ఆఖర్లో విడుదల కాబోయే భారీ చిత్రం అఖండ -2. నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబోలో రాబోతున్న ఈ తాజా మూవీ 2023లో వచ్చిన అఖండ చిత్రానికి సీక్వెల్ గా వస్తుండగా, ఈ డిసెంబర్ 5న విడుదల అవుతోంది. అలా ఈ డిసెంబర్ లో నందమూరి ఫ్యాన్స్ కి అఖండ-2 మూవీ పూనకాలు తెప్పించడం ఖాయం.

Also Read- Nbk 111: బాల‌కృష్ణ సినిమాలో లేడీ సూప‌ర్‌స్టార్ – నాలుగోసారి జోడీ కుదిరిందా?

ఇదే డిసెంబర్ 5వ తేదీన బాలీవుడ్ నుంచి దురంధర్, కోలీవుడ్ నుంచి వా వాతియర్ రిలీజ్ కానున్నాయి. రణ్‌వీర్ సింగ్ హీరోగా నటించిన దురంధర్, కార్తీ నటించిన వా వాతియర్ కూడా భారీ అంచనాలతో రిలీజ్ కాబోతున్నాయి. అంతేకాదు అఖండ 2 తో పాటు ఈ రెండు సినిమాలకి మంచి క్రేజ్ ఉంది. ఇక డిసెంబర్ 12వ తేదీన సుమ, రాజీవ్ కనకాల కొడుకు రోషన్ కనకాల నటించిన మోగ్లీ సినిమా విడుదల అవుతుంది. ఈ చిత్రానికి ‘కలర్ ఫోటో’ దర్శకుడు సందీప్ రాజ్ దర్శకత్వం వహించాడు. చిన్న సినిమాగా రూపొందిన దీనిపై కూడా బజ్ బాగానే ఉంది.

ఇక, డిసెంబర్ 18వ తేదీన బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా నటించిన టైసన్ నాయుడు సినిమాను విడుదల చేస్తున్నారు. అదే రోజున తమిళ దర్శకుడు విజ్ఞేశ్ శివన్ తెరకెక్కించిన లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ అనే తమిళ సినిమా కూడా రిలీజ్ అవుతోంది. ఇక, ఈ సినిమాలో ప్రదీప్ రంగనాథన్ హీరోగా నటించారు. దీంతో ఈ సినిమాపై కూడా అంచనాలు భారీనే ఉన్నాయి. అలా ఒకే రోజు బెల్లంకొండ సాయి శ్రీనివాస్, ప్రదీప్ రంగనాథన్ హీరోలుగా బాక్సాఫీస్ వద్ద పోటీ పడబోతున్నారు.

అంతేకాదు, ఒకే ఒక్క రోజు తేడాతో (డిసెంబర్ 19న) హాలీవుడ్ సినిమా అవతార్: ఫైర్ అండ్ యాష్ కూడా వస్తోంది. ఇక, డిసెంబర్ 25వ తేదీన క్రిస్మస్ పండుగ కానుకగా, మొత్తం తొమ్మిది చిత్రాలు విడుదల కాబోతుండటం ఆసక్తికరం అని చెప్పాలి. టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ నటించిన సీమాతో పాటు, రోషన్ శ్రీకాంత్, ఆది, కిచ్చా సుదీప్, బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ నటించిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద అలరించడానికి రెడీ అవుతున్నాయి.

Also Read- Kantara Chapter 1: ఓటీటీలోకి 800 కోట్ల బ్లాక్‌బ‌స్ట‌ర్ మూవీ – కాంతార చాప్ట‌ర్ వ‌న్ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

అలా డిసెంబర్ 25న ఫంకీ, శంభాల, ఛాంపియన్, ఆనందం, పతంగ్, మార్క్, 7-జి రెయిన్ బో కాలనీ-2, ఆల్ఫా, ది అనకొండ.. కూడా డిసెంబర్ 25న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. ఈ 9 సినిమాల్లో ఏ సినిమా హిట్ అవుతుందో చూడాలి. మొత్తం మీద డిసెంబర్‌లో పలు భాషల నుండి 15 సినిమాలు రాబోతున్నాయి. వీటిలో హిట్ అయ్యేదెన్నో ఫట్ అయ్యేదెన్నో చూడాలి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad