Wednesday, May 14, 2025
Homeచిత్ర ప్రభNikhil: తుర్కియే వస్తువులు వాడొద్దు: హీరో నిఖిల్

Nikhil: తుర్కియే వస్తువులు వాడొద్దు: హీరో నిఖిల్

భారత్-పాకిస్థాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో భారత్‌ సరిహద్దు ప్రాంతాలపై పాక్ డ్రోన్లు, మిస్సైల్స్‌తో దాడి చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ డ్రోన్లను టర్కీ దేశం సరఫరా చేసింది. 2023లో తుర్కియే దేశంలో భూకంపం సంభవించినప్పుడు భారత్ మానవతా దృక్పథంలో భారీ సాయం చేసింది. అయినా కానీ భారత్‌పై యుద్ధానికి పాక్‌కు డ్రోన్లు సాయం చేయడంపై భారత్‌ వ్యాప్తంగా తీవ్ర నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే దేశంలోని ఆపిల్ వ్యాపారులు, మార్బుల్స్ వ్యాపారులు ఆ దేశ వస్తువులను బాయ్‌కాట్ చేశారు. అలాగే నెటిజన్లు కూడా బాయ్‌కాట్ తుర్కియే అంటూ పోస్టులు పెడుతున్నారు.

- Advertisement -

తాజాగా టాలీవుడ్ హీరో నిఖిల్(Nikhil) తుర్కియే దేశానికి వెళ్లొద్దని ట్వీట్ చేశారు. ” చాలా మంది భారతీయులు తుర్కియే వెళ్తున్నారు. అక్కడ మన డబ్బులు ఖర్చు చేస్తున్నారు. అలాగే ఆ దేశపు వస్తువులు వాడుతున్నారు. అలాంటి దేశం కోసం మనం డబ్బులు ఖర్చు పెట్టొద్దు. వాళ్ల వస్తువులు వాడొద్దు. వాళ్ల దేశానికి ఎవరూ వెళ్లొద్దు’ అంటూ రాసుకొచ్చాడు. నిఖిల్ ట్వీట్‌కు నెటిజన్లు మద్దుతు ఇస్తున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News