Sharwanand: హీరో శర్వానంద్ విడాకులు తీసుకోబోతున్నట్లుగా టాలీవుడ్‌లో టాక్ వినిపిస్తోంది. మనస్పర్థల కారణంగా కొన్నాళ్లుగా శర్వానంద్, ఆయన భార్య రక్షిత విడివిడిగా ఉంటున్నారట. ఏపీ హైకోర్టు లాయర్ మధుసూధన్‌రెడ్డి కూతురు రక్షితతో శర్వానంద్ వివాహం 2023 జూన్‌లో జరిగింది. జైపూర్‌లోని లీలా ప్యాలెస్‌లో ఈ జంట పెళ్లిచేసుకున్నారు. గత ఏడాది శర్వానంద్, రక్షితలకు ఓ పాప పుట్టింది.
విభేదాలతో…
గత కొద్ది నెలల క్రితం శర్వానంద్, రక్షిత మధ్య విభేదాలు మొదలైయ్యాయట. గొడవలు తీవ్రంగా మారడంతో ఇద్దరు వేరువేరుగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. శర్వానంద్‌కు దూరంగా రక్షిత తన పుట్టింట్లో ఉంటుందట. పాప మాత్రం శర్వానంద్ వద్ద కొద్ది రోజులు, రక్షిత వద్ద కొద్ది రోజులు ఉంటుందట.
Also Read- Nag Ashwin: కర్మను ఎవరూ తప్పించుకోలేరు.. నాగ్ అశ్విన్ పోస్ట్ దీపికా పదుకొనెను ఉద్దేశించేనా?
విడాకులు తీసుకుంటారా?
శర్వానంద్, రక్షిత మనస్పర్థలు విడాకుల వరకు వచ్చాయని అంటున్నారు. ప్రస్తుతం పెద్దల జోక్యంతో విడాకులు తీసుకోవాలనే నిర్ణయాన్ని కొన్నాళ్ల పాటు వాయిదా వేసినట్లు తెలిసింది. మనస్పర్థలు తొలిగే వరకు వేరువేరుగానే ఉండాలని శర్వానంద్, రక్షిత నిర్ణయించుకున్నట్లు చెబుతోన్నారు. పెళ్లైన రెండేళ్లకే వీరిద్దరు విడిపోవడం టాలీవుడ్‌లో చర్చనీయంశంగా మారింది.
సినిమాలపై…
కుటుంబ గొడవల ఎఫెక్ట్ శర్వానంద్ సినిమాలపై పడినట్లు సమాచారం. షూటింగ్స్ డిలేకు ఫ్యామిలీ లైఫ్ ఇష్యూస్ కారణమని అంటున్నారు. ప్రస్తుతం నారి నారి నడుమ మురారితో పాటు సంపత్ నంది భోగి సినిమాలు చేస్తున్నాడు శర్వానంద్. వీటితో పాటు అభిలాష్ కంకర దర్శకత్వంలో ఓ స్పోర్ట్స్ థ్రిల్లర్ మూవీని అంగీకరించాడు.
Also Read- Viral Video: నిమ్మకాయ తిన్న తర్వాత.. ఒంటె రియాక్షన్ చూస్తే మీరు నవ్వకుండా ఉండలేరు..
ఈ మూడు సినిమాల్లో నారి నారి నడుమ మురారి షూటింగ్ మాత్రమే తుది దశకు చేరుకుంది. రామ్ అబ్బరాజు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా సంక్రాంతికి రిలీజయ్యే అవకాశం ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మిగిలిన రెండు సినిమాలు కొంత వరకు షూటింగ్‌ను జరుపుకున్నాయి. వ్యక్తిగత సమస్యల నుంచి ఇప్పుడిప్పుడే బయటపడుతున్న శర్వానంద్ తిరిగి షూటింగ్‌లను మొదలుపెట్టాలని నిర్ణయించుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ మూడు సినిమాలను సాధ్యమైనంత తొందరగా పూర్తిచేయాలని అనుకుంటున్నాడట. చివరగా గత ఏడాది రిలీజైన మనమే మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చారు శర్వానంద్. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద యావరేజ్‌గా నిలిచింది.


