Tollywoodpps: బెట్టింగ్ యాప్స్ కేసు టాలీవుడ్‌ను కుదిపేస్తోంది. బెట్టింగ్స్ యాప్‌లను ప్రమోట్ చేసినందుకు విజయ్ దేవరకొండ, ప్రకాష్ రాజ్, రానాతో పాటు పలువురు సినిమా హీరోలు, యాంకర్లు, యూట్యూబ్ స్టార్స్‌పై కేసులు నమోదు అయ్యాయి. ఈ బెట్టింగ్ యాప్స్ వ్యవహారంలో చిక్కుకున్న సెలిబ్రిటీలు అందరికి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నోటీసులు జారీ చేసింది. ఒక్కొక్కరిగా విచారిస్తోంది.
విచారణకు విజయ్ దేవరకొండ…
తాజాగా బెట్టింగ్ యాప్ ప్రమోట్ కేసులో బుధవారం ఈడీ విచారణకు టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ హాజరయ్యాడు. విచారణ నిమిత్తం తన లాయర్‌తో కలిసి ఈడీ ఆఫీస్‌కు వచ్చారు విజయ్ దేవరకొండ. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
రెమ్యూనరేషన్స్‌పై ఆరాలు…
ఎన్ని బెట్టింగ్స్ యాప్స్ ను విజయ్ దేవరకొండ ప్రమోట్ చేశాడు? వాటి ద్వారా అందుకున్న రెమ్యూనరేషన్స్, ఇతర లావాదేవీలపై అధికారులు ఆరాలు తీసినట్లు సమాచారం. ఈ బెట్టింగ్ యాప్స్‌ను ఎందుకు ప్రమోట్ చేయాల్సివచ్చింది? ఈ యాప్స్ ప్రమోట్‌కు సంబంధించి విజయ్‌ని ఎవరు సంప్రదించారనే కోణంలో విచారణ జరిగినట్లు సమాచారం. ఈడీ అధికారులు అడిగిన అన్ని ప్రశ్నలకు విజయ్ దేవరకండ సమాధానం ఇచ్చినట్లు సమాచారం. బెట్టింగ్ యాప్స్ ఆర్థిక లావాదేవీలకు సంబంధించి తన దగ్గర ఉన్న ఆధారాలను ఈడీ అధికారులకు విజయ్ దేవరకొండ సమర్పించినట్లు చెబుతోన్నారు.
Also Read – Uttarkashi Floods: ఉత్తర కాశీలో జల విలయం.. కంటతడి పెట్టిస్తున్న దశ్యాలు..
ప్రకాష్ రాజ్…
బెట్టింగ్ యాప్స్ మనీలాండరింగ్ కేసులో విజయ్ దేవరకొండ కంటే ముందు ప్రకాష్‌రాజ్, శ్యామల, విష్ణుప్రియతో పాటు పలువురు సెలిబ్రిటీలను అధికారులు విచారించారు. బెట్టింగ్ యాప్‌లను తెలియక ప్రమోట్ చేశానని, వాటి నుంచి డబ్బులు తీసుకోలేదని విచారణ అనంతరం ప్రకాష్ రాజ్ తెలిపారు.
నెక్స్ట్ రానా…
ఈ బెట్టింగ్ యాప్ కేసులో రానా, మంచు లక్ష్మితో పాటు మరికొందరు టాలీవుడ్ సెలిబ్రిటీలను ఈడీ అధికారులు విచారించబోతున్నట్లు సమాచారం. విజయ్ తర్వాత రానా దగ్గుబాటి విచారణకు హజరయ్యే అవకాశం ఉన్నట్లు చెబుతోన్నారు.
కింగ్డమ్ మూవీతో…
కాగా ఇటీవలే కింగ్డమ్ మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు విజయ్ దేవరకొండ. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో స్పై యాక్షన్ డ్రామాగా రూపొందిన ఈ మూవీ మిక్స్‌డ్ టాక్‌ను సొంతం చేసుకున్నది. ఈ సినిమాలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటించింది. సత్యదేవ్ కీలక పాత్ర పోషించాడు.
కింగ్డమ్ తర్వాత టాలీవుడ్ డైరెక్టర్లు రాహుల్ సాంకృత్యాన్, రవికుమార్ కోలాలతో సినిమాలు విజయ్ దేవరకొండ చేస్తున్నాడు.
Also Read – Mansoon : వర్షాకాలంలో ఈ సమస్యలు మిమ్మల్ని వేధిస్తున్నాయా..అయితే ఇలా చెక్ పెట్టేద్దాం!


