Tollywood: సినిమా ఇండస్ట్రీలో ఆఫర్లు, రెమ్యూనరేషన్ల, స్టార్‌డమ్.. అన్నింటిని డిసైడ్ చేసేది సక్సెస్ ఒక్కటే. సక్సెస్ ఉన్న హీరోల చుట్టూనే ఇండస్ట్రీ తిరుగుతుంది. ఫ్లాపుల్లో ఉంటే ఎవరూ పెద్దగా పట్టించుకోరు. టాలీవుడ్ యంగ్ స్టార్స్‌తో కొందరు సీనియర్ హీరోలు సక్సెస్ కోసం కొన్నేళ్లుగా బాక్సాఫీస్ వద్ద దండయాత్రలు చేస్తూనే ఉన్నారు. ఒక్క హిట్టు కోసం ఎదురుచూస్తున్న ఆ హీరోలు ఎవరంటే?
విజయ్ దేవరకొండ కమ్‌బ్యాక్ ఎప్పుడు?
అర్జున్ రెడ్డి, గీతాగోవిందం బ్లాక్‌బస్టర్స్‌తో స్టార్ లీగ్‌లో చేరిపోయారు విజయ్ దేవరకొండ. అతడితో సినిమాలు చేసేందుకు అగ్ర దర్శకులు, నిర్మాణ సంస్థలు క్యూ కట్టాయి. ఆఫర్లు భారీగానే వచ్చిన సక్సెస్‌లలో మాత్రం విజయ్ దేవరకొండ వెనుకబడిపోయారు. విజయ్ గత సినిమాలు ఫ్యామిలీ స్టార్, ఖుషి, లైగర్, వరల్డ్ ఫేమస్ లవర్ డిజాస్టర్స్‌గా నిలిచాయి. కింగ్డమ్ సక్సెస్ అతడి కెరీర్‌కు కీలకంగా మారింది. ఈ సినిమాతో విజయ్ కమ్‌బ్యాక్ ఇవ్వాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. కింగ్డమ్‌కు జెర్సీ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ ఫ్లాపులతో సంబంధం లేకుండా రౌడీ జనార్ధనతో పాటు మైత్రీ మూవీ మేకర్స్‌లో మరో సినిమా చేస్తున్నాడు విజయ్ దేవరకొండ.
Also Read – Megastar new movie: చిరంజీవి – శ్రీకాంత్ ఓదెల కాంబో: వైరల్ అవుతోన్న గ్యాంగ్‌స్టర్ కథ..?
తొమ్మిది ఫ్లాప్‌లు…
మహేష్‌బాబు బావ సుధీర్‌బాబు కెరీర్‌లో సక్సెస్‌ల కంటే ఫ్లాప్‌లే ఎక్కువగా ఉన్నాయి. సమ్మోహనం తర్వాత సుధీర్‌బాబు చేసిన తొమ్మిది సినిమాలు ప్రేక్షకులను మెప్పించలేకపోయాయి. రిజల్ట్‌తో సంబంధం లేకుండా వెరైటీ సినిమాలు చేస్తున్నాడు. ప్రస్తుతం జఠాధర పేరుతో ఓ పాన్ ఇండియన్ మూవీ చేస్తున్నాడు.
ఎల్లమ్మపైనే ఆశలన్నీ…
నితిన్ కెరీర్ కూడా ఒక్క హిట్టు ఆరు ఫ్లాప్‌లు అన్న చందంగా సాగుతోంది. ఇటీవల రిలీజైన తమ్ముడు మూవీతో ఫ్లాపుల్లో డబుల్ హ్యాట్రిక్ కొట్టాడు. భారీ బడ్జెట్‌తో రూపొందిన తమ్ముడు నిర్మాతలను నిండా ముంచేసింది. ప్రస్తుతం బలగం వేణు దర్శకత్వంలో రాబోతున్న ఎల్లమ్మపైనే నితిన్ ఆశలన్నీ పెట్టుకున్నాడు.
మూడు సినిమాలు…
భైరవం సినిమాతో తన ఫ్లాప్‌ల పరంపరను కంటిన్యూ చేశాడు బెల్లంకొండ శ్రీనివాస్. టాలీవుడ్‌కు నాలుగేళ్ల పాటు గ్యాప్ తీసుకొని మరీ చేసిన ఈ మల్టీస్టారర్ రీమేక్ బెల్లంకొండను గట్టిగానే దెబ్బకొట్టింది. ఛత్రపతి రీమేక్‌తో బాలీవుడ్‌లో పాగా వేయాలన్న ఆశలు తీరలేదు. ఈ ఫ్లాప్‌లతో సంబంధం లేకుండా మూడు సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు బెల్లంకొండ శ్రీనివాస్.
Also Read – B. Saroja Devi: సీనియర్ నటి బి.సరోజాదేవి కన్నుమూత
స్టైల్ మార్చేశాడు…
గోపీచంద్ హిట్టు అనే మాట విని చాలా కాలమే అయ్యింది. మాస్ కథలతో అతడు చేస్తున్న ప్రయత్నాలేవి అంతగా ఫలించడం లేదు. ఈ సారి కథల ఎంపికలో తన స్టైల్ మార్చేశాడు. ఘాజీ ఫేమ్ సంకల్ప్ రెడ్డితో ఓ ప్రయోగాత్మక సినిమా చేయబోతున్నాడు. ఈ ప్రయోగంతో తన హిట్టు నిరీక్షణకు తెర దించాలని గోపీచంద్ భావిస్తున్నాడు.
అఖిల్ పదేళ్ల నుంచి వెయిటింగ్…
టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చి పదేళ్లు హీరోగా హిట్టు అందుకోవాలనే అఖిల్ కల మాత్రం తీరలేదు. అతడి లాస్ట్ మూవీ ఏజెంట్ తెలుగు ఇండస్ట్రీలో బిగ్గెస్ట్ డిజాస్టర్స్‌లో ఒకటిగా నిలిచింది. ఈ ఫెయిల్యూర్ ఎఫెక్ట్‌తో రెండేళ్లు టాలీవుడ్‌కు గ్యాప్ ఇచ్చిన అఖిల్ ప్రస్తుతం లెనిన్ మూవీ చేస్తున్నాడు. హోమ్ బ్యానర్ అన్నపూర్ణ స్టూడియోస్ అయినా అఖిల్‌కు హిట్టు ఇస్తుందో లేదో అన్నది ఆసక్తికరంగా మారింది.
మెగా హీరోలు…
మెగా హీరోలు వైష్ణవ్‌తేజ్, వరుణ్‌తేజ్ బ్యాక్ టూ బ్యాక్ డిజాస్టర్స్‌తో డిజపాయింట్ చేస్తున్నారు. ప్రయోగాలను పక్కన పెట్టి హిట్టు కోసం ప్రస్తుతం ఓ కామెడీ మూవీ చేస్తున్నాడు వరుణ్‌తేజ్. మేర్లపాక గాంధీ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. వైష్ణవ్‌తేజ్ సైలెంట్‌గా ఓ రొమాంటిక్ కామెడీ మూవీ చేస్తున్నాడు


