Tollywood Heroes: మాస్, కమర్షియల్ సినిమాలకే పరిమితం కాకుండా మన స్టార్స్ ఇప్పుడు ఎక్స్‌పెరిమెంట్స్‌కు సిద్ధమయ్యారు. డిఫరెంట్ లుక్స్‌లో కనిపించటానికి రెడీ అంటున్నారు. దీని వల్ల ఫ్యాన్స్‌లో ఎక్స్‌ఫెక్టేషన్స్ పెరిగిపోతున్నాయి. తమ సినిమాలపై అంచనాలను పెంచేస్తోన్న టాలీవుడ్ స్టార్ హీరోలెవరనే దాన్ని ఓసారి గమనిస్తే.. సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా SSMB29. దీనిపై సోషల్ మీడియాలో విపరీతమైన చర్చ జరుగుతోంది. ఈ సినిమాకు సంబంధించి అధికారిక అప్‌డేట్స్ లేకపోయినా, ఈ మూవీకి మైథలాజికల్ టచ్ కూడా ఉందనే టాక్ అయితే బలంగా వినిపిస్తోంది. సమాచారం మేరకు మహేష్ బాబు రాముడి పాత్రలో కనిపించే అవకాశం ఉంది. అంటే ఒకవైపు యాక్షన్ హీరోగా, మరోవైపు పౌరాణిక పురుషుడిగా మహేష్ రెండు డిఫరెంట్ లుక్స్‌లో కనిపించబోతున్నారు. మరి జక్కన్న దీన్నెలా సిల్వర్ స్క్రీన్‌పై చూపిస్తాడనేది అందరిలోనూ ఆసక్తిని పెంచుతోంది.
యంగ్ టైగర్ ఎన్టీఆర్ విషయానికి వస్తే, ఆయన నటిస్తున్న ప్రతి సినిమాలోనూ లుక్స్ విషయంలో స్పెషల్ కేర్ తీసుకుంటున్నారు. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్నయాక్షన్ ఎంటర్‌టైనర్ డ్రాగన్‌లో తారక్ రెండు డిఫరెంట్ షేడ్స్‌లో కనిపించబోతున్నారు. మొన్నటి వరకు స్లిమ్‌గా కనిపించిన ఎన్టీఆర్, ఇప్పుడు మరో లుక్ కోసం బాడీని పెంచే పనిలో ఉన్నారు. అంతేకాకుండా, కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న దేవర సినిమాలో కూడా తారక్ క్యారెక్టర్‌లో రెండు షేడ్స్ ఉంటాయనేది తెలిసిందే.
Also Read – Dasara 2025: దసరా రోజు శక్తివంతమైన రాజయోగం.. ఈ 3 రాశుల వారికి అమ్మవారి అనుగ్రహం..
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తన ప్రతి సినిమా కోసం కొత్త గెటప్‌లోకి మారిపోతుంటారు. ఇప్పటికే రిలీజ్ అయిన పెద్ది టీజర్‌లో చరణ్ లుక్‌కి ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. అయితే ఈ మూవీలో ఆయనకు మరో లుక్ కూడా ఉంటుందని మూవీ టీమ్ హింట్ ఇస్తోంది. ఆ లుక్ కోసం రామ్ చరణ్ భారీగా కండలు పెంచారు. మరోవైపు డార్లింగ్ ప్రభాస్ కూడా తాను నటిస్తున్న ప్రతి సినిమాలో రెండు లుక్స్ ఉండేలా జాగ్రత్త తీసుకుంటున్నారు. ప్రస్తుతం సెట్స్‌పై ఉన్న ‘ది రాజా సాబ్’ సినిమాలో ఆయన రెండు వేరియేషన్స్ చూపించబోతున్నారు.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈ ట్రెండ్‌లో మరో అడుగు ముందుకేశారు. ఆయన రాబోయే సినిమా AA22 కోసం ఏకంగా మల్టిపుల్ లుక్స్‌లో కనిపించబోతున్నారు. ఈ ప్రయోగం బన్నీ సినిమాపై అంచనాలను తారాస్థాయికి చేర్చింది. టాప్ హీరోలు ఒకే చిత్రంలో రెండు లేదా మూడు లుక్స్‌లో కనిపిస్తుండడంతో, ప్రేక్షకులకు ఒకే టికెట్‌పై విభిన్నమైన వినోదం లభించబోతోంది. ఈ స్టార్ హీరోల సినిమాల కోసం సినీ ప్రేమికులు ఎంతో ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు.
Also Read – GHMC: జీహెచ్‌ఎంసీ కీలక నిర్ణయం.. ఈ గురువారం మాంసం అమ్మితే చర్యలే!


