Saturday, November 15, 2025
HomeTop StoriesTollywood Heroines: టాలీవుడ్ బ్యూటీస్ బాలీవుడ్ డెబ్యూ.. న‌యా ఫార్ములా

Tollywood Heroines: టాలీవుడ్ బ్యూటీస్ బాలీవుడ్ డెబ్యూ.. న‌యా ఫార్ములా

Tollywood Heroines: టాలెంట్ ప్రూవ్ చేసుకోవాలంటే ముందు ఇంట గెల‌వాలి. త‌ర్వాతే ర‌చ్చ గెల‌వటానికి కాన్ఫిడెన్స్ వ‌స్తుంది. ఎప్పుడైతే మ‌న ప్లేస్‌లో కాకుండా బ‌య‌ట గెల‌వాల‌నుకుంటారో అప్పుడే అస‌లు టాలెంట్ బ‌య‌ట‌ప‌డుతుంది. మ‌న టాలీవుడ్ బ్యూటీస్ ఇప్పుడు ఇలాంటి స్టేజ్‌లో ఉన్నారు. సౌత్‌తో పాటు బాలీవుడ్‌లోనూ ఎంట్రీ ఇచ్చేస్తున్నారు. దీని కోసం వారు ఫాలో అవుతున్న ఫార్ములా అంద‌రికీ ఇంట్రెస్ట్‌ను క్రియేట్ చేస్తోంది.. ఇంత‌కీ స‌ద‌రు న‌యా ఫార్ములా ఏంట‌నే డీటెయిల్స్‌ను ఓసారి చూసేద్దాం…

- Advertisement -

సౌత్‌లో మంచి క్రేజ్ సంపాదించుకున్న నటి మీనాక్షి చౌదరి, ఇప్పుడు బాలీవుడ్‌లోకి అడుగుపెట్టడానికి సిద్ధమవుతున్నారు. ఇప్పటి వరకు దక్షిణాదిలో కమర్షియల్ హీరోయిన్ల రేంజ్‌లో పాత్రలకే పరిమితమైన ఆమె, హిందీలో మాత్రం పూర్తిగా విభిన్నమైన పాత్రతో అలరించబోతోంది. ‘యాక్షన్ గర్ల్’ అవతారంలో స్క్రీన్‌ మీద కనిపించేందుకు ప్లాన్ చేసుకుంటున్న మీనాక్షి, జాన్ అబ్రహాం ప్రధాన పాత్రలో రూపొందుతున్న భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘ఫోర్స్ 3’ ద్వారా బాలీవుడ్‌లో గ్రాండ్ ఎంట్రీ ఇవ్వబోతోంది. ఇందులో ఆమె పోషించబోయే పాత్ర కేవలం గ్లామర్‌కే పరిమితం కాకుండా, యాక్షన్, ఎమోషన్, పర్‌ఫార్మెన్స్ అన్నిటికీ స్కోప్ ఉన్నట్టుగా సమాచారం.

Also Read – Health: మధుమేహం ఉన్న వారు సీతాఫలం తినవచ్చా(

ఇప్పటికే బాలీవుడ్ ప్రాజెక్టులతో బిజీగా మారుతున్న యంగ్ బ్యూటీ శ్రీలీల, తన సౌత్ ఇమేజ్‌కు భిన్నంగా హిందీ చిత్రసీమలో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించాలనే టార్గెట్‌తో ప‌క్కా ప్లానింగ్‌తో ముందుకెళ్తోంది. సౌత్‌లో ఓ ఎనర్జిటిక్ డాన్సర్‌గా, కమర్షియల్ హీరోయిన్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్న శ్రీలీల, బాలీవుడ్‌లో మాత్రం కేవలం గ్లామర్‌కు మాత్రమే పరిమితం కాకుండా, నటిగా నిలిచిపోయేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అందుకే, ఆమె మొదటి హిందీ చిత్రం కోసం ఒక ఎమోషనల్ రొమాంటిక్ డ్రామాని సెల‌క్ట్ చేసుకుంది. ఇందులో నటనకు ఎక్కువ స్కోప్ ఉండే పాత్ర ద్వారా, ప్రేక్షకులకు ద‌గ్గ‌ర కావాల‌నే ఆలోచనతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.

నేచుర‌ల్ టాలెంట్‌కి చిరునామాగా నిలిచిన హీరోయిన్ అంటే ఇప్పుడున్న వారిలో ముందు వినిపించే పేరు సాయి పల్లవి. ఆమె కూడా ప్రెస్టీజియ‌స్ రామాయ‌ణ మూవీతో ఇప్పుడు బాలీవుడ్‌లో అడుగుపెడుతున్నారు. ఇప్పటివరకు సౌత్ సినిమాల్లో ఎక్కువగా ‘గర్ల్ నెక్స్ట్ డోర్’ తరహా పాత్రలతో ప్రేక్షకుల మనసుల్లో చోటు దక్కించుకున్న ఈ నాచురల్ బ్యూటీ, హిందీ తెరపై మాత్రం పూర్తి విభిన్నమైన అవతారంలో దర్శించబోతున్నారు. బాలీవుడ్ ప్రేక్ష‌కుల‌కు ఆమె సీతమ్మ పాత్రలో కనిపించనున్నారు. ఇది ఆమెకు బాలీవుడ్‌లో తొలి చిత్రం కావడంతో పాటు, ఇప్పటి వరకు చేసిన పాత్రలతో పోలిస్తే ఎంతో గొప్ప‌దైన‌ చారిత్రాత్మక పాత్ర. మ‌రీ పాత్ర‌లో ఆమె ఆడియెన్స్‌ను ఎలా మెప్పిస్తార‌నేది అంద‌రిలోనూ ఆస‌క్తిని క‌లిగిస్తోంది.

కమర్షియల్ హంగులను ప‌క్క‌న పెట్టి.. కంటెంట్‌కు ప్రాధాన్యత ఇచ్చే కథను ఎంచుకోవడం ద్వారా మీనాక్షి చౌద‌రి, శ్రీలీల‌, సాయి ప‌ల్ల‌వి త‌మ బాలీవుడ్ కెరీర్‌ను కొత్త డైరెక్ష‌న్‌లోకి తీసుకెళ్లాల‌నుకుంటున్నారు. రొటీన్‌కు భిన్నంగా వారు ఫాలో అవుతున్న ఈ ఫార్ములా వారికి కొత్త ఇమేజ్‌ను తీసుకొస్తుంద‌నే ఆలోచ‌న‌తో ముందడుగు వేశారు. ఈ విధంగా సౌత్ బ్యూటీస్ అంతా బాలీవుడ్‌లో కేవలం అవకాశాల కోసం కాకుండా తమ కెరీర్ కోసం స్పెషల్ ప్లానింగ్ రెడీ చేసుకున్నారు. సేఫ్ జోన్ దాటి ఛాలెంజింగ్‌ పాత్రలతో వారి అస‌లు టాలెంట్ ప్రూవ్ చేసుకోవాల‌నుకుంటున్నారు. వారి ప్ర‌య‌త్నాలు ఎలాంటి స‌క్సెస్‌నిస్తుందో చూడాలి మ‌రి.

Also Read – Nayanthara: మ‌న శంక‌ర‌వ‌ర‌ప్ర‌సాద్ గారు స్పెష‌ల్ అప్‌డేట్ – న‌య‌న‌తార ఫ‌స్ట్ లుక్ రిలీజ్‌

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad