Bigg Boss Telugu 9: బిగ్‌బాస్ తెలుగు సీజన్ 9 సందడి త్వరలో మొదలుకాబోతుంది. సెప్టెంబర్ 7 నుంచి కొత్త సీజన్ లాంఛ్ కానుంది. సీజన్ 9కు మరోసారి హోస్ట్‌గా నాగార్జున కనిపించబోతున్నాడు. బిగ్‌బాస్ సీజన్ 9లో పాల్గొనే కంటెస్టెంట్స్ ఫైనల్ అయినట్లు సమాచారం. పలువురు టీవీ, సోషల్ మీడియా సెలిబ్రిటీలు ఈ షోలో పాల్గొననున్నట్లు ప్రచారం జరిగింది. అభిమానుల అంచనాలకు భిన్నంగా ఎవరూ ఊహించని కంటెస్టెంట్స్ ఈ షోలోకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు చెబుతున్నారు. బిగ్‌బాస్ హౌజ్‌లోకి ఇద్దరు టాలీవుడ్ హీరోయిన్లు అడుగుపెట్టనున్నట్లు తెలిసింది. సంజన గల్రానీతో పాటు ఆశా శైనీ కంటెస్టెంట్స్‌గా ఎంపికయ్యారట.
ప్రభాస్ బుజ్జిగాడుతో…
ప్రభాస్ బుజ్జిగాడు మూవీతో తెలుగులో పాపులర్ అయ్యింది సంజనా గల్రానీ. ఈ సినిమాలో హీరోయిన్ త్రిష చెల్లెలి పాత్రలో కనిపించింది. దుశ్శాసన, ముగ్గురు, పోలీస్ పోలీస్‌తో పాటు తెలుగులో హీరోయిన్‌గా చాలానే సినిమాలు చేసింది సంజన. కానీ సరైన బ్రేక్ మాత్రం దక్కలేదు. మరోవైపు ఆశాశైనీ కెరీర్ తెలుగు సినిమాలతోనే మొదలైంది. బాలకృష్ణ బ్లాక్‌బస్టర్ మూవీ నరసింహానాయుడులో ఓ హీరోయిన్‌గా కనిపించింది. చాలా బాగుంది, మనసున్న మారాజు, ప్రేమతో రా, చెప్పాలని ఉందితో పాటు తెలుగులో మంచి సినిమాలే చేసింది. పరాజయాల కారణంగా సంజన, ఆశా శైనీ టాలీవుడ్‌కు దూరమయ్యారు.
Also Read- Mirai and Mass Jathara: అఫీషియల్….రవితేజ మాస్ జాతర పోస్ట్‌పోన్ – మిరాయ్ రిలీజ్ డేట్ ఛేంజ్
లాంగ్ గ్యాప్ తర్వాత బిగ్‌బాస్‌తో ఈ ఇద్దరు ముద్దుగుమ్మలు తెలుగు ప్రేక్షకులముందుకు రాబోతున్నట్లు సమాచారం. ఈ షో కోసం సంజన, ఆశాశైనీ భారీగానే రెమ్యూనరేషన్ అందుకుంటున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ హీరోయిన్లతో పాటు ముద్దమందారం సీరియల్ ఫేమ్ తనూజ గౌడ కూడా బిగ్‌బాస్ తెలుగు సీజన్ 9లో కంటెస్టెంట్‌గా ఛాన్స్ దక్కించుకున్నట్లు చెబుతున్నారు.
బిగ్‌బాస్ అగ్నిపరీక్ష…
బిగ్‌బాస్ తెలుగు సీజన్ 9లోకి సెలిబ్రిటీలతో పాటు ఐదుగురు కామన్ మ్యాన్స్ కూడా పాల్గొనబోతున్నారు. ఈ సామాన్యుల ఎంపిక కోసం బిగ్‌బాస్ అగ్నిపరీక్ష పేరుతో ఓ స్పెషల్ షోను టెలికాస్ట్ చేస్తున్నారు. డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో ప్రసారమవుతున్న ఈ షోకు శ్రీముఖి హోస్ట్‌గా వ్యవహరిస్తోంది. నవదీప్, అభిజీత్, బిందుమాధవి జడ్జీలుగా వ్యవహరిస్తున్నారు.
Also Read- PM Modi: దేశీయ తొలి మారుతీ సుజుకీ ఈవీ లాంచ్ చేసిన ప్రధాని మోదీ.. e Vitara ఫీచర్స్ ఇవే..
బిగ్‌బాస్ అగ్ని పరీక్షలో నలభై మంది కంటెస్టెంట్స్ పాల్గొనగా…ఇందులో నుంచి టాప్ 15ను జడ్జీలు ఫైనల్ చేశారు. ఈ పదిహేను మంది ఓటింగ్ ప్రకారం టాప్‌లో నిలిచిన ఐదుగురికి మాత్రమే బిగ్‌బాస్‌లోకి ఎంట్రీ ఇచ్చే ఛాన్స్ దక్కనుంది. సెప్టెంబర్ 5వ తేదీన టాప్ ఫైవ్ లిస్ట్‌ను అనౌన్స్‌చేయనున్నారు.
టాప్ 15లో నిలిచిన కంటెస్టెంట్స్ వీళ్లే!
అలా అనూష, దాల్య షరీష్, హరిత హరీష్, దివ్య, డిమాన్ పవన్, కళ్యాణ్ పడాల, కల్కి, మర్యాద మనీష్, నాగ, ప్రియా శెట్టి, శ్రీజ, శ్వేతా శెట్టి, సయ్యద్ షకీబ్, ప్రసన్నకుమార్ టాప్ 15లో నిలిచారు.


