Sunday, May 18, 2025
Homeచిత్ర ప్రభTollywood: బాలీవుడ్ లోకి మహేష్, రాజమౌళి డైరెక్షన్ లో ఇండియానా జోన్స్ రేంజ్ లో..

Tollywood: బాలీవుడ్ లోకి మహేష్, రాజమౌళి డైరెక్షన్ లో ఇండియానా జోన్స్ రేంజ్ లో..

బాలీవుడ్ కి వెళ్లాని ఈమధ్య ప్రిన్స్ మహేష్ బాబు తెగ ఆసక్తి చూపుతున్నారు. ఈమేరకు ఇండియానా జోన్స్ రేంజ్ లో ఓ భారీ సినిమాను దిగ్గజ దర్శకుడు రాజమౌళి మహేష్ ను డైరెక్ట్ చేయనున్నారు. ఆర్ఆర్ఆర్ తరువాత మహేష్ సినిమాను సెట్స్ మీదకు తీసుకెళ్లే పనుల్లో ఉన్నట్టు జక్కన్న గత కొంతకాలంగా చెబుతూ వస్తున్నారు. ఇక ప్రస్తుతం పూజా హెగ్డే, శ్రీలీలతో కలిసి తెరకెక్కుతున్న SSMB 28 సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఈ సినిమాను ఫుల్ అండ్ ఫుల్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కించేలా స్క్రిప్ట్ పైన మళ్లీ త్రివిక్రమ్ వర్క్ చేశారు. తాజా న్యూస్ ప్రకారం SSMB 28ను ఓటీటీ ప్లాట్ ఫాం నెట్ ఫ్లిక్స్ చేజిక్కించుకుంది. ఇందుకు 80 కోట్ల రూపాయలు వెచ్చించేందుకు నెట్ ఫ్లిక్స్ ఓకే చెప్పిందట. అయితే ఈ సినిమా హిందీ రైట్స్ మాత్రం ఇంకా ఎవరికీ అమ్మకపోవటం హైలైట్. ఎలాగూ బాలీవుడ్ వైపు చూస్తున్న మహేష్ సినిమా మార్కెట్ ఎక్కువగా ఉంటుందన్న ముందు చూపుతో ప్రొడ్యూసర్స్ హారికా హాసిని బ్యానర్ SSMB 28 హిందీ రైట్స్ తమవద్దే ఉంచుకుందని ఫిల్మ్ నగర్ టాక్.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News