Saturday, November 15, 2025
Homeచిత్ర ప్రభMid Range Heroes: టెన్షన్‌లో మిడ్ రేంజ్ హీరోలు

Mid Range Heroes: టెన్షన్‌లో మిడ్ రేంజ్ హీరోలు

Mid Range Heroes: ఇటీవలి కాలంలో తెలుగు సినీ పరిశ్రమలో మీడియం రేంజ్ హీరోల పరిస్థితి ఆందోళన కలిగిస్తోంది. ఒక సినిమా ఫ్లాప్ అయినా కనీసం ఓపెనింగ్స్ అయినా రావాలి కదా, అవి కూడా రావట్లేదంటే లోపం మనలోనే ఉందని, అలాగే వదిలేస్తే పరిస్థితి మరింత చేజారిపోతుందని సినీ విశ్లేషకులు అంటున్నారు. ఈ విషయంలో మీడియం రేంజ్ హీరోలు ఓసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది.

- Advertisement -

హిట్ ఉంటే ఇండస్ట్రీలోనే కాదు.. బయట కూడా మంచి గుర్తింపు ఉంటుంది. ఇలాంటి హిట్ సినిమాల కోసం హీరోలు తెగ కష్టపడుతుంటారు. కానీ సక్సెస్ అంత సులభంగా రాదు. సినిమా పోతే పర్లేదు కానీ, మార్కెట్ కూడా వదులుకుంటేనే అసలు సమస్య మొదలవుతుంది. కనీసం ఆలోచించే కథలు కూడా తీసుకోవట్లేదా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో మీడియం రేంజ్ హీరోలను చూస్తుంటేనే నిర్మాతలకు భయమేస్తుందని స్పష్టమవుతోంది.

Also Read- Ramayanam Movie Budget: భారతీయ సినిమాలకు ఇంత బడ్జెట్టా…రిస్క్ తీసుకుంటున్నారా..?

నిజానికి, స్టార్ హీరోలలో ప్రభాస్ మినహా మరెవ్వరు రెండేళ్లకు గాని ఓ సినిమా చేయట్లేదు. దీంతో మిడ్ రేంజ్ హీరోలైనా ఇండస్ట్రీని ఆదుకుంటారేమో అనుకుంటే, వాళ్ళు మరింత దారుణంగా మారిపోతున్నారు. ఈ మొత్తం పరిస్థితిలో నాని ఒక్కడే కన్సిస్టెంట్ అని చెప్పాలి. ‘దసరా’, ‘హాయ్ నాన్న’ వంటి చిత్రాలతో విజయాలు సాధించిన నాని, ‘HIT 3’ తో హ్యాట్రిక్ పూర్తి చేసి మరో హిట్ కొట్టారు. ప్రస్తుతం ఆయన ‘పారడైజ్’ తో బిజీగా ఉన్నారు.

ఇక ఇతర హీరోల విషయానికొస్తే, విజయ్ దేవరకొండ కెరీర్ ఏమంత గొప్పగా లేదు. ‘ఖుషి’ పర్లేదనిపించినా, ‘ఫ్యామిలీ స్టార్’ దారుణంగా ముంచేసింది. ప్రస్తుతం ఆయన ఆశలన్నీ జూలై 31న విడుదల కానున్న ‘కింగ్డమ్’ పైనే ఉన్నాయి. దీని తర్వాత రాహుల్ సంక్రిత్యన్ దర్శకత్వంలో ‘రౌడీ జనార్ధన్’ సినిమా కూడా ఉంది.

మాస్ మహారాజా రవితేజ విషయానికి వస్తే, గతంలో ‘ధమాకా’ మరియు ‘వాల్తేరు వీరయ్య’ తో ట్రాక్ ఎక్కినట్లు కనిపించినా, తర్వాత మళ్ళీ గాడి తప్పారు. గతేడాది వచ్చిన ‘మిస్టర్ బచ్చన్’ డిజాస్టర్ అయ్యింది. ఇప్పుడాయన మాస్ జాతర, తన 76వ సినిమాలపై నమ్మకంగా ఉన్నారు. అలాగే, గోపీచంద్ నటించిన ‘విశ్వం’ సినిమాకు టాక్ బానే వచ్చినా, ఆడియన్స్ థియేటర్స్ కు రాలేదు. నితిన్ మరియు కళ్యాణరామ్ చాలా ఏళ్లుగా ట్రాక్ తప్పారని చెప్పాలి. మొన్న విడుదలైన నితిన్ సినిమా ‘తమ్ముడు’ కు కనీసం ఓపెనింగ్స్ కూడా రాలేదు. వరుణ్ తేజ్ హిట్ కొట్టి చాలా ఏళ్లే అవుతుంది. అందుకనే ఈసారి జోనర్ మార్చి మరీ సినిమా చేస్తున్నాడు.

Also Read- Meenakshi Chaudhary: టాలీవుడ్ గ్లామర్ క్వీన్..మీనాక్షి చౌదరి గ్లామర్ ట్రీట్!!

మిడియం రేంజ్ హీరోలే కదా అని తక్కువగా అంచనా వేయడానికి లేదని, వారి సినిమాలు క్లిక్ అయితే 100 కాదు 200 కోట్లు కూడా వస్తాయని నిరూపితమైంది. దీనికి ‘హనుమాన్’ సినిమా నిదర్శనం, ఈ చిత్రం 300 కోట్లు వసూలు చేసింది. కానీ, భారీతనం, బడ్జెట్‌పై పెట్టే ఫోకస్ లో కాస్త కూడా కథపై పెట్టట్లేదని, మన హీరోలపై విమర్శలు వస్తున్నాయి. ఈ హీరోలంతా మళ్ళీ ఫామ్‌లోకి ఎప్పుడు వస్తారో వేచి చూడాలి. వారు కథలపై మరింత దృష్టి సారించి, మార్కెట్‌ను తిరిగి పట్టు సాధించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి మన హీరోలేం చేస్తారో చూడాలి మరి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad