Tollywood Movies: ఏ భాషలో అయినా సినిమాలకు హీరోలే చాలా ముఖ్యం. సినిమా మొత్తంలో హీరోదే హైలెట్ రోల్. అందాలు ఆరబోసే హీరోయిన్ ఉన్నా హీరోనే ఫ్యాన్స్ ఎక్కువగా చూస్తారు. సినిమా కొబ్బరి కాయ కొట్టినప్పటి నుంచి వాల్ పోస్టర్ పడే వరకూ హీరోదే డామినేషన్ కనిపిస్తుంది. బలమైన విలన్ ఉన్నా అతని చేతిలో చనిపోకుండా హీరోనే విలన్ ను చంపేసే కథలే మనకి ప్రధానం. హీరోల పాత్రనే సినిమా మొత్తం చూపిస్తారు.
ఇక ట్రెండ్ మారిన తర్వాత కొన్ని సినిమాల్లో ముందు హీరో క్యారెక్టర్ చనిపోయినట్టు చూపించినప్పటికీ, ఆ తర్వాత ఆయన ఎలాగోలా బ్రతికి వచ్చి స్టోరీకి శుభం కార్డు వేస్తాడు. అంతేకాదు మరికొన్ని సినిమాల్లో ప్రేక్షకులు ఊహించని విధంగా హీరోలు, హీరోయిన్లు చనిపోయినప్పుడు ఎంతో బాధపడిన సందర్భాలు ఉన్నాయి. కొన్ని సినిమాలలో హీరో చనిపోవడంతో అభిమానులు నిరాశగా బయటకి వస్తూ ఉంటారు. అలాంటి సినిమాలు కూడా కొన్ని ఉన్నాయి. హీరో చనిపోయినా కూడా బ్లాక్ బస్టర్ హిట్ సాధించాయి. ఆ సినిమాల లిస్ట్ ఓసారి చూద్దాం..
Also Read – Reliance Jio: జియో కొత్త చవకైన రీఛార్జ్ ప్లాన్.. ఎయిర్‌టెల్‌కి షాకిస్తూ 189 ప్లాన్ విడుదల..
నాచురల్ స్టార్ గా పాపులర్ అయిన టాలీవుడ్ స్టార్ నాని హీరోగా నటించిన బ్లాక్ బస్టర్ మూవీ భీమిలి కబడ్డీ జట్టు. క్రీడా నేపథ్యంలో తెరకెక్కిన సినిమాగా వచ్చి అందరినీ ఆకట్టుకుంది. కబడ్డీలో ఎలాగైనా నెగ్గాలని చేసే ప్రయత్నం చివరికి ఫలిస్తుంది. కానీ, ఈ సినిమా క్లైమాక్స్ లో హీరో చనిపోతారు. అయినా ఇది బ్లాక్ బస్టర్ హీట్.
దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి, నాని కాంబినేషన్ లో వచ్చిన బ్లాక్ బస్టర్ ఈగ. ఇందులో సమంత హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాలో విలన్ నానిని చంపేస్తాడు. ఆ తర్వాత ఈగ లోకీ ఆత్మ వస్తుంది. చివరికి విలన్ ను చంపేస్తాడు. ఇందులో నాని స్క్రీన్ మీద కొద్దిసేపు మాత్రమే. కానీ, ఈగ రూపంలో సినిమా మొత్తం ఉంటాడు.. ఈ మూవీ బ్లాక్ బాస్టర్ హిట్ సాధించింది.
దర్శకుడు తేజ 2017 లో రూపొందించిన నేనే రాజు నేనే మంత్రి బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్. ఈ సినిమాలో దగ్గుబాటి రానా, కాజల్ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమాలో కూడా హీరోయిన్ చనిపోతుంది. ఈ మూవీ కూడా మంచి వసూళ్ళని రాబట్టింది.
Also Read – Malaika Arora: రెండో పెళ్లికి సిద్ధం..?
యంగ్ డైరెక్టర్ గౌతం తిన్ననూరి దర్శకత్వంలో నాని హీరోగా జెర్సీ సినిమాలో నటించారు. ఇది క్రికెట్ ఆట నేపథ్యంలో సాగే సినిమా. అలాగే ఫ్యామిలీ ఎమోషన్స్ కూడా బాగా ఉంటాయి. క్రికెట్ ఆటలో చివరకు హీరో చనిపోతాడు. కథ బలంగా ఉంటడంతో ఈ మూవీ కూడా బ్లాక్ బాస్టర్ హిట్ సాధించి మంచి కలెక్షన్స్ ని రాబట్టింది. ఇలా, బాహుబలి సినిమా పార్ట్ 1 లో ప్రభాస్ చనిపోతాడు. మేజర్ సినిమాలో హీరో అడవి శేష్ కూడా క్లైమాక్స్ లో చనిపోతాడు. కథ, కథనాలు బలంగా ఉంటే హీరో చనిపోయినా సినిమా బ్లాక్ బస్టర్ గా నిలుస్తుంది.


