New Combinations: కొత్త కాంబినేషన్ల పట్ల ఆడియెన్స్‌లో ఎప్పుడూ ఆసక్తి ఉంటుంది. అందులోనూ డిఫరెంట్ ఇమేజ్ ఉన్న హీరో, డైరెక్టర్ కలయికలో సినిమా సెట్టయితే అంచనాలను కాసింత ఎక్కువే ఉంటాయి. అలాంటి సరికొత్త కాంబినేషన్లు టాలీవుడ్‌లో ఫిక్సైనట్లు ప్రచారం జరుగుతోంది.
రవితేజతో శివనిర్వాణ సినిమా
రవితేజ సినిమా అంటేనే మాస్, యాక్షన్ ఎలిమెంట్స్‌కు చిరునామాగా ఉంటుంది. ఫ్యామిలీ ఎమోషన్స్ తో కూడిన ప్రేమకథలతో క్లాస్ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్నాడు శివనిర్వాణ. భిన్న ఇమేజ్‌లు కలిసిన వీరిద్దరి కలయికలో ఓ మూవీ రాబోతున్నట్లు సమాచారం. శివనిర్వాణ చెప్పిన థ్రిల్లర్ కథ నచ్చడంతో ఇటీవలే రవితేజ ఈ డైరెక్టర్‌తో మూవీకి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. థ్రిల్లర్ జానర్ అయినా శివనిర్వాణ స్టైల్ ఫ్యామిలీ ఎమోషన్స్ ఇందులో ఉంటాయని చెబుతున్నారు. ఈ సినిమాలో రవితేజ తండ్రి పాత్రలో కనిపించబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాను నిర్మించబోతున్నట్లు సమాచారం.
Also Read- Pooja Hegde: పరువాలను చూపిస్తూ.. కుర్రాళ్లకు నిద్రలేకుండా చేస్తున్న బుట్టబొమ్మ..
రవితేజ మాస్ జాతర మూవీ ఆగస్ట్ 27న రిలీజ్ కాబోతుంది. ఈ సినిమా తర్వాత కిషోర్ తిరుమలతో పాటు కళ్యాణ్ శంకర్‌లతో సినిమాలు చేయబోతున్నాడు రవితేజ. ఈ రెండు సినిమాలు పూర్తయిన తర్వాతే శివ నిర్వాణ మూవీ సెట్స్‌పైకి రానున్నట్లు సమాచారం. ఖుషి తర్వాత శివనిర్వాణ చేస్తున్న మూవీ ఇది. విజయ్‌దేవరకొండ, సమంత హీరోహీరోయిన్లుగా నటించిన ఖుషి బాక్సాఫీస్ వద్ద యావరేజ్‌గా నిలిచింది.
దేవర డైరెక్టర్‌గా నాగచైతన్య సినిమా…
దేవర డైరెక్టర్ కొరటాల శివ, నాగచైతన్య కాంబినేషన్‌లో ఓ కొత్త సినిమా ఫిక్సైనట్లు టాలీవుడ్‌లో ప్రచారం జరుగుతోంది. ఎన్టీఆర్‌తో దేవర 2 చేయాల్సివుంది కొరటాల శివ. ఇటీవలే వార్ 2తో ప్రేక్షకుల ముందుకొచ్చిన ఎన్టీఆర్.. నెక్స్ట్ డ్రాగన్ మూవీ షూటింగ్‌లో పాల్గొనబోతున్నారు. ఈ సినిమా పూర్తయిన తర్వాతే దేవర 2 డేట్స్ కేటాయించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. డ్రాగన్ పూర్తవ్వడానికి టైమ్ పట్టేలా ఉండంతో ఈ గ్యాప్‌లో నాగచైతన్యతో ఓ సినిమా చేసేందుకు కొరటాల శివ రెడీ అయినట్లు చెబుతున్నారు. ఓ సమకాలీన సమస్యకు మాస్ యాక్షన్ అంశాలు మేళవించి కొరటాల శివ ఈ సినిమాను తెరకెక్కించబోతున్నట్లు చెబుతున్నారు. ఈ ఏడాది చివరన లేదంటే వచ్చే సంవత్సరం ప్రథమార్థంలో నాగచైతన్య, కొరటాల శివ మూవీ మొదలవ్వబోతున్నట్లు చెబుతున్నారు.
Also Read- GPS Tracking : వీధి శునకాలకు డిజిటల్ సంకెళ్లు.. క్యూఆర్ కోడ్‌తో కట్టడి – జీపీఎస్‌తో గస్తీ!


