Tollywood New Heroes: వారసత్వం సినీ పరిశ్రమలో కొత్తేమీ కాదు. ప్రస్తుతం టాలీవుడ్‌లో టాప్ హీరోలుగా కొనసాగుతున్న స్టార్లలో చాలా మంది వారసత్వంతోనే యాక్టర్స్‌గా మారారు.. ఫేమస్ అయ్యారు. వారసులు హీరోలుగా మారడం అన్నది ప్రతి ఏటా కనిపిస్తూనే ఉంటుంది. ఈ ఏడాది కూడా కొందరు నయా వారసులుగా హీరోలుగా తెలుగు తెరపై మెరవబోతున్నారు. ఘనమైన బ్యాక్‌గ్రౌండ్ ఉన్న కుటుంబాల నుంచి కథానాయకులుగా ఎంట్రీ ఇస్తోన్న ఆ వారసులు ఎవరంటే?
నందమూరి తారక రామరావు…
నందమూరి కుటుంబంలో నాలుగో తరం నుంచి ఓ కొత్త హీరో టాలీవుడ్‌లోకి అడుగుపెట్టబోతున్నాడు. నందమూరి జానకిరామ్ తనయుడు తారకరామారావు హీరోగా వైవీఎస్ చౌదరి దర్శకత్వంలో న్యూఏజ్ లవ్‌డ్రామా మూవీ తెరకెక్కుతోంది. ఇటీవల పూజా కార్యక్రమాలతో గ్రాండ్‌గా ఈ మూవీ లాంఛ్ అయ్యింది. ఈ వేడుకలో నందమూరి కుటుంబ సభ్యులంతా పాల్గొన్నారు. వైవీఎస్ చౌదరి సినిమా కోసం యాక్టింగ్‌తో పాటు మార్షల్ ఆర్ట్స్‌లో తారక రామారావు ట్రైనింగ్ తీసుకున్నట్లు సమాచారం. ఈ సినిమాలో కూచిపూడి డ్యాన్సర్ వీణారావు హీరోయిన్‌గా నటిస్తోంది.
మహేష్‌బాబు అన్న కొడుకు…
ఘట్టమనేని ఫ్యామిలీ నుంచి ఓ కొత్త హీరో రాబోతున్నాడు. మహేష్‌బాబు అన్నయ్య, దివంగత నటుడు రమేష్‌బాబు తనయుడు జయకృష్ణ హీరోగా లాంఛ్ కాబోతున్నాడు. జయకృష్ణ డెబ్యూ మూవీకి ఆర్ఎక్స్ 100 ఫేమ్ అజయ్ భూపతి డైరెక్టర్‌గా వ్యవహరించబోతున్నాడు. టాప్ ప్రొడక్షన్ హౌజ్ జయకృష్ణ డెబ్యూ మూవీని నిర్మించనున్నట్లు సమాచారం.
మోక్షజ్ఞ డెబ్యూ ఎప్పుడంటే?
నందమూరి బాలకృష్ణ కొడుకు మోక్షజ్ఞ తేజ డెబ్యూ ఎప్పుడన్నది టాలీవుడ్ ప్రేక్షకుల్లో ఆసక్తికరంగా మారింది. మోక్షజ్ఞ బర్త్‌డే సందర్భంగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో అతడి ఫస్ట్ మూవీని అనౌన్స్‌చేశారు. ఓ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. కానీ సినిమా మాత్రం సెట్స్‌పైకి రాలేదు. ప్రశాంత్ వర్మ చెప్పిన కథ నచ్చకపోవడంతో ఈ సినిమాను మోక్షజ్ఞ పక్కన పెట్టినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
అకీరా నందన్…
రవితేజ తమ్ముడి కొడుకు మాధవ్ రాజ్ భూపతి హీరోగా తెలంగాణ బ్యాక్‌డ్రాప్‌లో ఓ సినిమా రూపొందుతోంది. డీవీవీ దానయ్య తనయుడు కళ్యాణ్ కూడా హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాడు. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో చాలా రోజుల క్రితమే ఈ సినిమాను అనౌన్స్‌చేశారు. షూటింగ్ మాత్రం మొదలుకాలేదు. పారిశ్రామిక వేత్త గాలి జనార్ధన్ రెడ్డి తనయుడు కిరీటి హీరోగా నటించిన జూనియర్ మూవీ జూలై 18న రిలీజ్ కానుంది. ఈ సినిమాలో శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తోంది. పవన్ స్టార్ పవన్ కళ్యాణ్ తనయుడు అకీరా నందన్ అరంగేట్రంపై తరచుగా వార్తలు వినిపిస్తున్నాయి. పవన్ కళ్యాణ్ ఓజీలో అకీరా గెస్ట్ రోల్‌లో మెరవబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది.


