Tollywood Cinema: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఈ ఏడాది ఇప్పటి వరకూ మంచి సినిమాలొచ్చాయనే చెప్పాలి. సంక్రాంతికి వస్తున్నాం మొదలుకొని ఇటీవల వచ్చిన మిరాయ్, ఓజీ సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఊహించని లాభాలను తెచ్చాయి. సెప్టెంబర్ లో వచ్చిన పవన్ కళ్యాణ్ ఓజీ, తేజ సజ్జా మిరాయ్ బాక్సాఫీస్ వద్ద దుమ్ము దులిపాయి. వీటితో పాటు కిష్కింధపురి, లిటిల్ హార్ట్స్ లాంటి మీడియం బడ్జెట్ సినిమాలు సూపర్ హిట్ గా నిలిచాయి.
ఈ క్రమంలోనే అక్టోబర్ లో వచ్చిన కన్నడ సినిమా కాంతార ఛాప్టర్ 1 అన్నీ భాషలలోనూ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ముఖ్యంగా తెలుగు, కన్నడలో భారీ వసూళ్లను రాబట్టింది. అలాగే, డ్యూడ్ కే ర్యాంప్ సినిమాలలో డ్యూడ్ మంచి కమర్షియల్ హిట్ సాధించింది. ఇక కే ర్యాంప్ కూడా సేఫ్ జోన్ లోకి వచ్చింది. ఇక, ఇదే అక్టోబర్ లో మాస్ మహారాజ్ రవితేజ, శ్రీలీల జంటగా భాను భోగవరపు రూపొందించిన మాస్ జాతర వస్తోంది. ఈ సినిమాపై మంచి హైప్ నెలకొంది.
Also Read – Srikanth Vissa: డైరెక్టర్‌గా ఎంట్రీ ఇస్తున్న పుష్ప 2 డైలాగ్ రైటర్ – నందమూరి హీరోతో డెబ్యూ మూవీ
అయితే, ఇప్పుడు అందరి చూపు నవంబర్ నెల మీదే ఉంది. నవంబర్ 7న రష్మిక మందన్న నటించిన ది గర్ల్ ఫెండ్ సినిమా వస్తోంది. నటుడు దర్శకుడు రాహుల్ రవీంద్రన్ రూపొంచిన ఈ మూవీపై ఇంకా ఎలాంటి బజ్ క్రియేట్ అవలేదు. ఈ సినిమాకి ప్లస్ పాయింట్ ఒక్క రష్మికనే. హిట్ టాక్ వస్తే తప్ప సినిమా పరిస్థితిని ఇప్పుడే చెప్పలేము.
ఇక ఇదే తేదీకి సుధీర్ బాబు నటించిన జటాధర వస్తోంది. వీటితో పాటు ఓ హిందీ సినిమా ఓ ఇంగ్లీష్ సినిమా రిలీజ్ కాబోతున్నాయి. నవంబర్ 14న దుల్కర్ సల్మాన్, రానా దగ్గుబాటి, భాగ్యశ్రీ బోర్సే నటించిన కాంత ఉంది. అదే రోజున బిందూ చంద్రమౌళి, చాందినీ చౌదరి, తరుణ్ భాస్కర్ లీడ్ రోల్స్ లో నటించిన సంతాన ప్రాప్తిరస్తు మూవీ కూడా ఉంది.
ఇక నవంబర్ 28న రామ్ పోతినేని, భాగ్యశ్రీ బోర్సే నటించిన ఆంధ్రాకింగ్ తాలూకా రిలీజ్ కాబోతుంది. గతకొంతకాలంగా హిట్ కోసం తహతహలాడుతున్న రామ్ ఈ మూవీ సక్సెస్ మీద చాలా నమ్మకాలు పెట్టుకున్నాడు. హీరోయిన్‌గా భాగ్యశ్రీకి సాలీడ్ హిట్ ఒక్కటీ దక్కలేదు. కానీ, ఇప్పుడు నవంబర్ లో రాబోతున్న ఈ సినిమాలు గనక హిట్ సాధిస్తే టాలీవుడ్ లో సినిమాల సక్సెస్ రేట్ బాగా పెరుగుతుంది. చూడాలి మరి బాక్సాఫీస్ వద్ద ఏ సినిమా హిట్ అవుతుందో.. ఏ సినిమా చతికిల పడుతుందో.
Also Read – Dhanush: మొన్ననే థియేటర్లలో రిలీజ్- అప్పుడే ఓటీటీలోకి – ధనుష్ ఇడ్లీకొట్టు స్ట్రీమింగ్ డేట్ ఇదే


