Thursday, April 3, 2025
Homeచిత్ర ప్రభTollywood Singers: పెళ్లి చేసుకున్న టాలీవుడ్ సింగర్స్

Tollywood Singers: పెళ్లి చేసుకున్న టాలీవుడ్ సింగర్స్

టాలీవుడ్‌లో మరో సినీ సెలబ్రెటీలు పెళ్లి పీటలెక్కారు. సింగర్స్‌గా పాపులర్ అయిన అనురాగ్ కులకర్ణి(Anurag Kulkarni), రమ్య బెహరా(Ramya Behara) ఓ ఇంటి వారయ్యారు. హైదరాబాద్‌లో ఇరు కుటుంబాల పెద్దలు, ఇతర సన్నిహితుల మధ్య పెళ్లి వేడుక జరిగింది. ఈ వేడుకలకు పలువురు సింగర్స్, సంగీత దర్శకుడు కూడా హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.

- Advertisement -

కామారెడ్డికి చెందిన అనురాగ్‌ కులకర్ణి ‘సూపర్‌ సింగర్‌’ కార్యక్రమంలో విజేతగా నిలిచారు. అనంతరం సినిమాల్లో పాటలు పాడటం మొదలుపెట్టారు. ‘శతమానం భవతి’ సినిమాలోని ‘మెల్లగా తెల్లారిందోయ్ ఇలా’ పాట ఆయనకు గుర్తింపు తెచ్చి పెట్టింది. అనంతరం కాటమరాయుడు’లో ‘మీరా మీరా మీసం’, ‘పైసా వసూల్‌’ టైటిల్‌ సాంగ్‌’, ‘ఇస్మార్ట్‌ శంకర్‌’లో ‘ఉండిపో ఉండిపో’ వంటి ఎన్నో పాటలు ఆలపించారు. ‘ఆర్‌ఎక్స్‌ 100’లో ‘పిల్లా రా’, ‘కేరాఫ్‌ కంచరపాలెం’లో ‘ఆశాపాశం’ పాటలు స్టార్ సింగర్‌గా నిలబెట్టాయి. ఇక ఏపీలోని నరసరావుపేటకు చెందిన రమ్య బెహరా కూడా పలు సంగీత కార్యక్రమాలతో పేరు తెచ్చుకున్నారు. ‘బాహుబలి ది బిగినింగ్‌’లోని ‘ధీవరా’ పాట ఆమెకు గుర్తింపు తెచ్చిపెట్టింది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News