Allu Arjun Mumbai Office: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ముంబైలో కొత్తగా ఆఫీస్ తీశారా..? తాజాగా అవుననే న్యూస్ ఒకటి నెట్టింట బాగా వైరల్ అవుతోంది. గంగోత్రి సినిమాతో హీరోగా పరిచయమైన అల్లు అర్జున్ మొదటి సినిమాతో మంచి హిట్ అందుకున్నాడు. కానీ.. ఆ క్రెడిట్ దర్శకేంద్రుడు కె రాఘవేంద్ర రావు ఖాతాలోకి వెళ్ళింది. రెండవ సినిమాగా వచ్చింది ఆర్య. ఈ సినిమా దిల్ రాజుకి నిర్మాతగా రెండవ సినిమా. హీరోగా అల్లు అర్జున్ కి రెండవ సినిమా. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా వసూళ్ల పరంగా సృష్ఠించిన సునామీ అంతా ఇంతా కాదు.
ఆ తర్వాత చేసిన సినిమాలతో స్టైలిష్ స్టార్‌గా మారాడు అల్లు అర్జున్. ఇక సుకుమార్ దర్శకత్వంలో చేసిన పుష్ప ఫ్రాంఛైజ్ ఈ స్టైలిష్ స్టార్ ని ఐకాన్ స్టార్ గా మార్చింది. ఈ సిరీస్‌తో అల్లు అర్జున్ రేంజ్ ఏకంగా పాన్ ఇండియాకి చేరింది. పుష్ప 2 ఏకంగా 1850 కోట్ల కి పైగా వసూళ్ళు రాబట్టి దేశ వ్యాప్తంగా సెన్షేషన్ అయింది. ప్రభాస్, ఎన్‌టిఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్‌లది ఇప్పుడు పాన్ ఇండియా క్రేజ్. వీరిలో అల్లు అర్జున్ కాస్త ఎక్కువ క్రేజ్ నే సంపాధించుకున్నాడు.
Also Read – Crime in himachal pradesh: హోటల్‌లో మహిళపై అత్యాచారం.. యజమాని అరెస్ట్..!
అట్లీతో సైన్ ఫిక్షన్..
కోలీవుడ్ యువ దర్శకుడు అట్లీతో అల్లు అర్జున్ తన 22వ సినిమాను చేస్తున్న సంగతి తెలిసిందే. హాలీవుడ్ టెక్నీషియన్స్ పనిచేస్తున్నారు. అంతేకాదు, బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపిక పదుకొనె మరో ప్రధాన పాత్రలో నటిస్తోంది. ఇప్పటికే, వీరిద్దరిని పరిచయం చేస్తూ రిలీజ్ చేసిన వీడియోలు మెస్మరైజ్ చేశాయి. దాదాపు 800 కోట్ల భారీ బడ్జెట్‌తో అగ్ర నిర్మాణ సంస్థ సన్ నెట్‌వర్క్ నిర్మిస్తోంది. పుష్ప సిరీస్ తర్వాత అల్లు అర్జున్‌కి ఎలాంటి ప్రాజెక్ట్ పడాలో సరిగ్గా అలాంటి ప్రాజెక్టే పడింది.
గణేష్ ఆచార్య రోల్ ఏంటీ..?
ప్రముఖ కొరియోగ్రాఫర్ గణేష్ మాస్టర్ అంటే తెలియని వారుండరు. అల్లు అర్జున్ నటించిన దువ్వాడ జగన్నాధం (డీజే) నుంచి పుష్ప సినిమాల వరకు అల్లు అర్జున్ సినిమాలలో డాన్స్ కొరియోగ్రఫీ అందించారు. ఊ అంటావా మావా లాంటి బ్లాక్ బస్టర్ సాంగ్స్ ఇచ్చారు. ఇప్పుడు అల్లు అర్జున్ ముంబైలో కొత్తగా తీసిన ఆఫీస్ కి గణేష్ ఆచార్య అన్నీ తానై చూసుకుంటారని తెలుస్తోంది. హిందీలో 5 భారీ చిత్రాలను బన్నీ ఒకే చేసినట్టు సమాచారం. ఈ 5 ప్రాజెక్ట్స్ కి సంబందించిన కీలకమైన పనులన్నీ ఆయనేఅ దగ్గరుండి చూసుకుంటారని తెలుస్తోంది. త్వరలో దీనికి సంబదించిన అఫీషియల్ న్యూస్ కూడా రానుందట. ఇదే నిజమైతే బన్నీ రేం ఊహకందనంతగా పెరుగుతుంది.
Also Read – Electric Scooter: రూ.లక్ష లోపు బెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్ కొనాలా?


