Dhoom 4: బాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి తాజాగా వచ్చిన యాక్షన్ మూవీ వార్ 2. టాలీవుడ్ స్టార్ హీరో, మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ కూడా ఈ మూవీ ద్వారా బాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చారు. అందుకే, ఈ సినిమాపై అంచనాలు బాగా ఎక్కువయ్యాయి. సినిమా రిలీజ్‌కు ముందు అందరిలో ఉన్న అంచనాలు థియేటర్లలోకి వచ్చిన తర్వాత మాత్రం తారుమారయ్యాయి. వార్ 2 అభిమానులనే పెద్దగా ఆకట్టుకోలేదని సోషల్ మీడియాలో చర్చ జరిగింది. తెలుగులో కూడా తారక్‌కి ఈ మూవీ కరెక్ట్ సెలెక్షన్ కాదని మాట్లాడుకున్నారు.
అయితే, తాజాగా బాలీవుడ్‌లో బ్లాక్ బస్టర్ సిరీస్ ధూమ్ 4 గురించి హాట్ టాపిక్ అవుతోంది. ఈ సినిమా గురించి గత కొన్ని రోజుల నుంచి రక రకాల వార్తలు వినిపిస్తున్నాయి. ధూమ్ సినిమాకి సీక్వెల్ గా వస్తున్న ప్రతి చిత్రం బాక్సాఫీస్ దగ్గర భారీ కమర్షియల్ సక్సెస్‌ని సొంతం చేసుకున్నాయి. ఈ క్రమంలోనే గత కొంతకాలంగా ధూమ్ 4 ఎప్పుడొస్తుందా..? అని అందరూ ఎంతో ఆతృతగా ఎదురుచూస్తూ ఉన్నారు. దీనికి కారణం ఈ సిరీస్‌పై ఉన్న అంచనాలే.
అయితే, తాజా సమాచారం మేరకు ఈ సినిమా గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇప్పటి వరకూ వచ్చిన ధూమ్ సీక్వెల్ సినిమాలన్నిట్లోనూ బాలీవుడ్ హీరోలే నటించారు. కానీ, ఇప్పుడు రాబోతున్న సీక్వెల్ మూవీలో టాలీవుడ్ స్టార్ హీరో కూడా నటించబోతున్నారట. ఇంతకీ ఆ స్టార్ హీరో ఎవరు..? అని మాట్లాడుకుంటున్నారు. బాలీవుడ్ మీడియా వర్గాల ద్వారా అందుతున్న అప్‌డేట్‌ని బట్టి ఆ హీరో ఎవరో కాదు, మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్. ఇటీవల ఎన్టీఆర్ బాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చి వార్ 2 లో నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా ఫలితం ఎలా ఉన్నా, తారక్ కి మాత్రం మంచి పేరే వచ్చింది.
ఈ నేపథ్యంలోనే ఇప్పుడు మరో సినిమాలో నటించే ఛాన్స్ ఉందని ప్రస్తుతం టాక్ వినిపిస్తోంది. ధూమ్ 4 లో విలన్‌గా తారక్ అయితే పర్ఫెక్ట్ అని మేకర్స్ అభిప్రాయపడుతున్నారు. వార్ 2 మూవీ డైరెక్టర్ అయాన్ ముఖర్జీనే ఈ ధూమ్ 4 ని తెరకెక్కిస్తారని బీటౌన్‌లో టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే, ఈ సిరీస్ లో జాన్ అబ్రహాం, హృతిక్ రోషన్, ఆమిర్ ఖాన్ ఒక్కో సినిమాలో విలన్‌గా నటించి మెప్పించారు. కానీ, ఈసారి ధూమ్ 4 లో మాత్రం ఆ పవర్ ఫుల్ విలన్ టాలీవుడ్ స్టార్ తారక్ అంటున్నారు. చూడాలి మరి దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్ ఎప్పుడు వస్తుందో.
Also Read- Rains : తెలంగాణాకు వరుణుడి శాపం.. ఆ జిల్లాల్లో మళ్లీ భారీ వర్షాలు


