Saturday, November 15, 2025
Homeచిత్ర ప్రభTollywood Heroes: స్టార్ హీరోల డబుల్ ధమాకా!

Tollywood Heroes: స్టార్ హీరోల డబుల్ ధమాకా!

Tollywood Heroes: ఒకప్పుడు స్టార్ హీరోలు ఏడాదికి ఐదు, పది సినిమాలు చేసేవాళ్లు. సినిమా ఇండస్ట్రీ బతకాలంటే అగ్ర కథానాయకులు ఎక్కువ సినిమాలు చేయాలనేది ఎప్పటి నుంచో వినిపిస్తోన్న మాట. కానీ ఇప్పుడు స్టార్స్ ఏడాదికి ఓ సినిమా చేస్తే ఎక్కువనేలా ఉంది. అయితే వచ్చే ఏడాది మాత్రం కొందరు టాలీవుడ్ స్టార్ హీరోలు రెండేసి సినిమాలతో సందడి చేయబోతున్నారు. ఇంతకీ ఎవరా హీరోలు.. ఏంటా సినిమాలు అనే వివరాలను చూస్తే..

- Advertisement -

తెలుగు సినిమా చరిత్రలో పాన్ ఇండియా ట్రెండ్ వచ్చాక స్టార్ హీరోలు సంవత్సరానికి ఒక్క సినిమా చేయడానికే చాలా సమయం తీసుకుంటున్నారు. కొంతమంది అయితే రెండు, మూడేళ్లకు మాత్రమే ఒక్క సినిమా చేస్తున్నారు. కానీ ఇప్పుడు పరిస్థితి మారుతోంది. కొందరు స్టార్ హీరోలు ఒక్క ఏడాదిలోనే రెండు లేదా మూడు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. ఇది ఫ్యాన్స్‌కి అసలైన డబుల్ ఫెస్టివల్‌ లాంటిది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభాస్ ప్లానింగ్ అందరినీ ఆకట్టుకుంటోంది. 2025లో ప్రభాస్ నుండి పెద్ద సినిమాలు ఏవీ రాకపోయినా, ‘కన్నప్ప’ సినిమాలో అతిథి పాత్రలో కనిపించి అభిమానులను ఆకట్టుకున్నారు. అయితే 2026లో మాత్రం ప్రభాస్ డబుల్ ట్రీట్ ఇవ్వబోతున్నారు. సంక్రాంతికి ‘రాజాసాబ్’ అనే సినిమా రిలీజ్ అవుతుంది. ఆ తర్వాత హను రాఘవపూడి దర్శకత్వంలో చేస్తున్న ‘ఫౌజీ’ సినిమా షూటింగ్ వేగంగా జరుగుతోంది. ఈ సినిమాను 2026 దసరాకు రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు.

సీనియర్ స్టార్ హీరో, నటసింహం బాలకృష్ణ కూడా 2025లో రెండు సినిమాలతో ప్రేక్షకులను పలకరించబోతున్నారు. సంక్రాంతికి ‘డాకు మహారాజు’గా మన ముందుకు వచ్చిన బాలయ్య, ఇదే ఏడాది డిసెంబర్‌లో ‘అఖండ 2’తో మరోసారి థియేటర్స్ లో కనిపించనున్నారు. మరోవైపు పవన్ కళ్యాణ్ కూడా ఈ ఏడాది చాలా యాక్టివ్‌గా ఉన్నారు. 2012 తర్వాత ఇదే తొలిసారి ఆయన ఒకే ఏడాదిలో రెండు సినిమాలతో రాబోతున్నారు. ఇప్పటికే జూలైలో ‘హరిహర వీరమల్లు’ సినిమాతో ప్రేక్షకులను ఆకట్టుకున్న పవన్, ఇప్పుడు సెప్టెంబర్ 25న ‘ఓజి’ సినిమాతో వచ్చేస్తున్నారు.

Also Read – Adivi Sesh: సినిమా అంటే 9 టూ 5 జాబ్ కాదు.. దీపికా ప‌దుకోణ్‌కు అడివి శేష్ కౌంట‌ర్‌

మెగాస్టార్ చిరంజీవి కూడా 2026లో తన సినిమాలతో అభిమానులను అలరించేందుకు రెడీ అవుతున్నారు. 2026 సంక్రాంతికి అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘శంకర వారి ప్రసాద్’ అనే సినిమాతో రాబోతున్నారు. ఇక వేసవిలో మరో భారీ సినిమా ‘విశ్వంభర’ తో మరోసారి ప్రేక్షకుల ముందుకు రానున్నారు. అసలే ఈ సినిమా 2025లోనే రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు. కానీ గ్రాఫిక్స్ వర్క్‌ను ఇంకా మెరుగ్గా చేయాలనే ఉద్దేశంతో మేకర్స్ కొంత సమయం తీసుకున్నారు. అందుకే ఈ సినిమా 2026లోకి వాయిదా పడింది.

మెగాస్టార్ చిరంజీవి, నటసింహం బాలకృష్ణ, పవన్ కళ్యాణ్, రెబల్ స్టార్ ప్రభాస్, విక్టరీ వెంకటేశ్… ఇలా టాలీవుడ్‌లో అగ్రతారలందరూ 2025, 2026ల్లో వరుస సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. వెంకటేశ్ విషయానికి వస్తే, చిరంజీవి సినిమా ‘మన శంకర వారి ప్రసాద్ గారు’లో గెస్ట్ రోల్ చేస్తున్నట్టుగా సమాచారం. అంతేకాకుండా, 2026 రెండో భాగంలో త్రివిక్రమ్ దర్శకత్వంలో ఒక ఫుల్ లెంగ్త్ సినిమా చేయబోతున్నారు. ఇది వెంకీ అభిమానులకి మంచి న్యూస్ అని చెప్పాలి. మొత్తంగా చూస్తే, టాలీవుడ్‌ సీనియర్ స్టార్‌లు మళ్లీ ఫుల్ ఫారంలోకి వచ్చారు. ఒకప్పుడు ఏడాదికి ఒక సినిమా కూడా కష్టంగా అనిపించిన స్థితి నుంచి, ఇప్పుడు ఏడాదిలోనే రెండు సినిమాలతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నారు.

Also Read – Telugu Movie Titles: తెలుగు సినిమా టైటిల్స్ నెటివిటీ పోతుందా?

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad