Tollywood: ప్రస్తుతం టాలీవుడ్‌లో రీ రిలీజ్ సినిమాల ట్రెండ్ నడుస్తోంది. స్టార్ హీరోల కల్ట్ క్లాసిక్ సినిమాలు మరోసారి థియేటర్లలోకి వచ్చి అభిమానులను అలరిస్తున్నాయి. స్ట్రెయిట్ సినిమాలతో పాటు ప్రస్తుతం వారానికి ఒకటి లేదా రెండు రీ రిలీజ్ మూవీస్ ప్రేక్షకుల ముందుకు రావడం కామన్‌గా మారింది. కొన్ని రీ రిలీజ్ మూవీస్ స్ట్రెయిట్ సినిమాలకు ధీటుగా వసూళ్లను రాబట్టి ట్రేడ్ వర్గాలను విస్మయపరుస్తున్నాయి.
అడ్వాన్స్ బుకింగ్స్ కోటి…
మహేష్‌బాబు పుట్టినరోజు సందర్భంగా ఇటీవల అతడు మూవీని థియేటర్లలో రీ రిలీజ్ చేశారు. అడ్వాన్స్ బుకింగ్స్ కోటికిపైగా దాటి టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా ఈ మూవీ నిలిచింది. ఓవరాల్‌గా ఫస్ట్ డే అతడు మూవీ 4.55 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టింది. తెలుగు రీ రిలీజ్ మూవీస్‌లో హయ్యెస్ట్ కలెక్షన్స్ దక్కించుకున్న టాప్ ఫైవ్ మూవీస్‌లో ఒకటిగా నిలిచింది.
నాలుగు సినిమాలు…
కాగా ఫస్ట్ డే హయ్యెస్ట్ కలెక్షన్స్ రాబట్టిన టాప్ ఫైవ్ టాలీవుడ్ రీ రిలీజ్ మూవీస్‌లో మహేష్‌బాబు సినిమాలే నాలుగు ఉండటం గమనార్హం. ఈ లిస్ట్‌లో పవన్ కళ్యాణ్ గబ్బర్‌సింగ్ 7.53 కోట్లతో ఫస్ట్ ప్లేస్‌లో ఉంది. ఇప్పటికీ పవన్ కళ్యాణ్ రికార్డును టాలీవుడ్ హీరోలెవరూ బ్రేక్ చేయలేదు.
Also Read – Oppo K13 Turbo Pro vs Poco F7: ఒప్పో K13 టర్బో ప్రో vs పోకో F7..గేమింగ్‌కు ఏ స్మార్ట్‌ఫోన్ బెస్ట్..?
ఖలేజా సెకండ్ ప్లేస్…
గబ్బర్ సింగ్ తర్వాత మహేష్‌బాబు ఖలేజా (6.85 కోట్లు) సెకండ్ ప్లేస్‌లో ఉంది. థియేటర్లలో రిలీజైనప్పుడు ఫెయిల్యూర్‌గా నిలిచిన ఈ మూవీ రీ రిలీజ్‌లో మాత్రం అదరగొట్టింది. 5.40 కోట్లతో మూడో ప్లేస్‌లో మురారి మూవీ నిలిచింది. ఫ్యామిలీ లవ్ డ్రామాగా తెరకెక్కిన ఈ మూవీకి కృష్ణవంశీ దర్శకత్వం వహించాడు.
బిజినెస్‌మెన్…
మహేష్‌బాబు, పూరి జగన్నాథ్ కాంబినేషన్‌లో రూపొందిన బిజినెస్‌మెన్ మూవీ రీ రిలీజ్‌లో మొదటిరోజు 5.25 కోట్ల కలెక్షన్స్‌ను సొంతం చేసుకున్నది. ఐదో ప్లేస్‌లో 4.55 కోట్ల కలెక్షన్స్‌తో అతడు నిలిచింది. ఈ సినిమాల్లో ఖలేజా, అతడు సినిమాలకు త్రివిక్రమ్ దర్శకుడు కావడం గమనార్హం.
రీ రిలీజ్ మూవీస్ కలెక్షన్స్‌లో అల్లు అర్జున్, ఎన్టీఆర్, ప్రభాస్ సినిమాలు మహేష్‌బాబు మూవీస్‌కు ఏ మాత్రం పోటీ ఇవ్వలేకపోయాయి.
నవంబర్‌లో ఫస్ట్ లుక్…
ప్రస్తుతం రాజమౌళితో ఓ గ్లోబల్ అడ్వెంచర్ థ్రిల్లర్ మూవీ చేస్తున్నాడు మహేష్‌బాబు. ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ టైటిల్‌ను నవంబర్‌లో రిలీజ్ చేయబోతున్నట్లు ఇటీవల రాజమౌళి ప్రకటించాడు.
Also Read – Israel-Gaza War: జర్నలిస్ట్ ముసుగులో ఉగ్రవాది..!


