Tollywood Updates: దివంగత నటుడు ఉదయ్ కిరణ్ సూపర్ హిట్ చిత్రాల్లో మనసంతా నువ్వే ఒకటి. VN ఆదిత్య దర్శకత్వం వహించిన ఈ సినిమాలో రీమా సేన్ హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ 2001లో రిలీజై బ్లాక్ బాస్టర్ అయింది. ఈ సినిమాకు ఆర్.పీ పట్నాయక్ సంగీతం ప్రాణం పోసింది. ముఖ్యంగా తూనీగా తూనీగ సాంగ్ అయితే జనాల్లో చాలా పాపులర్ అయింది. ఈ పాటలో నటించి చిన్నారి గుర్తుందా? ఆ చిన్నారి ఇప్పుడు ఎలా ఉందో తెలుసా?
ఆ పాప పేరు సుహాని కలిత. బాల నటిగా సినీరంగంలోకి అడుగుపెట్టిన ఈ చిన్నది తెలుగు , హిందీ , తమిళం మరియు బెంగాలీ సినిమాల్లో నటించింది. అంతేకాదు కథానాయికగానూ పలు సినిమాలు చేసింది. చైల్డ్ ఆర్టిస్ట్ గానే తెలుగు ఆడియెన్స్ మనసుల్లోనే చెరగని ముద్రవేసింది. ఎదురులేని మనిషి, మనసంతా నువ్వే, ఎలా చెప్పను వంటి సినిమాల్లో చిన్ననాటి పాత్రల్లో నటించింది. హీరోయిన్ గా ఈమె మెుదటి చిత్రం సవాల్. ఆ తర్వాత శ్రీశైలం, స్నేహగీతం వంటి మూవీస్ లో హీరోయిన్ గా చేసింది.
Also Read: Bellamkonda srinivas: ఘోస్ట్ వాకింగ్ టూర్ కాన్సెప్ట్..
సుహాని 1991 డిసెంబరు 25న హైదరాబాదులో జన్మించింది. పాఠశాల విద్య నుండి ఉన్నత విద్య వరకు హైదరాబాదులోనే చదివింది. ప్రస్తుతం ఈమె ముంబైలో ఉంటుంది. ఈమె బాలనటి గా 40 సినిమాలు, హీరోయిన్ గా 11 చిత్రాలు చేసింది. ప్రస్తుతం ఈ బ్యూటీ సినిమాలకు గుడ్ బై చెప్పేసింది. వివాహం తర్వాత పూర్తిగా మూవీస్ కు గుడ్ బై చెప్పిన ఈ భామ ఇప్పుడు ప్రొఫెషనల్ ట్రావెల్ ఇన్‌ఫ్లుయెన్సర్ గా మారి రాణిస్తుంది. ఇప్పుడు ఈ భామ చాలా అందంగా మారిపోయింది. సోషల్ మీడియాలో చురుగ్గా ఉండే సుహాని ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ ఫోటోలను అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. ఈ పిక్స్ పై మీరు కూడా ఓ లుక్కేయండి.
Also Read: Samantha Raj Nidimoru – సమంత – రాజ్ దుబాయ్ ట్రిప్.. వీడియో!


