Saturday, November 15, 2025
Homeచిత్ర ప్రభWeb Series:ఈ ఏడాది ఓటీటీల్లో దూసుకుపోతున్న టాప్ వెబ్ సిరీస్‌లు ఇవే

Web Series:ఈ ఏడాది ఓటీటీల్లో దూసుకుపోతున్న టాప్ వెబ్ సిరీస్‌లు ఇవే

OTT Web Series: ఈ ఏడాది తొలి ఆరు నెలలలో ఓటీటీల్లో ప్రేక్షకులు ఎక్కువగా చూసిన వెబ్ సిరీస్‌ల వివరాలు వెలుగులోకి వచ్చాయి. జనవరి నుంచి జూన్ వరకు విడుదలైన ఈ రిపోర్ట్ కార్డ్‌లో పలు ఆసక్తికరమైన ఫలితాలు బయటపడ్డాయి. కేవలం రెండు నెలల క్రితమే రిలీజ్ అయిన ఓ వెబ్ సిరీస్ అందరినీ ఆశ్చర్యపరుస్తూ మొదటి స్థానాన్ని కైవసం చేసుకోవడం ప్రత్యేకతగా మారింది.

- Advertisement -

వెబ్ సిరీస్‌లు..

ప్రస్తుతం ఓటీటీ వేదికలు ప్రేక్షకుల ప్రధాన వినోద వనరుగా మారాయి. సినిమాలు మాత్రమే కాకుండా వెబ్ సిరీస్‌లు కూడా విపరీతమైన ఆదరణ పొందుతున్నాయి. ఈ నేపథ్యంలో వివిధ ప్లాట్‌ఫారమ్‌లలో ప్రసారమైన సిరీస్‌లలో ఏవే ఎక్కువగా వీక్షించబడ్డాయో ఇప్పుడు చూద్దాం.

జువెల్ థీఫ్..

పదో స్థానంలో నిలిచింది నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైన జువెల్ థీఫ్. సైఫ్ అలీఖాన్, జైదీప్ అహ్లావత్ నటించిన ఈ క్రైమ్ డ్రామాను 13.1 మిలియన్ల మంది చూసారు. ఈ సిరీస్‌లో యాక్షన్, సస్పెన్స్ కలగలిపి ఉండటంతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.

చిడియా ఉడ్..

తొమ్మిదో స్థానం దక్కింది చిడియా ఉడ్ సిరీస్‌కి. జాకీ ష్రాఫ్ ప్రధాన పాత్రలో నటించిన ఈ కథ ముంబైలో వ్యభిచార వ్యతిరేక పోరాటం నేపథ్యంలో సాగుతుంది. అమెజాన్ ఎంఎక్స్ ప్లేయర్లో స్ట్రీమింగ్ అయిన ఈ సిరీస్‌ను 13.7 మిలియన్ల మంది వీక్షించారు.

ది సీక్రెట్ ఆఫ్ ది షీలేదార్స్‌…

ఎనిమిదో స్థానం ది సీక్రెట్ ఆఫ్ ది షీలేదార్స్‌కి లభించింది. ఆదిత్య సర్పోట్దర్ దర్శకత్వంలో వచ్చిన ఈ థ్రిల్లర్‌లో రాజీవ్ ఖండేల్వాల్ ప్రధాన పాత్ర పోషించాడు. జియో హాట్‌స్టార్‌లో ప్రసారమైన ఈ సిరీస్‌ను 14.5 మిలియన్ల మంది చూశారు.

ది రాయల్స్..

ఏడవ స్థానంలో నిలిచింది ది రాయల్స్. ఇషాన్ ఖట్టర్, భూమి పెడ్నేకర్ జంటగా నటించిన ఈ రొమాంటిక్ డ్రామా నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారమై 15.5 మిలియన్ల మంది ప్రేక్షకులను ఆకర్షించింది.

ది లెజెండ్ ఆఫ్ హనుమాన్..

ఆరవ స్థానం ది లెజెండ్ ఆఫ్ హనుమాన్ సీజన్ 6 సొంతం చేసుకుంది. జియో హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అయిన ఈ పౌరాణిక కథను 16.2 మిలియన్ల మంది వీక్షించారు. హనుమంతుడి గాథను మరోసారి అద్భుతంగా చిత్రీకరించారని అభిమానులు పేర్కొన్నారు.

స్క్విడ్ గేమ్..

ఐదవ స్థానంలో నిలిచింది ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన స్క్విడ్ గేమ్ సీజన్ 3. నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైన ఈ కొరియన్ థ్రిల్లర్‌ను 16.5 మిలియన్ల మంది వీక్షించారు. ఈ సీజన్ కూడా ముందరి భాగాల మాదిరిగానే ఉత్కంఠ రేపింది.

పాతాళ్ లోక్ సీజన్ 2..

నాలుగవ స్థానంలో నిలిచింది అమెజాన్ ప్రైమ్ వీడియోలో వచ్చిన పాతాళ్ లోక్ సీజన్ 2. హాథీ సింగ్ చౌదరి పాత్రలో జైదీప్ అహ్లావత్ మళ్లీ శక్తివంతమైన నటన చూపించాడు. ఈ సీజన్‌ను 16.8 మిలియన్ల మంది వీక్షించారు.

పంచాయత్ సీజన్ 4..

మూడవ స్థానంలో నిలిచింది పంచాయత్ సీజన్ 4. ఇప్పటికే ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్న ఈ సిరీస్ తాజా సీజన్ కూడా అద్భుతమైన స్పందన అందుకుంది. గ్రామీణ నేపథ్యంలో సాగిన ఈ కథను అమెజాన్ ప్రైమ్ వీడియోలో 23.8 మిలియన్ల మంది చూశారు.

ఏక్ బద్నామ్ ఆశ్రమ్ సీజన్ 3..పార్ట్ 2..

రెండో స్థానం దక్కింది ఏక్ బద్నామ్ ఆశ్రమ్ సీజన్ 3 పార్ట్ 2కి. బాబీ డియోల్ పోషించిన బాబా నిరాలా పాత్ర మరోసారి ఆకట్టుకుంది. ఎంఎక్స్ ప్లేయర్‌లో విడుదలైన ఈ సిరీస్‌ను 27.1 మిలియన్ల మంది వీక్షించారు.

క్రిమినల్ జస్టిస్: ఎ ఫ్యామిలీ మేటర్..

మొదటి స్థానంలో దూసుకెళ్లింది క్రిమినల్ జస్టిస్: ఎ ఫ్యామిలీ మేటర్. పంకజ్ త్రిపాఠి ప్రధాన పాత్రలో నటించిన ఈ నాలుగో సీజన్ అసాధారణ విజయాన్ని నమోదు చేసింది. జియో హాట్‌స్టార్‌లో ప్రసారమైన ఈ సిరీస్ మొత్తం 77 మిలియన్ వ్యూస్ సాధించి అన్ని రికార్డులను తిరగరాసింది.

Also Read: https://teluguprabha.net/cinema-news/sitara-ghattamaneni-warns-about-fake-social-media-accounts/

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad