Bandla Ganesh: కమెడియన్‌గా కెరీర్‌ను ప్రారంభించి ఆ తర్వాత నిర్మాతగా మారారు బండ్ల గణేష్. తన మనసులో ఉన్నది ఏదైనా కుండబద్దలు కొట్టినట్లుగా నిర్మొహమాటంగా వ్యక్తం చేస్తుంటాడు బండ్ల గణేష్. ఈ ముక్కుసూటితనమే అతడికి భారీగా ఫ్యాన్ ఫాలోయింగ్‌ను తెచ్చిపెట్టింది. అదే స్థాయిలో విమర్శలను తెచ్చిపెడుతోంది. సినిమా ఈవెంట్స్‌లో బండ్ల గణేష్ ఇచ్చిన స్పీచ్‌లు, సోషల్ మీడియాలో చేసే ట్వీట్స్ చాలా సార్లు వైరల్ అయ్యాయి.
స్పెషల్ అట్రాక్షన్…
కాగా బండ్ల గణేష్ ప్రతి ఏటా దీపావళికి టాలీవుడ్ సెలిబ్రిటీలకు బండ్ల దివాళీ పేరుతో పార్టీ ఇస్తుంటారు. ఈ ఏడాది కూడా పార్టీ జరిగింది. శనివారం జరిగిన బండ్ల దివాళీ 2025 పార్టీకి టాలీవుడ్ హేమాహేమీలు హాజరయ్యారు. ఈ పార్టీకి టాలీవుడ్ అగ్ర హీరోలు చిరంజీవి, వెంకటేష్ స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచారు. యంగ్ హీరోలు తేజ సజ్జా, సిద్ధు జొన్నలగడ్డ, బెల్లంకొండ శ్రీనివాస్ కూడా పార్టీకి హాజరయ్యారు. వీరితో పాటు శ్రీకాంత్, ఆయన తనయుడు రోషన్, తరుణ్, రవి శంకర్, డైరెక్టర్ హరీష్ శంకర్‌తో పాటు పలువురు టాలీవుడ్ సెలిబ్రిటీలు పార్టీలో సందడి చేశారు.
Also Read – Badla Ganesh: బండ్ల గణేష్ దీపావళి పార్టీ..హాజరైన చిరంజీవి..అల్లు ఫ్యామిలీకి ఆహ్వానం అందలేదా?
కోటిన్నర ఖర్చు…
ఈ దీపావళి పార్టీ కోసం బండ్ల గణేష్ కోటిన్నరకుపైనే ఖర్చు చేసినట్లు సమాచారం. టాలీవుడ్‌లోనే ఇప్పటివరకు జరిగిన కాస్ట్‌లీ పార్టీలో ఒకటిగా బండ్ల దివాళీ 2025 నిలిచినట్లు చెబుతోన్నారు. ఈ పార్టీలో ఒక్కో ప్లేట్ మీల్స్ కోసమే బండ్ల గణేష్ పదిహేను వేల వరకు ఖర్చుచేసినట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.
పార్టీకి అటెండ్ అయిన సెలిబ్రిటీలకు స్వయంగా బండ్ల గణేష్ సాదరంగా ఆహ్వానం పలుకుతున్న వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్నాయి. చిరంజీవి కారు నుంచి దిగగానే ఆయన కాళ్లపై పడి నమస్కారం చేశారు బండ్ల గణేష్. ఈ పార్టీకి హరీశ్ శంకర్ కూడా హాజరుకావడం ఆసక్తికరంగా మారింది. గతంలో కొన్ని ఇంటర్వ్యూలతో పాటు సోషల్ మీడియాలో హరీష్ శంకర్‌ను ఉద్దేశించి బండ్ల గణేష్ వివాదాస్పద కామెంట్స్ చేశారు. వాటిని పట్టించుకోకుండా బండ్ల పార్టీలో హరీష్ శంకర్ సందడి చేశారు.
బండ్ల గణేష్ పార్టీకి ఏపీ డిప్యూటీ సీఏం పవన్ కళ్యాణ్ హాజరయ్యే అవకాశం ఉందని వార్తలొచ్చాయి. పవన్ కళ్యాణ్‌కు బండ్ల గణేష్‌కు మధ్య చక్కటి అనుబంధం ఉంది. పవన్‌ను తన గురువుగా చాలాసార్లు పేర్కొన్నారు బండ్ల గణేష్. కానీ బండ్ల దివాళీ పార్టీకి పవన్ కళ్యాణ్ హాజరుకాలేదు. బండ్ల గణేష్ నుంచి ప్రత్యేకంగా ఆహ్వానం అందినా పొలిటికల్ పనులతో బిజీగా ఉండి పవన్ ఈ పార్టీకి రాలేకపోయినట్లు చెబుతున్నారు. మరోవైపు అల్లు అరవింద్ ఫ్యామిలీ నుంచి బండ్ల గణేష్ పార్టీకి ఎవరూ అటెండ్ కాలేకపోవడం కూడా హాట్ టాపిక్‌గా మారింది.
Also Read – Payal Rajput: బుల్లి గౌనులో పాయల్ పరువాల విందు


