Tourist Family Collections – Chhaava Collections: ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చి పెద్ద విజయాన్ని అందుకున్న సినిమాలలో ‘ఛావా’ (Chhaava) ఒకటి. అయితే, లాభాల విషయంలో ‘ఛావా’ సాధించిన రికార్డును ఒక చిన్న బడ్జెట్ చిత్రం బద్దలు కొట్టింది. పెద్ద హీరోల భారీ చిత్రాలతో పోల్చితే ఈ చిన్న సినిమా అత్యధిక లాభాలను ఆర్జించి అందరి దృష్టినీ ఆకర్షించింది. పెట్టిన బడ్జెట్ కంటే కలెక్షన్స్ పరంగా చూస్తే 1200 శాతం ఎక్కువ వసూళ్లను సాధించి ప్రొడ్యూసర్స్‌కి కాసుల వర్షం కురిపించింది. ఆ సినిమా ఏదో కాదు.. ‘టూరిస్ట్ ఫ్యామిలీ’. శశికుమార్, సిమ్రాన్, యోగిబాబు తదితరులు ముఖ్య పాత్రల్లో నటించారు. అభిషన్ జీవింత్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.
2025లో బాలీవుడ్‌లో సల్మాన్ ఖాన్ (Salman Khan) నటించిన ‘సికందర్’ (Sikandar), అక్షయ్ కుమార్ (Akshay Kumar) నటించిన ‘హౌస్‌ఫుల్ 5’ (House fULL 5) వంటి భారీ చిత్రాలు విడుదలయ్యాయి. ఈ చిత్రాలకు మించి ‘ఛావా’ అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది. తక్కువ సమయంలోనే ఎక్కువ వసూళ్లను రాబట్టిన ఈ సినిమా సుమారు రూ.90 కోట్లతో నిర్మించబడింది. ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం ఛావా మూవీ 9 రెట్లు లాభాలతో రూ.800 కోట్లకు పైగా కలెక్షన్లను సాధించింది.
Also Read – Hyper Aadi : హైపర్ ఆదితో అనసూయ గొడవ – ఇలాంటి మాటలకే జబర్దస్త్ నుంచి వెళ్లిపోయానంటూ రచ్చ
ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చి విమర్శకుల ప్రశంసలు పొందిన తమిళ చిత్రం ‘టూరిస్ట్ ఫ్యామిలీ’ (Tourist Family beats) లాభాల శాతంలో ‘ఛావా’ను అధిగమించినట్లు ట్రేడ్ వర్గాలు అంచనా వేశాయి. ఈ చిత్రం కేవలం రూ.7 కోట్లతో (Tourist Family Budget) రూపొంది ఒక చిన్న సినిమాగా విడుదలైంది. అయినప్పటికీ కలెక్షన్లలో జోరు చూపించి రూ.90 కోట్లు వసూలు చేసినట్లు సినీ వర్గాలు వెల్లడించాయి. అంటే నిర్మాతలకు ఈ చిత్రం 12 రెట్లు లాభాలను తెచ్చిపెట్టింది. మూవీ నిర్మాణం, కథ, నటీనటుల విషయంలో ఈ రెండు చిత్రాలను పోల్చలేం అయినప్పటికీ, నిర్మాణ వ్యయంతో పోలిస్తే అత్యధిక లాభాలు తెచ్చిన భారతీయ చిత్రంగా ఈ కుటుంబ కథా చిత్రం రికార్డు సృష్టించింది. ‘టూరిస్ట్ ఫ్యామిలీ’ ఏప్రిల్ 29న విడుదలైంది (Tourist Family Release date). మొత్తంగా చూస్తే ‘టూరిస్ట్ ఫ్యామిలీ’ 2025లో అత్యంత లాభదాయకమైన చిత్రంగా నిలిచింది. ‘ఛావా’ వంటి భారీ బడ్జెట్ చిత్రాలను అధిగమించి, చిన్న సినిమాకు కూడా భారీ విజయం సాధ్యమని నిరూపించింది. ఈ విజయం సినీ పరిశ్రమలో కొత్త ట్రెండ్‌కు నాంది పలుకుతుందని చెప్పవచ్చు.
Also Read – IND vs ENG: భారత్-ఇంగ్లండ్ టెస్టు సిరీస్.. వేస్ట్ బంతులతో మ్యాచ్ పెడుతున్నారా?


