Tribanadhari Barbarik Director Video: ఆదివారం సాయంత్రం విడుదలైన త్రిబాణధారి బార్బరిక్ సినిమాకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ చిత్ర దర్శకుడు మోహన్ శ్రీవత్సవ తన సినిమాకు ప్రేక్షకుల స్పందన సరిగా లేకపోవడంతో, గతంలో తాను చేసిన సవాలును నిలబెట్టుకుంటూ ఏకంగా తనను తానే చెప్పుతో కొట్టుకున్నారు. ఈ ఘటన ప్రస్తుతం సినీ వర్గాల్లో, సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.
సాధారణంగా దర్శకులు, నిర్మాతలు తమ సినిమాను ప్రమోట్ చేయడానికి ‘నచ్చకపోతే డబ్బులు వాపస్’.. ‘ఇంటికొచ్చి కొట్టండి’ వంటి స్టేట్‌మెంట్లు ఇవ్వడం చూశాం. అయితే త్రిబాణధారి బార్బరిక్ దర్శకుడు మాత్రం “సినిమా నచ్చకపోతే.. నా చెప్పుతో నేనే కొట్టుకొంటా” అని ప్రెస్‌మీట్లలో చెప్పడం అప్పట్లో చర్చనీయాంశమైంది. సత్యరాజ్, ఉదయభాను ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రం ఈ శుక్రవారం విడుదలైంది. అయితే, దురదృష్టవశాత్తు, బాక్సాఫీసు వద్ద ఈ సినిమాకు సరైన స్పందన లభించలేదు. దీంతో దర్శకుడు తన మాట నిలబెట్టుకుంటూ ఓ సెల్ఫీ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అందులో ఆయన తీవ్ర ఆవేదనను వ్యక్తం చేయటమే కాకుండా తనను తాను చెప్పుతో కొట్టుకున్నారు.
Also Read – Snake on Bridge: వంతెనపై తిష్ట వేసి పడగ విప్పి కూర్చున్న భారీ నాగు పాము.. వైరల్ గా మారిన వీడియో..
ఈ వైరల్ వీడియోలో దర్శకుడు మోహన్ శ్రీవత్సవ తన బాధను వ్యక్తం చేస్తూ ‘ఓ థియేటర్‌కి వెళ్లా. అక్కడ పది మంది కూడా లేరు. నేను దర్శకుడ్ని అని చెప్పకుండా సినిమా ఎలా ఉంది? అని అడిగా. అందరూ చాలా పాజిటీవ్ గా స్పందించారు. ఇంత మంచి సినిమా తీస్తే జనాలు ఎందుకు రావడం లేదు? అనేది అర్థం కావడం లేదు’ అని వాపోయారు. అంతేకాదు, మలయాళ చిత్రాలకు లభించే ఆదరణను ప్రస్తావిస్తూ, ‘మలయాళం నుంచి సినిమాలు తీస్తే.. అక్కడి నుంచి మంచి కంటెంట్ వస్తే, థియేటర్లకు వెళ్తున్నారు కదా. అలాంటప్పుడు ఇక్కడి సినిమాలు ఎందుకు చూడరు?’ అని ప్రశ్నించారు. చివరకు తాను ఇకపై మలయాళంలోనే సినిమాలు తీసి అక్కడ హిట్ కొట్టి నిరూపించుకుంటానని సంచలన నిర్ణయాన్ని ప్రకటించారు.
https://www.instagram.com/p/DOBLBN-EoGt/
ప్రస్తుతం ఏ సినిమాకు జనం వస్తారో, దేనికి రారో చెప్పలేని పరిస్థితి సినీ పరిశ్రమలో నెలకొంది. కొన్ని సినిమాలు బాగున్నా ప్రేక్షకులు థియేటర్లకు రావడానికి ఆసక్తి చూపించడం లేదు. ఓటీటీలో చూసుకుందామని ఫిక్స్ అయిపోతున్నారు. దీనివల్ల చాలా సినిమాలకు కలెక్షన్లు రావడం లేదు. దర్శకులకు తమ సినిమాపై ప్రేమ ఉండటం సహజమే అయినప్పటికీ ప్రేక్షకులూ ఆ సినిమాలను ప్రేమించాలంటే మంచి కంటెంట్ ఉండాలని గుర్తించుకోవాలని సినీ విశ్లేషకులు సూచిస్తున్నారు. ఈ సంఘటన సినీ పరిశ్రమలో మారుతున్న ప్రేక్షకుల అభిరుచులకు అద్దం పడుతోంది.
Also Read – Third degree on a dalit man: దళితుడిపై థర్డ్ డిగ్రీ


