Chiranjeevi Birthday: మెగాస్టార్ చిరంజీవి బర్త్‌డే రోజున అభిమానుల సంబరాలు మూడింతలు కాబోతున్నాయి. బ్యాక్ టూ బ్యాక్ మూడు సినిమాల అప్‌డేట్స్‌తో ఫ్యాన్స్‌ను సర్‌ప్రైజ్ చేయబోతున్నారు మేకర్స్. విశ్వంభర రిలీజ్ డేట్‌తో పాటు మెగా `157 టైటిల్, ఫస్ట్‌లుక్ విడుదలకానుంది. అలాగే చిరంజీవి, బాబీ మూవీని అఫీషియల్‌గా అనౌన్స్‌చేయబోతున్నట్లు సమాచారం.
విశ్వంభర రిలీజ్ డేట్…
విశ్వంభర ఈ ఏడాది సంక్రాంతికే రిలీజ్ కావాల్సింది. కానీ గేమ్ ఛేంజర్ కోసం పండుగ రేసు నుంచి చిరంజీవి తప్పుకున్నారు. అప్పటి నుంచి ఓ మంచి రిలీజ్ డేట్ కోసం విశ్వంభర దర్శకనిర్మాతలు ఎదురుచూస్తూనే ఉన్నారు. పోస్ట్‌పోన్ కారణంగా దొరికిన గ్యాప్‌ను మేకర్స్ బాగానే సద్వినియోగం చేసుకున్నారు. సినిమా కథతో పాటు వీఎఫ్ఎక్స్ సంబంధించి చాలా మార్పులు చేర్పులు చేసినట్లు సమాచారం. ఓ స్పెషల్ సాంగ్‌ను యాడ్ చేశారు. ఇటీవలే విశ్వంభర షూటింగ్ ముగిసింది. ఆగస్ట్ 22న విశ్వంభర కొత్త టీజర్‌తో పాటు రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేయబోతున్నట్లు సమాచారం. అక్టోబర్‌లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు సమాచారం. ఫాంటసీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ మూవీకి వశిష్ట మల్లిడి దర్శకత్వం వహిస్తున్నాడు. త్రిష హీరోయిన్‌గా నటిస్తోంది.
మెగా 157 ఫస్ట్ లుక్…
తెలుగు ప్రేక్షకుల్లో భారీ హైప్ ఉన్న సినిమాల్లో మెగా 157 ఒకటి. చిరంజీవి హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో మరో టాలీవుడ్ స్టార్ వెంకటేష్ ఓ కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. నయనతార హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమా టైటిల్‌తో పాటు ఫస్ట్ లుక్‌ను చిరంజీవి బర్త్‌డే రోజు రివీల్ చేయబోతున్నారు. ఈ సినిమాకు మన శంకర్‌ప్రసాద్‌గారు అనే టైటిల్‌ను ఖరారు చేసినట్లు సమాచారం. మెగా 157 మూవీలో క్లాస్, మాస్ కలబోతగా సాగే క్యారెక్టర్‌లో చిరంజీవి కనిపించబోతున్నట్లు సమాచారం. చిరంజీవి కూతురు సుస్మిత కొణిదెలతో కలిసి సాహు గారపాటి ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
వాల్తేర్ వీరయ్య తర్వాత…
వాల్తేర్ వీరయ్య బ్లాక్‌బస్టర్ తర్వాత చిరంజీవి, డైరెక్టర్ బాబీ కాంబినేషన్‌లో మరో మూవీ రాబోతుంది. ఈ సినిమాను మెగాస్టార్ పుట్టినరోజు సందర్భంగా అఫీషియల్‌గా అనౌన్స్‌చేయబోతున్నట్లు తెలిసింది. ఈ భారీ బడ్జెట్ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ ప్రొడ్యూస్ చేయబోతున్నట్లు సమాచారం. చిరు ఇమేజ్‌కు తగ్గట్లుగా మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ మూవీ రూపొందుతోన్నట్లు తెలిసింది. ఈ మూడు అప్‌డేట్స్‌తో పాటు అదే రోజు చిరంజీవి బ్లాక్‌బస్టర్ మూవీ స్టాలిన్ థియేటర్లలో రీ రిలీజ్ కాబోతుంది.
Also Read – TG rains today: నేడు తెలంగాణలో భారీ వర్షాలు..!


