Trisha: ఒకప్పుడు సినిమా ఇండస్ట్రీలో పెళ్లి చేసుకుంటే హీరోయిన్ల కెరీర్ ముగిసిపోయినట్లేననే అపోహ ఉండేది. పెళ్లైనా హీరోయిన్లకు అవకాశాలు దక్కేవి కాదు. ఒకవేళ ఆఫర్లు వచ్చినా హీరోయిన్‌గా కాకుండా క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గానో, సైడ్ రోల్స్ ఇచ్చేవారు. కానీ ఇప్పుడు ఆ ఆపోహలు పూర్తిగా తొలగిపోయాయి. పెళ్లికి సినిమా కెరీర్‌కు సంబంధమే లేదని నిరూపిస్తున్నారు నేటితరం హీరోయిన్లు. కీర్తి సురేష్, దీపికా పదుకోణ్, అలియాభట్‌తో పాటు పలువురు అగ్ర నాయికలు పెళ్లి తర్వాత కూడి టాప్ హీరోయిన్లుగా కొనసాగుతోన్నారు. వారి స్ఫూర్తితో పలువురు యంగ్ హీరోయిన్లు పెళ్లి బాటపడుతున్నారు.
పెళ్లి ఊసు ఎత్తడం లేదు…
కానీ కొందరు సీనియర్ హీరోయిన్లు మాత్రం పెళ్లి ఊసే ఎత్తడం లేదు. ఈ లిస్ట్‌లో త్రిష కూడా ఉంది. చాలా కాలంగా త్రిష పెళ్లి గురించి రకరకాలుగా పుకార్లు వినిపిస్తున్నాయి. ఎన్నారై బిజినెస్‌మ్యాన్‌ను త్రిష పెళ్లిచేసుకోనున్నట్లు ఇటీవల గట్టిగా ప్రచారం జరిగింది. ఈ పుకార్లను త్రిష ఖండించింది. రీసెంట్‌గా పెళ్లి గురించి తన మనసులో మాట బయటపెట్టింది. గత కొన్నాళ్లుగా ఎక్కడికి వెళ్లిన పెళ్లెందుకు చేసుకోలేదని అడుగుతున్నారని, ఆ ప్రశ్నకు తన వద్ద సమాధానం లేదని త్రిష చెప్పింది. వివాహ వ్యవస్థపై తనకు అంతగా న మ్మకలేదని, పెళ్లి అయితే ఆనందమే… కాకపోయినా బాధపడను అని త్రిష చెప్పింది.
తోడుగా నిలబడే వ్యక్తి…
“నా మనసుకు నచ్చడమే కాకుండా జీవితాంతం నాకు తోడుగా నిలబడే వ్యక్తి కోసం చాలా రోజులుగా ఎదురుచూస్తున్నా. అలాంటి క్వాలిటీస్ ఉన్న వ్యక్తి నాకు ఇప్పటివరకు ఎదురవ్వలేదు. ఒకవేళ ఎదురైతే మాత్రం తప్పకుండా అతడినే పెళ్లిచేసుకుంటాను” అని త్రిష చెప్పింది.
విడాకులు తీసుకుంటున్నారు…
“నాకు తెలిసి పెళ్లి చేసుకున్న ఎంతో మంది అసంతృప్తికర జీవితాన్నే గడుపుతున్నారు. పెళ్లి చేసుకున్న కొద్ది రోజులకే విడాకులు తీసుకుంటున్నారు. అలాంటి పరిస్థితి నాకు ఎదురవ్వకూడదని కోరుకుంటున్నా. విడాకులు తీసుకునే పెళ్లి నాకు అక్కరలేదు” అంటూ త్రిష కామెంట్స్ చేసింది. పెళ్లి గురించి త్రిష చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
గట్టి పోటీ…
42 ఏళ్ల వయసులోనూ సినిమాల విషయంలో నవతరం హీరోయిన్లకు గట్టి పోటీ ఇస్తోంది త్రిష. ఈ ఏడాది ఇప్పటికే త్రిష హీరోయిన్‌గా నటించిన నాలుగు సినిమాలు రిలీజయ్యాయి. మలయాళం మూవీ ఐడెంటిటీతో పాటు తమిళంలో అజిత్‌తో విదాముయార్చి, గుడ్ బ్యాడ్ అగ్లీ, కమల్‌హాసన్‌తో థగ్ లైఫ్ సినిమాలు చేసింది.
Also Read – Amaravati: ఘనంగా శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ సమేత గోపయ్య స్వామి ఆలయ వార్షికోత్సవ వేడుకలు
తెలుగులోకి రీఎంట్రీ…
తెలుగులో చిరంజీవి విశ్వంభరలో హీరోయిన్‌గా నటిస్తోంది. సోషియో ఫాంటసీ మూవీతో దాదాపు ఎనిమిదేళ్ల గ్యాప్ తర్వాత టాలీవుడ్‌లోకీ రీఎంట్రీ ఇవ్వబోతుంది. ఇటీవలే ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. విశ్వంభర మూవీకి వశిష్ట మల్లిడి దర్శకత్వం వహిస్తున్నాడు. తమిళంలో సూర్య కరుప్పు మూవీలో ఓ కీలక పాత్ర పోషిస్తుంది.


