Trisha – Vijay: దళపతి విజయ్ ఇటీవలే పాలిటిక్స్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. తమిళగ కళగం వెట్రి పేరుతో సొంతంగా పార్టీ పెట్టాడు. వచ్చే ఏడాది ఎన్నికల్లో పోటీ చేయడానికి సిద్ధమయ్యాడు. విజయ్‌కి ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు మద్ధతుగా నిలిచారు. ఈ లిస్ట్‌లో హీరోయిన్ త్రిష చేరింది.
ఇటీవల దుబాయ్‌లో జరిగిన సైమా అవార్డ్స్ ఈవెంట్‌కు త్రిష హాజరైంది. ఈ ఈవెంట్‌లో త్రిషతో కలిసి నటించిన కోలీవుడ్ హీరోల గురించి చెప్పమని హోస్ట్‌లు ఆమెను కోరారు. విజయ్ ఫొటో రాగానే త్రిష ముఖం ఆనందంతో వెలిగిపోయింది. విజయ్… విజయ్ అంటూ అభిమానుల నుంచి కేరింతలు వినపడగానే చిరునవ్వులు చిందిస్తూ సిగ్గుతో మెలికలు తిరిగింది.
కలలు నెరవేరాలి.
విజయ్ పొలిటికల్ జర్నీపై సైమా ఈవెంట్‌లో ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది త్రిష. విజయ్ కొత్త జర్నీకి గుడ్‌లక్ అంటూ చెప్పింది. విజయ్ కన్న కలలన్ని నెరవేరాలి, అందుకు అతడు అర్హుడే అంటూ తెలిపింది. విజయ్ గురించి త్రిష చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
త్రిష కూడా విజయ్ పార్టీలో చేరే అవకాశం ఉందని కొందరు నెటిజన్లు చెబుతోన్నారు.
Also Read – Dhoni: రోల్స్ రాయిస్ కారుతో రాంచీ రోడ్ల పై ధోనీ షికారు..వీడియో వైరల్!
డేటింగ్ రూమర్స్…
విజయ్, త్రిష ప్రేమలో ఉన్నట్లుగా కొన్నాళ్లుగా కోలీవుడ్ నాట పుకార్లు షికారు చేస్తున్నాయి. విజయ్, త్రిష సన్నిహితంగా ఉన్న ఫొటోలు పలుమార్లు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. పొలిటికల్ పార్టీ ప్రారంభోత్సవంతో పాటు ఇటీవల జరిగిన కొన్ని కుటుంబ వేడుకల్లో విజయ్ సింగిల్‌గానే కనిపించాడు. త్రిష కారణంగానే విజయ్‌కి, అతడి భార్య సంగీతకు మధ్య మనస్పర్థలు మొదలైనట్లు కోలీవుడ్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. విజయ్‌పై ఉన్న ఇష్టం కారణంగానే 42 ఏళ్లు వచ్చినా ఇప్పటికి త్రిష పెళ్లి చేసుకోకుండా ఉందని అంటున్నారు. ఈ డేటింగ్ రూమర్లపై త్రిషతో పాటు విజయ్ ఇప్పటివరకు ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. ఔనని, కాదని చెప్పకపోవడం కూడా రూమర్లకు బలాన్ని చేకూర్చుతోంది.
విశ్వంభరతో రీఎంట్రీ…
ఈ రూమర్లతో సంబందం లేకుండా సినిమాల పరంగా ఫుల్ బిజీగా ఉంది త్రిష. చిరంజీవి విశ్వంభరతో లాంగ్ గ్యాప్ తర్వాత తెలుగులోకి రీఎంట్రీ ఇవ్వబోతుంది. సోషియో ఫాంటసీ కథాంశంతో తెరకెక్కిన ఈ మూవీ వచ్చే ఏడాది వేసవిలో రిలీజ్ కాబోతుంది.
మూడు సినిమాలు…
తమిళంలో ఈ ఏడాది ఇప్పటికే త్రిష నటించిన మూడు భారీ బడ్జెట్ సినిమాలు రిలీజయ్యాయి. అజిత్ గుడ్ బ్యాడ్ అగ్లీ, విదాముయార్చితో పాటు కమల్ హాసన్‌తో థగ్‌లైఫ్ సినిమాలు చేసింది. ప్రస్తుతం సూర్య కరుప్పు మూవీలో హీరోయిన్‌గా నటిస్తోంది.
Also Read – Murder in MP: భర్తను చంపిన మూడో భార్య: ప్రియుడితో కలిసి ఘాతుకం..!


