Brinda Web Series: బృంద వెబ్‌సిరీస్‌తో ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చింది త్రిష. క్రైమ్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన తెలుగు వెబ్ సిరీస్ గత ఏడాది సోనీ లివ్ ఓటీటీలో రిలీజై పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది. తాజాగా బృంద వెబ్‌సిరీస్‌కు సీజన్ 2 రాబోతుంది. ఈ విషయాన్ని సోనీ లివ్ అఫీషియల్‌గా ప్రకటించింది. త్రిష ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేసింది. నుదుటిపై గాయంతో ఓ సీరియస్ లుక్‌లో ఈ పోస్టర్‌లో త్రిష కనిపిస్తోంది. ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. త్వరలోనే బృంద సీజన్ 2 రిలీజ్ కానున్నట్లు సోనీ లివ్ ప్రకటించింది.
షూటింగ్ కంప్లీట్…
బృంద సీజన్ 2కు సంబంధించి ఇప్పటికే షూటింగ్ పూర్తయినట్లు సమాచారం. పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయట. హైదరాబాద్‌లో ఓ స్పెషల్ ఈవెంట్ ద్వారా వెబ్ సిరీస్ రిలీజ్ డేట్‌ను మేకర్స్ అనౌన్స్ చేయబోతున్నట్లు సమాచారం. అక్టోబర్‌లో ఈ క్రైమ్ థ్రిల్లర్ వెబ్‌సిరీస్ స్ట్రీమింగ్ అయ్యే అవకాశం ఉన్నట్లు చెబుతోన్నారు.
పోలీస్ ఆఫీసర్‌గా…
బృంద సీజన్ 2లో పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా త్రిష కనిపిస్తుందని అంటున్నారు. సెన్సేషనల్‌గా నిలిచిన ఓ కేసును తన టీమ్‌తో బృంద ఎలా సాల్వ్ చేసిందనే పాయింట్‌తో సీజన్ 2 రూపొందనున్నట్లు చెబుతున్నారు. సీజన్ 1కు మించిన ట్విస్ట్‌లు, టర్న్‌లతో బృంద 2 ఉంటుందని సమాచారం. బృంద 2లో త్రిషతో పాటు రవీంద్ర విజయ్ ఓ కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. తెలుగు, తమిళ భాషల్లో ఫేమస్ అయిన ఓ యాక్టర్ సీజన్ 2లో విలన్‌గా నటించబోతున్నట్లు తెలిసింది. బృంద 2 వెబ్ సిరీస్‌కు సూర్య వంగల దర్శకత్వం వహిస్తున్నాడు.
Also Read – Vastu:ఇంటికి పడమర వైపు ఈ వస్తువులు పెట్టారా..అయితే శని ప్రభావం గ్యారంటీ!
మలయాళ యాక్టర్…
బృంద సీజన్ 1 గత ఏడాది ఆగస్ట్‌లో సోనీ లివ్ ద్వారా ప్రేక్షకుల ముందుకొచ్చింది. క్రైమ్ ఇన్వేస్టిగేటివ్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన సిరీస్‌లో పోలీస్ ఆఫీసర్ రోల్‌లో నాచురల్ యాక్టింగ్‌తో త్రిష అదరగొట్టింది. ఈ సిరీస్‌లో మలయాళ నటుడు ఇంద్రజీత్ సుకుమారన్ కీలక పాత్ర పోషించాడు.
విశ్వంభరతో రీఎంట్రీ…
సినిమాల విషయంలో యంగ్ హీరోయిన్లకు గట్టి పోటీ ఇస్తోంది త్రిష. ప్రస్తుతం తెలుగులో చిరంజీవితో విశ్వంభర సినిమా చేస్తోంది త్రిష. ఈ సోషియో ఫాంటసీ మూవీతో తొమ్మిదేళ్ల తర్వాత టాలీవుడ్‌లోకి రీఎంట్రీ ఇస్తోంది. వచ్చే ఏడాది వేసవిలో విశ్వంభర రిలీజ్ కాబోతుంది. ఈ ఏడాది ఇప్పటికే త్రిష హీరోయిన్‌గా నటించిన నాలుగు సినిమాలు ప్రేక్షకుల ముందుకొచ్చాయి. తమిళంలో థగ్‌లైఫ్‌తో పాటు గుడ్ బ్యాడ్ అగ్లీ, విడా ముయార్చి, మలయాళంలో ఐడెంటిటీ సినిమాల్లో హీరోయిన్‌గా కనిపించింది. సూర్య కరుప్పు మూవీలో త్రిషనే హీరోయిన్. ఈ తమిళ సినిమా రిలీజ్‌కు సిద్ధంగా ఉంది.
Also Read – Rats: మీ ఇంట్లో ఎలుకల ఇబ్బంది ఉందా.. అయితే ఈ చిట్కాలు ఫాలో అవ్వండి!


