Heroines: కీర్తి సురేష్, సమంత, త్రిషతో పాటు మరికొంత మంది హీరోయిన్లు లాంగ్ గ్యాప్ తర్వాత టాలీవుడ్‌లోకి రీఎంట్రీ ఇస్తున్నారు. ఒకప్పుడు ఏడాదికి నాలుగైదు సినిమాలతో సందడి చేసిన ఈ ముద్దుగుమ్మలు తెలుగు తెరపై కనిపించి రెండు, మూడేళ్లు దాటిపోయింది. వివిధ కారణాలతో టాలీవుడ్‌కు బ్రేక్ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మలు కమ్‌బ్యాక్ కోసం రెడీ అయ్యారు.
కీర్తి సురేష్…
2023లో రిలీజైన భోళా శంకర్ తర్వాత తెలుగు సినిమాలకు రెండేళ్ల పాటు దూరంగా ఉంది కీర్తి సురేష్. తెలుగులో అవకాశాలు వచ్చినా పెళ్లి కారణంగా వాటిని రిజెక్ట్ చేసింది. మంచి సినిమాతో తిరిగి తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాలని ఎదురుచూసిన కీర్తి సురేష్ ఇటీవలే విజయ్ దేవరకొండ రౌడీ జనార్ధనకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. రవికిరణ్ కోలా దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో రాయలసీమ యువతిగా కీర్తి సురేష్ కనిపించబోతున్నట్లు సమాచారం. రూరల్ యాక్షన్ డ్రామా మూవీలో కీర్తి సురేష్ పాత్రకు ఇంపార్టెన్స్ ఎక్కువగానే ఉంటుందట. దిల్‌రాజు ఈ సినిమాను ప్రొడ్యూస్ చేస్తున్నారు.
Also Read – Fauzi Story: ‘ఫౌజీ’ కథకు మూలమేంటో రివీల్ చేసిన హను రాఘవపూడి
సమంత
టాలీవుడ్‌లోకి కమ్‌బ్యాక్ ఇచ్చేందుకు సమంత కూడా గట్టి ప్రయత్నాలే చేస్తోంది. హీరోయిన్‌గా తెలుగులో సినిమా చేసి సమంత రెండేళ్లు దాటిపోయింది. 2023లో శాకుంతలం, ఖుషి సినిమాలతో తెలుగు ప్రేక్షకుల ముందుకొచ్చింది. శాకుంతలం డిజాస్టర్‌గా నిలవగా…. ఖుషి యావరేజ్ టాక్ సొంతం చేసుకుంది. మయోసైటిస్‌తో పాటు విడాకుల కారణంగా టాలీవుడ్‌కు లాంగ్ బ్రేక్ ఇచ్చింది సమంత. ఇటవల రిలీజైన సొంత సినిమా శుభంలో గెస్ట్ రోల్‌లో తళుక్కున మెరిసింది. ప్రస్తుతం హీరోయిన్‌గా మా ఇంటి బంగారం పేరుతో క్రైమ్ కామెడీ మూవీ చేస్తోంది. నందిని రెడ్డి దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ మూవీని సమంత స్వయంగా నిర్మిస్తోంది.
పూజా హెగ్డే…
2022లో రిలీజైన ఆచార్య.. పూజా హెగ్డే తెలుగులో చేసిన చివరి మూవీ. వరుస పరాజయాల కారణంగా తెలుగులో మూడేళ్లు ఒక్క అవకాశాన్ని కూడా అందుకోలేకపోయింది పూజా హెగ్డే. టాలీవుడ్‌లోకి రీఎంట్రీ కోసం చాలా రోజులుగా ఎదురుచూస్తున్న పూజా హెగ్డే.. ఇటీవలే దుల్కర్ సల్మాన్ సినిమాలో అవకాశాన్ని దక్కించుకుంది. రొమాంటిక్ లవ్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఈ సినిమాకు రవి నేలకుదిటి దర్శకత్వం వహిస్తున్నారు.
త్రిష…
దాదాపు తొమ్మిదేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత విశ్వంభర మూవీతో త్రిష తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. 2016లో రిలీజైన నాయకి తర్వాత పూర్తిగా తమిళ సినిమాలపైనే ఫోకస్ పెట్టిన త్రిష టాలీవుడ్‌కు గ్యాప్ ఇచ్చింది. చిరంజీవి విశ్వంభరలో ఛాన్స్ దక్కించుకొని ఆడియెన్స్‌ను సర్‌ప్రైజ్ చేసింది. ఈ ఫాంటసీ యాక్షన్ థ్రిల్లర్ మూవీ 2026 సమ్మర్‌లో రిలీజ్ కాబోతుంది. స్టాలిన్ తర్వాత చిరంజీవి, త్రిష కాంబినేషన్‌లో రూపొందుతోన్న ఈ మూవీకి వశిష్ట మల్లిడి దర్శకత్వం వహిస్తున్నారు.
Also Read – Pooja Hegde: అప్పుడు హీరోయిన్ – ఇప్పుడు ఐటెంసాంగ్ – అల్లు అర్జున్ సినిమాలో పూజా హెగ్డే?
నయనతార కూడా చిరంజీవి మన శంకర వరప్రసాద్‌గారు మూవీతో మూడేళ్ల తర్వాత తెలుగులోకి తిరిగి అడుగుపెట్టబోతుంది. చివరగా చిరంజీవితోనే గాడ్‌ఫాదర్ సినిమా చేసింది. గాడ్‌ఫాదర్‌లో చిరంజీవి సోదరిగా కనిపించిన నయనతార మన శంకర వరప్రసాద్‌గారులో మాత్రం హీరోయిన్‌గా నటిస్తోంది.


