SPIRIT: సినిమా ఇండస్ట్రీలో ఇప్పుడు ఒక కొత్త ట్రెండ్ నడుస్తోంది. స్టార్ హీరోల వారసులు డైరెక్ట్‌గా హీరోలుగా కాకుండా, ముందుగా సినిమా మేకింగ్ నేర్చుకోవడానికి అసిస్టెంట్ డైరెక్టర్లుగా జాయిన్ అవుతున్నారు. ఈ ట్రెండ్‌లో రీసెంట్ గా, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ వారసుడు రిషి మనోజ్, మాస్ మహారాజా రవితేజ వారసుడు మహాధన్ భూపతిరాజు ఇద్దరూ అసిస్టెంట్ డైరెక్టర్లుగా చేరారు.
త్రివిక్రమ్ వారసుడు రిషి మనోజ్, రవితేజ వారసుడు మహాధన్.. ఇద్దరూ వంగా దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా రాబోతున్న భారీ ప్రాజెక్ట్ ‘స్పిరిట్’ సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్స్‌గా జాయిన్ అయ్యారు. ఇంత పెద్ద ప్రాజెక్ట్‌లో పని చేయడం అనేది వీళ్లకు బెస్ట్ ట్రైనింగ్. రిషి మనోజ్ అంతకుముందు కూడా విజయ్ దేవరకొండ సినిమా ‘కింగ్ డమ్’ కోసం కూడా ఏడీగా పని చేసాడు. అలాగే, పవన్ కళ్యాణ్ వారసుడు అకిరా నందన్ కూడా దర్శకుడు సుజీత్ దగ్గర ‘ఓజి’ సినిమాకి వర్క్ చేసాడు.
ALSO READ: SS Rajamouli: శంకర్, హిరానీ తర్వాత ఇప్పుడు రాజమౌళి టర్న్!
మరి ఈ స్టార్ వారసులు భవిష్యత్తులో ఏం అవుతారు? వీళ్లు డైరెక్టర్లుగా మారతారా, లేక హీరోలుగానే ఎంట్రీ ఇస్తారా? అనేది ఇప్పుడందరిలో ఉన్న చర్చ. అయితే, ఏ ఫీల్డ్ ఎంచుకున్నా, డైరెక్షన్ డిపార్ట్‌మెంట్‌లో వచ్చిన అనుభవం మాత్రం ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది. కెమెరా వెనుక వర్క్ చేస్తే, సినిమా అంటే ఏంటి, దాన్ని ఎలా తీయాలి, టెక్నికల్ విషయాలు ఏంటి వంటి చాలా విషయాలు తెలుస్తాయి. ఇండస్ట్రీలో స్టార్‌గా ఉన్న చాలా మంది హీరోలు కూడా మొదట్లో అసిస్టెంట్ డైరెక్టర్స్‌గా పనిచేశారు. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ మన ‘న్యాచురల్ స్టార్’ నాని. నాని యాక్టర్‌గా మారకముందు, లెజెండరీ డైరెక్టర్ బాపు వంటి వారి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్‌గా వర్క్ చేశాడు. ఈ అనుభవం వల్లే ఆయనకు నటనతో పాటు, కథ, టెక్నికల్ విషయాలపై పూర్తి అవగాహన వచ్చింది. అందుకే, ఇప్పుడు త్రివిక్రమ్, రవితేజ వారసులు కూడా నాని లాగే ముందుగా డైరెక్షన్ స్కిల్స్ నేర్చుకుంటున్నారు. ఈ అనుభవం వాళ్ల కెరీర్‌కు ఖచ్చితంగా పెద్ద బూస్ట్‌గా మారుతుంది.


