Prabhas Spirit Film: హీరోలతో సమానంగా తెలుగులో స్టార్‌డమ్‌ను సొంతం చేసుకున్న దర్శకుల్లో త్రివిక్రమ్ ఒకరు. త్రివిక్రమ్ సినిమాలకు టాలీవుడ్‌లో సఫరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. తెలుగు కమర్షియల్ సినిమాకు ఓ కొత్త ట్రెండ్‌ను సెట్ చేశారు త్రివిక్రమ్. మాటల మాంత్రికుడిగా పేరు తెచ్చుకున్న త్రివిక్రమ్ స్ఫూర్తితో డైలాగ్స్ రైటర్స్, డైరెక్టర్లుగా మారిన వాళ్లు చాలా మందే ఉన్నారు. తాజాగా త్రివిక్రమ్ తనయుడు రిషి మనోజ్ సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. యాక్టర్‌గా కాదు అసిస్టెంట్ డైరెక్టర్‌గా. రిషి మనోజ్ అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేస్తుంది తండ్రి త్రివిక్రమ్ దగ్గర కాదట. ప్రభాస్ సినిమా కోసం మరో టాప్ డైరెక్టర్ దగ్గర అసిస్టెంట్‌గా రిషి మనోజ్ వర్క్ చేయబోతున్నాడంటూ టాలీవుడ్‌లో ప్రచారం జరుగుతోంది.
స్పిరిట్ మూవీకి…
ప్రభాస్ హీరోగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రూపొందుతున్న స్పిరిట్ మూవీ సెప్టెంబర్ నుంచి మొదలుకాబోతుంది. యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాపై పాన్ ఇండియన్ లెవెల్‌లో భారీగా హైప్ నెలకొంది. స్పిరిట్ సినిమాకు సందీప్ రెడ్డి వంగా దగ్గర త్రివిక్రమ్ కొడుకు రిషి మనోజ్ అసిస్టెంట్ డైరెక్టర్‌గా జాయిన్ అయినట్లు సమాచారం. ప్రస్తుతం స్పిరిట్ ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. వీటిలో రిషి మనోజ్ భాగమైనట్లు తెలిసింది.
షార్ట్ ఫిల్మ్స్…
రిషి మనోజ్‌కు డైరెక్షన్‌తో పాటు యాక్టింగ్‌లోనూ ఇంట్రెస్ట్ ఉందట. గతంలో నిశాచరుడు అనే షార్మ్ ఫిల్మ్‌కు దర్శకత్వం వహిస్తూనే ఇందులో లీడ్ రోల్‌లో రిషి మనోజ్ నటించాడు. స్టాగ్నేషన్ అనే మరో షార్ట్ ఫిల్మ్‌కు ఎడిటర్‌గా పనిచేశాడు. రిషి మనోజ్‌తో పాటు మాస్ మహారాజా రవితేజ తనయుడు మహాధన్ కూడా స్పిరిట్ మూవీకి అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నట్లు టాలీవుడ్‌లో ప్రచారం జరుగుతోంది.
దీపికా పదుకోణ్ అనుకొని…
యానిమల్ బ్లాక్‌బస్టర్ తర్వాత సందీప్ రెడ్డి వంగా తెరకెక్కిస్తున్న స్పిరిట్ మూవీలో ప్రభాస్‌కు జోడీగా త్రిప్తి డిమ్రి హీరోయిన్‌గా నటిస్తోంది. తొలుత దీపికా పదుకోణ్ హీరోయిన్‌గా కన్ఫామ్ అయినట్లు ప్రచారం జరిగింది. కానీ షూటింగ్ మొదలుకాకముందే సందీప్ వంగాతో వచ్చిన క్రియేటివ్ డిఫరెన్సెస్ కారణంగా ఆమె ఈ సినిమా నుంచి తప్పుకోవడం బాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ఇన్‌డైరెక్ట్‌గా దీపికాను ఉద్దేశిస్తూ సందీప్ వంగా చేసిన ట్వీట్స్ అప్పట్లో వైరల్ అయ్యాయి. సందీప్ వంగాపై కోపంతో దీపికా పదుకోణ్ పీఆర్ టీమ్ స్పిరిట్ స్టోరీని లీక్ చేసినట్లు బాలీవుడ్‌లో పుకార్లు వినిపించాయి. స్పిరిట్ మూవీకి అర్జున్ రెడ్డి, యానిమల్ ఫేమ్ హర్షవర్ధన్ రామేశ్వరన్ మ్యూజిక్ అందిస్తున్నాడు. ఈ మూవీలో కొరియన్ యాక్టర్ డాన్ లీ విలన్‌గా నటిస్తున్నట్లు సమాచారం.
Also Read- Nidhhi Agerwal Controversy: నిధి అగర్వాల్ కారు కాంట్రవర్సీ.. క్లారిటీ ఇచ్చిన బ్యూటీ
మరోవైపు ప్రస్తుతం త్రివిక్రమ్ వెంకటేష్‌తో ఓ మూవీ చేయబోతున్నాడు. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందనున్న ఈ మూవీ త్వరలోనే సెట్స్‌పైకి రానుంది. వెంకటేష్ మూవీ తర్వాత ఎన్టీఆర్‌తో ఓ మైథలాజికల్ మూవీని తెరకెక్కించనున్నాడు.


