Saturday, November 15, 2025
Homeచిత్ర ప్రభSayami Kher : నా ఫేస్, బాడీపై దారుణంగా విమర్శలు చేశారు..

Sayami Kher : నా ఫేస్, బాడీపై దారుణంగా విమర్శలు చేశారు..

- Advertisement -

Sayami Kher : టాలీవుడ్ లో రేయ్ సినిమాతో చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చింది బాలీవుడ్ భామ సయామీ ఖేర్, అనంతరం హిందీలో సినిమాలు చేస్తూ అక్కడే ఉండిపోయింది. ఇటీవల నాగార్జున సరసన వైల్డ్ డాగ్ సినిమాలో మళ్ళీ టాలీవుడ్ లో కనిపించింది. ప్రస్తుతం హిందీలోనే పలు సినిమాలు, సిరీస్ లు చేస్తుంది.

తాజాగా సయామీఖేర్ బాలీవుడ్ లో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో కెరీర్ మొదట్లో నా బాడీపై, ఫేస్ పై దారుణంగా విమర్శలు చేశారని తెలిపింది.

సయామీ ఖేర్ మాట్లాడుతూ.. ”నా కెరీర్ మొదట్లో నన్ను చాలా వెక్కిరించేవారు. నా లిప్స్, నోస్ కి సర్జరీ చేయించుకోమని చెప్పేవాళ్ళు. నా బాడీపై కూడా విమర్శలు చేసేవాళ్ళు. ఆ సమయంలో నేను చాలా బాధపడ్డాను. అలంటి అసహ్యకరమైన వ్యాఖ్యలు చేయడం విచారకరం. ఇతరుల శరీరం గురించి మాట్లాడేటప్పుడు సున్నితంగా ఆలోచించాలని వాళ్ళకి తెలీదు. అవతలి వాళ్ళు ఎంత బాధపడతారో అని ఆలోచించరు. ఇంకొకరి మీద విమర్శలు చేసేముందు తమ గురించి తాము ఆలోచించుకోవాలి” అని చెప్పింది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad