Cases On Dasari Kiran Kumar: రామ్ గోపాల్ వర్మ (Ram Gopal Varma) తెరకెక్కించిన ‘వ్యూహం’ సినిమా నిర్మాత దాసరి కిరణ్ కుమార్ పై వరుస ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ఇటీవల ఆయనపై ఇప్పటికే మూడు కేసులు నమోదైన సంగతి తెలిసిందే. తాజాగా మరో రెండు ఫిర్యాదులు రావడంతో మొత్తం కేసుల సంఖ్య ఐదుకు చేరుకున్నాయి. ఈ వరుస కేసులతో పోలీసులు ఆయనను తిరిగి అరెస్ట్ చేసేందుకు సన్నద్ధమవుతున్నారు. ఇటీవలే ఆర్థిక మోసం చేశాడంటూ వచ్చిన ఫిర్యాదుతో ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఆయన్ని అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే సదరు కేసుకు సంబంధించిన దాసరి కిరణ్ త్వరగానే బెయిల్ పై విడుదలయ్యారు.
ప్రగతి నగర్ కేసు..
కొత్త ఫిర్యాదులు, తీవ్రమైన ఆరోపణలు బెయిల్ పై విడుదలైన తర్వాత కూడా కిరణ్ పై ఫిర్యాదులు ఆగడం లేదు. తాజాగా గాజుల మహేష్ అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు దాసరి కిరణ్ కుమార్ పై రెండు కొత్త కేసులు నమోదయ్యాయి. అలాగే హైదరాబాద్ ప్రగతి నగర్‌కి చెందిన సాఫ్ట్ వేర్ ఇంజనీర్ శివ కుమార్ కూడా దాసరి కిరణ్ కుమార్‌పై ఫిర్యాదు చేశారు. శివ కుమార్ నుంచి దాసరి కిరణ్ కుమార్ రూ.58 లక్షలు తీసుకుని స్థలం అమ్మినప్పటికీ ఇంకా రిజిస్ట్రేషన్ చేయకుండా తప్పించుకు తిరుగుతున్నారని ఆరోపించారు. దీనిపై ప్రశ్నిస్తే కిరణ్ తనపై దాడి చేశారని శివ కుమార్ ఫిర్యాదులో పేర్కొన్నారు.
Also Read – Mirai Movie Release Date: సోలో డేట్ దొరకకపోతే కష్టమే..
రాజేంద్రనగర్ కేసు..
హైదరాబాద్ రాజేంద్ర నగర్‌కు చెందిన కోట శశికాంత్ ఇచ్చిన ఫిర్యాదు కూడా నమోదైంది. శశికాంత్ నుంచి రూ.53 లక్షలు అప్పుగా తీసుకున్న కిరణ్ తిరిగి చెల్లించకుండా మోసం చేశారని తెలిపారు. డబ్బులు తిరిగి అడిగినందుకు కిరణ్ తన అనుచరులతో దాడి చేశారని శశికాంత్ ఆరోపించారు.దీంతో దాసరి కిరణ్ కుమార్ పై నమోదు చేసిన కేసుల సంఖ్య ఐదుకు చేరుకుంది. పోలీసులు ఈ కేసులను తీవ్రంగా పరిగణించి కిరణ్‌ను అరెస్ట్ చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు.
దాసరి కిరణ్ తెలుగు చిత్ర పరిశ్రమలో రామదూత క్రియేషన్స్ బ్యానర్ ను స్థాపించి పలు చిత్రాలను నిర్మించారు. వివాదాలకు మారుపేరైన రామ్ గోపాల్ వర్మ (Ram Gopal Varma) దర్శకత్వంలో వచ్చిన వంగవీటి చిత్రానికి నిర్మాతగా వ్యవహరించారు. అలాగే హవీష్ హీరోగా రూపొందిన జీనియస్ సినిమాను కూడా దాసరి కిరణ్ నిర్మించారు. సీరియల్ నటుడు ఆర్కే సాగర్ (RK Sagar)తో సిద్ధార్థ్ అనే చిత్రాన్ని కూడా రూపొందించారు.
Also Read – Cyber Crime : ట్రాఫిక్ చలానా పేరుతో మోసం.. రూ.1.36 లక్షలు కాజేసిన మోసగాళ్లు!


