Anchor Udaya Bhanu: ప్రస్తుతం టాలీవుడ్‌లో యాంకర్ సుమ లేకుండా సినిమా ప్రమోషన్స్ కనిపించడం లేదు. స్టార్ హీరోల సినిమాలకు సంబంధించిన ప్రీ రిలీజ్ ఫంక్షన్లు, ఈవెంట్లు, ఇంటర్వ్యూలు ఏవైనా సుమ ఉండాల్సిందే. చిన్న సినిమాలు, డబ్బింగ్ మూవీస్ ఏవైనా సుమతో ఏదో ఒక ఈవెంట్ ఉండేలా మేకర్స్ ప్లాన్స్ చేస్తున్నారు. సుమ డేట్స్ లేకపోతే ఈవెంట్లను క్యాన్సిల్ చేసే పరిస్థితి నెలకొంది. సుమ తర్వాత స్రవంతి, మంజుషా చిన్న, మిడ్ రేంజ్ సినిమాల ప్రమోషన్స్‌లో ఎక్కువగా కనిపిస్తున్నారు.
ఝాన్సీ, ఉదయభాను…
ఒకప్పుడు సుమ ఫేమస్ కాకముందు సినిమా ఈవెంట్స్‌లో యాంకర్లుగా ఉదయభాను, ఝాన్సీ ఎక్కువగా కనిపించేవారు. ఝాన్సీ యాంకరింగ్‌కు పూర్తిగా దూరమైంది. ఉదయభాను మాత్రం చాలా రోజుల తర్వాత సుహాన్ హీరోగా నటించిన ఓ భామ అయ్యో రామ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో కనిపించింది. ఈ ఈవెంట్‌లో తాను యాంకరింగ్‌కు దూరం కావడానికి గల కారణాలపై ఉదయభాను ఆసక్తికర కామెంట్స్ చేసింది. మళ్లీ ఉదయభాను యాంకరింగ్ చేయడం ఆనందంగా ఉందంటూ ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు వచ్చిన గెస్టులు అన్నారు. వారి మాటలకు సమాధానమిస్తూ “ఇదొక్కటే చేశాను. మరో ఈవెంట్ చేస్తానో లేదో గ్యారంటీ లేదు. యాంకరింగ్‌లో పెద్ద సిండికేట్ ఎదిగింది” అంటూ ఉదయభాను అన్నది. “రేపే ఈవెంట్ అనుకుంటాం. కానీ చేసే రోజుకు ఆ ఈవెంట్ ఉండదు. సుహాన్ వల్లే ఈ ఈవెంట్ చేయగలిగాను, తన మనసులో నుంచి వచ్చిన మాట ఇదని” స్టేజ్‌పైనే కామెంట్స్ చేసింది ఉదయభాను.
Also Read – Kubera: ‘కుబేర’ నిర్మాతలకు షాక్.. థియేటర్స్‌లో ఉండగానే ఓటీటీలోకి..స్ట్రీమింగ్ డేట్ ఇదే!
వంద బుల్లెట్లు…
రైటర్ కమ్ డైరెక్టర్ మచ్చరవికి ఉదయభాను మధ్య జరిగిన సంభాషణ కూడా ఈ ఈవెంట్‌లో ఆసక్తిని రేకెత్తించింది. ఉదయభాను మైక్ పట్టుకుంటే ఒక నారి వంద తుపాకుల టైప్‌లో ఉంటుందని మచ్చ రవి అన్నారు. “నాకు చాలా బుల్లెట్లు తగిలాయి. అవి ఎవరికి తెలియదు” అని మచ్చ రవి మాటలపై రియాక్ట్ అయ్యింది ఉదయభాను. ఆమె మాటలను కొనసాగిస్తూ మీరు ఇలాగే బుల్లెట్స్ వేస్తుంటారు అని మచ్చ రవి అన్నాడు. యాంకరింగ్ సిండికేట్ తనకు అవకాశాలు రాకుండా ఎలా తొక్కేస్తుంది ఇన్‌డైరెక్ట్‌గా ఓ భామ అయ్యో రామా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో బయటపెట్టింది ఉదయభాను.
స్పెషల్ సాంగ్స్…
యాంకర్‌గా లైమ్‌లైట్‌లో ఉన్న టైమ్‌లో కొన్ని సినిమాలు చేసింది ఉదయభాను. వేటగాడు, కొండవీటి సింహాసనం, శ్రావణమాసం, మధుమతి సినిమాల్లో డిఫరెంట్ రోల్స్ చేసింది. లీడర్, జూలై మూవీస్‌లో స్పెషల్ సాంగ్స్‌లో కనిపించింది.
Also Read – HUL CEO : ప్రియా నాయర్ ఎవరు.. HUL చరిత్రలో తొలి మహిళా CEOగా నియామకం


