Udayabhanu: ఒకప్పుడు టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా కొనసాగిన ఉదయభాను లాంగ్ గ్యాప్ తర్వాత త్రిబాణధారి బార్బరిక్ మూవీతో సిల్వర్‌స్క్రీన్‌పై కనిపించబోతున్నది. ఈ మూవీలో నెగెటివ్ క్యారెక్టర్‌లో ఉదయభాను నటిస్తోంది. ఆగస్ట్ 22న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. త్రిబాణదారి బార్బరిక్ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా తెలుగు రియాలిటీ షోస్ తో పాటు తన యాంకర్‌గా తాను ఎదుర్కొన్న ఆటుపోట్లపై ఉదయభాను ఆసక్తికర కామెంట్స్ చేసింది.
మిస్టరీ రివీల్…
టీవీ రియాలిటీ షోస్‌లో కంటెస్టెంట్స్ ఒకరితో మరొకరు గొడవలు పడటం అప్పుడప్పుడు కనిపిస్తుంటాయి. కొన్నిసార్లు ఈ గొడవలు కొట్టుకునే వరకు వెళుతుంటాయి. ఈ కాంట్రవర్సీల ద్వారా ఆడియెన్స్‌లో ఆ రియాలిటీ షోస్ పట్ల ఆసక్తిని క్రియేట్ చేస్తుంటారు మేకర్స్. ఆ కాంట్రవర్సీల వెనకున్న మిస్టరీని బయటపెట్టింది ఉదయభాను.
Also Read – Kangana Ranaut: సహజీవనం, డేటింగ్ యాప్స్ పై తీవ్ర విమర్శలు
అంతా స్క్రిప్టెడ్…
ఇప్పుడొచ్చే రియాలిటీ షోస్‌లో యాంకర్స్ చేసేది ఏం ఉండదని ఉదయభాను అన్నది. గొడవలు, కాంట్రవర్సీలు అన్ని స్క్రిప్టెడ్ అని చెప్పింది. వారిని తిట్టండి, ఇక్కడ నవ్వండి.. అక్కడ కొప్పడండి అంటూ షో క్రియేటర్స్.. యాంకర్స్‌కు చెబుతుంటారు. వారు చెప్పింది చేయడమే యాంకర్స్ పని అన్నది. తాను ఈ మధ్యకాలంలో అలాంటి షోస్ రెండు చేశానని అన్నది. ఆ తర్వాత వాటిని ఎందుకు ఒప్పుకున్నానా అని బాధపడ్డానని ఉదయభాను పేర్కొన్నది.
మరొకరికి ఛాన్స్…
యాంకర్‌గా కెరీర్‌లో ఎన్నో ఎత్తుపల్లాలు ఎదుర్కొన్నానని ఉదయభాను చెప్పింది. తనకు జరిగిన అన్యాయాలను త్వరలోనే వెల్లడిస్తానని తెలిపింది. “ఈవెంట్స్ కోసం తొలుత నన్ను సంప్రదించేవారు. రెడీ అయ్యి ఈవెంట్‌కు వెళ్లిన తర్వాత ఆ ఛాన్స్ మరొకరికి ఇచ్చేవారు. అలా ఈవెంట్స్‌కు వెళ్లి వెనక్కి వచ్చిన సందర్భాలు చాలానే ఉన్నాయి. టీవీ షోస్ కోసం నా డేట్స్ తీసుకున్నారు. ఆ తర్వాత ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండానే ఆ షోస్ నుంచి నన్ను తీసేశారు” అని ఉదయభాను చెప్పింది. తన ఇంట్లో బౌన్స్ అయినవి, నాకు డబ్బులు చెల్లించని వాళ్ల చెక్కులు చాలానే ఉన్నాయని, వాటితో తోరణాలు కట్టేయచ్చనని ఉదయభాను కామెంట్స్ చేసింది.
Also Read – Shubhanshu Shukla : గగన యానం నుంచి ఘన స్వాగతం.. ప్రధాని మోదీతో వ్యోమగామి శుభాంశు భేటీ!
డబ్బు మనిషి అంటూ నిందలు…
డబ్బులు ఇవ్వకపోయినా చాలా షోస్ చేశానని, ఎప్పుడైనా గట్టిగా పేమెంట్స్ గురించి అడిగితే.. నన్ను బతిమిలాడిన వాళ్లే డబ్బు మనిషి అంటూ తనపై నిందలు మోపారని ఆవేదనను వ్యక్తం చేసింది ఉదయభాను. ఇండస్ట్రీలో తనకు జరిగిన అన్యాయాలను త్వరలోనే బయటపెడతానని, ఆ రోజు పెద్ద యుద్దాలే జరుగుతాయని ఉదయభాను అన్నది. ఉదయభాను చేసిన కామెంట్స్ టాలీవుడ్‌లో వైరల్ అవుతున్నాయి.


