మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, బుచ్చిబాబు సాన దర్శకత్వంలో రూపొందుతున్న RC16 మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇటీవలే చరణ్ పుట్టినరోజు సందర్భంగా చిత్రబృందం ఈ సినిమాకు ‘పెద్ది’ అనే పవర్‌ఫుల్ టైటిల్‌ను ప్రకటించి, ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు. అయితే అభిమానులు గ్లింప్స్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తుండగా, టెక్నికల్ కారణాల వల్ల అది వాయిదా పడింది.
అయితే ఉగాది పండగ సందర్భంగా చిత్రయూనిట్ నుంచి ఓ క్రేజీ అప్డేట్ వచ్చింది. శ్రీరామనవమి కానుకగా ఏప్రిల్ 6న ‘పెద్ది’ ఫస్ట్ షాట్ – గ్లింప్స్ వీడియో విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా రామ్ చరణ్ కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు. గాల్లో పవర్‌ఫుల్‌గా జంప్ చేస్తూ ఉన్న ఈ లుక్, అభిమానుల ఉత్సాహాన్ని రెట్టింపు చేస్తోంది.

ఈ చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తుండగా, కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ (శివన్న), ‘మిర్జాపూర్’ ఫేమ్ దివ్యేందు కీలక పాత్రలు పోషిస్తున్నారు. భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ సినిమాను వృద్ధి సినిమాస్, మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లపై నిర్మిస్తున్నారు.
ఇప్పటికే టైటిల్ అనౌన్స్‌మెంట్‌తో హైప్ క్రియేట్ చేసిన చిత్రయూనిట్, ఇప్పుడు గ్లింప్స్ డేట్‌ను ప్రకటించడంతో మెగా ఫ్యాన్స్‌లో భారీ అంచనాలు పెరిగిపోయాయి. ఏప్రిల్ 6న రాబోయే ‘పెద్ది’ గ్లింప్స్ ఏ స్థాయిలో ఉంటుందో చూడాలి.