Sunday, July 7, 2024
Homeచిత్ర ప్రభUnstoppable 2 Promo : ప్రభాస్ - గోపీచంద్ ప్రోమో..రికార్డుస్థాయిలో వ్యూస్

Unstoppable 2 Promo : ప్రభాస్ – గోపీచంద్ ప్రోమో..రికార్డుస్థాయిలో వ్యూస్

అన్ స్టాపబుల్ 2 లో బాలయ్యతో బాహుబలిని ఎప్పుడెప్పుడు చూస్తామా అని అభిమానులు ఎంతో ఆశగా ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఈ ఎపిసోడ్ కు సంబంధించిన ఫొటోలు, ప్రోమోలను విడుదల చేసిన మేకర్స్.. శనివారం రాత్రి.. ప్రోమోను విడుదల చేశారు. ఈ ప్రోమోలో వింటేజ్ ప్రభాస్ ను చూసి ఫ్యాన్స్ ఎమోషనల్ అవుతున్నారు. ప్రభాస్ పెళ్లి, క్రష్ లతో పాటు.. నిజజీవిత ఘటనలు, సినిమాల్లో ఎదుర్కొన్న ఎదురుదెబ్బల గురించి బాలయ్య ఇంటర్వ్యూ చేసినట్లు తెలుస్తోంది. గోపీచంద్ ప్రభాస్.. మధ్యలో ఫోన్ కాల్ లో రామ్ చరణ్ చేసిన సందడి అంతా ఇంతా కాదు.

- Advertisement -

ప్రభాస్ చెప్పిన బుజ్జిగాడు డైలాగ్ కు.. ఆడియన్స్ ఫిదా అయిపోయారు. ప్రోమో ఫుల్ ఎనర్జిటిక్‌గా ఉంది. కొంతకాలంగా ప్రభాస్ నటిస్తున్న సినిమాల్లో అతని చలాకీతనం కనిపించకపోవడంతో తమ డార్లింగ్ ను మిస్ అవుతున్నామని సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు పోస్టుపెట్టారు. తాజాగా విడుదలైన ప్రోమోలో తమ డార్లింగ్ ను.. తామెలా చూడాలనుకున్నామో అలా కనిపించారంటూ ఎమోషనల్ గా ఫీల్ అవుతున్నా ఫ్యాన్స్. ‘వింటేజ్ ప్రభాస్ ఈజ్ బ్యాక్’ అంటూ వీడియోలు ఎడిట్ చేసి పోస్ట్ చేస్తున్నారు. ఈ ప్రోమోకు రికార్డు స్థాయిలో ఇప్పటి వరకూ 3.4 మిలియన్ వ్యూస్ వచ్చాయి.

ప్రోమో చూసిన నెటిజన్లంతా.. ఈ షో ని ఇప్పటి వరకూ బాలయ్య కోసం చూశాం కానీ.. ఈ ఎపిసోడ్ ప్రభాస్ కోసం చూస్తామని కామెంట్ చేస్తున్నారు. ఈ ఎపిసోడ్ డిసెంబర్ 30న ఆహాలో స్ట్రీమ్ కానుంది. ప్రోమోనే ఇలా ఉంటే.. ఫుల్ ఎపిసోడ్ ఇంకెలా ఉంటుందో కదా.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News